అంజలి అదరగొట్టేసిందిగా.. నవ్వుతోనే కట్టిపడేస్తున్న కుర్రది 

Rajeev 

4 April 2026

షాపింగ్ మాల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది అందాల భామ అంజలి. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది.

రెండు భాషల్లోనూ ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అంజలి కి మంచి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత జర్నీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి.

సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అంజలి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ఆ తర్వాత ఈ అమ్మడుకి చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. దాంతో కొన్ని సినిమాల్లో కీలక పాత్రలో నటించింది.

అలాగే సూర్య సింగం2, అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెప్పించింది. తన అందాలతో ఆకట్టుకుంది. 

అటు తమిళ్ సినిమాల్లోనూ.. ఇటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తుంది అంజలి. రీసెంట్ గా డిజిటల్ వరల్డ్ లోనూ అడుగుపెట్టింది.

ఓటీటీలోనూ పలు సినిమాలు, సిరీస్ లు చేసింది ఈ అమ్మడు. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది.