విశాఖపట్నంలో మౌనిక హత్యోదంతం తీవ్ర కలకలం రేపింది. పెళ్లి నిశ్చయమైన మొదటి రోజే ఆమె దారుణంగా హత్యకు గురికావడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నిందితుడు రవీంద్ర ఆరోపణలను ఖండించిన కుటుంబ సభ్యులు, నిష్పక్షపాత విచారణతో పాటు తమ బిడ్డకు న్యాయం జరగాలని, దోషికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.