రఘురామకృష్ణరాజుతో టీవీ9 క్రాస్ ఫైర్: పదవి నుంచి రాజకీయాల దాకా కీలక ప్రశ్నలు
మొత్తంగా ఈ క్రాస్ ఫైర్‌లో రఘురామకృష్ణరాజు రాజకీయ జీవితం, వ్యక్తిగత వైఖరి, వివాదాస్పద వ్యాఖ్యలు అన్నీ ఒకేసారి చర్చకు వచ్చాయి. పదవి నుంచి మతం వరకు… రాజకీయాల నుంచి వ్యక్తిగత సంబంధాల దాకా పలు కీలక అంశాలపై స్పష్టత కోరిన ఈ సంభాషణ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ వివాదాల మధ్యే ఉండే నేత రఘురామకృష్ణరాజు. తాజాగా టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌తో జరిగిన క్రాస్ ఫైర్‌లో ఆయనపై అనేక కీలక ప్రశ్నలు ఎదురయ్యాయి. పదవి అసంతృప్తి నుంచి ఆకివీడు రామాలయం వివాదం వరకు, మతం-రిజర్వేషన్ల చర్చ నుంచి వ్యక్తిగత రాజకీయ సంబంధాల దాకా పలు అంశాలు చర్చకు వచ్చాయి.
మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి ఉందా? కోరుకున్న స్థానం రాలేదా? అనే ప్రశ్నలు ముందుకు వచ్చాయి. అయితే ఆయన మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవితో సంతృప్తిగా ఉన్నానని చెప్పిన విషయం చర్చకు కేంద్రబిందువైంది. ఆకివీడులోని రామాలయం అంశం పెద్ద చర్చగా మారింది. ఆలయం వెనక ఎలాంటి రహస్య అజెండా ఉందా? లేక నిజంగా భక్తి భావంతో ముందుకు వచ్చారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో.. క్రిస్టియన్ మతంలోకి మారిన ఎస్సీలే ఆయన టార్గెట్ అయ్యారా? అనే ప్రశ్న కూడా తీవ్రంగా వినిపించింది. బాబా సాహెబ్ అంబేద్కర్ క్రిస్టియన్ మతాన్ని వ్యతిరేకించారా? అనే ప్రశ్న కూడా ముందుకు వచ్చింది. ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగిస్తున్నారా? అనే కోణంలో కూడా చర్చ సాగింది. రఘురామకృష్ణరాజు చేస్తున్న ఈ పోరాటానికి బీజేపీ, టీడీపీ మద్దతు ఉందా? లేక ఇది పూర్తిగా వ్యక్తిగత అజెండా మాత్రమేనా? అనే ప్రశ్నలు ఉత్కంఠ రేపాయి. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌తో ఉన్న వివాదం కూడా చర్చకు వచ్చింది. ఈ విషయంలో రాజీకి సిద్ధమా? లేక వ్యక్తిగత వైరం కొనసాగుతుందా? అన్నది కీలకంగా మారింది.
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

