Shaik Madar Saheb
Chief Sub-Editor, Politics, Hyper Local, Crime, Lifestyle, Health - TV9 Telugu
madarsaheb.shaik@tv9.comషేక్ మదార్ సాహెబ్, టీవీ9 తెలుగులో చీఫ్ సబ్-ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలలో శిక్షణ పొంది 2016 నుంచి కెరీర్‌ను ప్రారంభించాను. గతంలో ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్‌గా, జీ మీడియా (ఢిల్లీ) లో అసిస్టెంట్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా, సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేశాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన పొలిటికల్, హైపర్ లోకల్, క్రైమ్, జాతీయం, అంతర్జాతీయం ఆర్టికల్స్‌ను అందిస్తాను. అలాగే లైఫ్‌స్టైల్, హెల్త్, ట్రెండింగ్, వైరల్‌కు సంబంధించిన ఆసక్తికర వార్తలను రాస్తాను.
నరాలకు, కండరాలకు శక్తినిచ్చే అద్భుతమైన ఫుడ్.. రోజుకు ఒక్కటి తినండి చాలు..
అరటిపండులో పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, పీచు వంటి పోషకాలు ఉంటాయి. రోజువారీ ఆహారంలో అరటిపండును చేర్చుకోవడం వల్ల నరాలు, కండరాల సాధారణ పనితీరు, జీర్ణక్రియ, శక్తి, గుండె ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి..
- Shaik Madar Saheb
- Updated on: Oct 8, 2026
- 1:11 pm
ఇప్పుడే వద్దు.. UPI పేమెంట్స్‌పై MDR ఛార్జీలు అప్పటివరకు వాయిదా..!
యూపీఐ చెల్లింపులపై కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు మించిన కొన్ని P2M లావాదేవీలపై 0.4 శాతం MDR అమలు చేయాల్సి ఉండగా.. దీనిని 2027 జనవరి 1 వరకు వాయిదా వేయాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఈ ప్రతిపాదనపై NPCI, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం.
- Shaik Madar Saheb
- Updated on: Oct 8, 2026
- 12:49 pm
యాంటీఆక్సిడెంట్లకు మూలం.. 4 ఆకులు తింటే మస్త్ బలం.. జుట్టు అద్భుతంగా పెరుగుతుంది..
కరివేపాకుల్లో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు దాగున్నాయి.. ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు వంటి పలు పోషకాలు ఉంటాయి. దీన్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ, ఎముకలు, గుండె, జుట్టు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Oct 8, 2026
- 12:18 pm
ఫుల్లుగా ఫైబర్.. బరువు తగ్గాలనుకునేవారికి, డయాబెటిస్ ఉన్నవారికి సూపర్ రొట్టె.. ఎలాగైనా తినొచ్చు..
నూనె లేకుండా సొరకాయ, జొన్న పిండి, శనగపిండితో రుచికరమైన రొట్టెను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఫైబర్ అందించే ఈ రెసిపీని అల్పాహారం లేదా రాత్రి భోజనంగా తీసుకోవచ్చు.. ఇది బరువు తగ్గాలనుకునే వారికి.. డయాబెటిస్ ఉన్న వారికి అద్భుతమైన ఆహారమని డైటీషియన్లు చెబుతున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Oct 8, 2026
- 9:15 am
ఆ మేయర్ సీట్లు ఎవరికి..? టీడీపీ, జనసేన, బీజేపీ.. ఎవరి లెక్కలు వారివే
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు వేగం పెరుగుతున్న వేళ మేయర్ సీట్లపై టీడీపీ, జనసేన, బీజేపీ వ్యూహాలు ఆసక్తికరంగా మారాయి. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి తదితర కీలక నగరాలపై ఎవరి ఫోకస్ ఉందన్న చర్చ సాగుతోంది. అయితే సీట్ల తుది పంపకం, అభ్యర్థుల ఖరారు ఇంకా జరగలేదు.
- Shaik Madar Saheb
- Updated on: Oct 8, 2026
- 8:44 am
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
Gold Silver Rates Today: గురువారం అక్టోబర్ 8న బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. 24, 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.10 తగ్గగా.. వెండి కిలోపై రూ.100 తగ్గింది. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఇలా ఉన్నాయి.
- Shaik Madar Saheb
- Updated on: Oct 8, 2026
- 6:35 am
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది.. డైలీ రెండు స్పూన్లు తినండి చాలు..
నువ్వుల్లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. నువ్వుల పొడిని సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎముకలు, గుండె, నరాల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందవచ్చు. అయితే, నువ్వుల పొడిని ఎలా తయారు చేసి.. తినాలో ఈ కథనంలో తెలుసుకోండి..
- Shaik Madar Saheb
- Updated on: Oct 7, 2026
- 1:32 pm
3 రెమ్మల నీళ్లతో ఇలా చేస్తే జుట్టు రాలమన్నా రాలదు.. పైగా నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది
ఆధునిక జీవనశైలి, కాలుష్యం, పోషకాహార లోపం వల్ల జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలు చిన్న వయసులోనే చాలా మందిని వేధిస్తున్నాయి. ఈ సమస్యలకు రసాయన రహిత సహజ పరిష్కారాలను కరివేపాకు అందిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే రెండు ప్రభావవంతమైన కరివేపాకు చిట్కాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
- Shaik Madar Saheb
- Updated on: Oct 7, 2026
- 12:25 pm
గజ్జి, తామరను పోగొట్టి లివర్, కిడ్నీలను క్లీన్ చేస్తుంది.. ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధం ఈ మొక్క..
నేల ఉసిరి లేదా ఫైలాంథస్ అమరస్ భారతీయ సంప్రదాయ వైద్యంలో ఉపయోగించే ఔషధ మొక్కల్లో ఒకటి.. దీనిలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి.. ఇది కాలేయం, జీర్ణవ్యవస్థ, మూత్రపిండాల ఆరోగ్యానికి సహాయపడుతుందని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. నేల ఉసిరి ఉపయోగాలేంటో తెలుసుకోండి..
- Shaik Madar Saheb
- Updated on: Oct 7, 2026
- 11:36 am
సీఎం టు పీఎం.. ప్రజాసేవలో 25 సంవత్సరాలు.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం..
గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రధానమంత్రి వరకు సాగిన నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో వికసిత్ భారత్ సంకల్ప్ సభ, సేవా సంకల్ప్ జ్యోతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 17న ప్రారంభమైన దేశవ్యాప్త సేవా సంకల్ప్ యాత్రకు ఇవ్వాల్టితో ముగింపు కార్యక్రమాలు జరగనున్నాయి.
- Shaik Madar Saheb
- Updated on: Oct 7, 2026
- 10:28 am
భార్య పుట్టినరోజు.. వస్తుందని బస్టాండ్‌లో ఆశగా ఎదురుచూశాడు.. చివరికి ఊహించని ఘటన
Yellandu Tragedy: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పుట్టినరోజు సందర్భంగా ఆమె వస్తుందని ఆశగా ఎదురుచూసిన 26 ఏళ్ల యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Oct 7, 2026
- 9:45 am
చర్మం మెరుపు, కండరాల బలం, ఫిట్ బాడీ.. ఇవన్నీ ఈ 5 బ్యూటీ ఫుడ్స్‌తో సాధ్యమే..
Beauty Foods: చర్మం ఆరోగ్యంగా మెరవడంతో పాటు శరీరం ఫిట్‌గా ఉండాలంటే పోషకాహారం కీలకం. గుడ్లు, బ్లూబెర్రీస్, సాల్మన్ చేప, కివి, బ్రోకోలీ వంటి ఆహారాల్లో ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3, విటమిన్లు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయని.. వీటిని తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Oct 7, 2026
- 8:15 am