AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ.. పాల్గొన్న టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులు..!

మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌ మరోసారి హాట్‌టాపిక్ అయింది. రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న డ్రగ్స్‌ పార్టీని భగ్నం చేసిన ఈగల్ టీమ్.. 2 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్‌ పార్టీలో పైలట్ రోహిత్‌రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ కూడా పాల్గొన్నారు.

Hyderabad: పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ.. పాల్గొన్న టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులు..!
Drrugs Party
Shaik Madar Saheb
|

Updated on: Mar 15, 2026 | 10:11 AM

Share

మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌ మరోసారి హాట్‌టాపిక్ అయింది. రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న డ్రగ్స్‌ పార్టీని భగ్నం చేసిన ఈగల్ టీమ్.. 2 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్‌ పార్టీలో పైలట్ రోహిత్‌రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ కూడా పాల్గొన్నారు. పార్టీలో పాల్గొన్న 10 మంది పురుషలతో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారందరికీ డ్రగ్స్ టెస్ట్‌లు నిర్వహించారు.

డ్రగ్స్ టెస్ట్‌లో MP పుట్టామహేష్‌యాదవ్‌.. పైలట్‌ రోహిత్‌రెడ్డి సహా ఆరుగురికి కొకైన్‌ పాజిటివ్‌గా తేలింది. పుట్టా మహేష్, రోహిత్‌రెడ్డితో పాటు నమిత్ మిశ్రా, రితేష్‌ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని ఇతర పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ పార్టీని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డే ఏర్పాటు చేశారని పోలీసులు చెబుతున్నారు.

పోలీసులపై కాల్పులు..

ఫామ్‌హౌస్‌కు వెళ్లిన పోలీసులపై ఢిల్లీకి చెందిన నమిద్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. కాల్పులకు ఉపయోగించిన గన్‌తో పాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు ఉపయోగించింది రితీష్‌రెడ్డికి చెందిన లైసెన్స్‌డ్ గన్‌గా పోలీసులు గుర్తించారు..

మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు

ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ పార్టీలో దొరికిన వారికి ఎర్రగడ్డ హాస్పిటల్‌లో బ్లడ్ శాంపిల్స్ సేకరణ అనంతరం.. తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు.. నమిత్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్‌రెడ్డిని మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పార్టీలో పాల్గొన్న మిగతా ఐదుగురుని.. మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు.

లైవ్ వీడియో చూడండి..

Follow Us