రాజస్థాన్‌కు చెందిన ఓ రైతు తన పొలంలో రూ. 5 లక్షలు దాచగా, చెదలు వాటిని పూర్తిగా నాశనం చేశాయి. కుటుంబ సభ్యులకు తెలియకుండా భూమిలో పాతిపెట్టిన ఆ సొమ్మును, తర్వాత స్థలాన్ని మర్చిపోయాడు. ఇటీవల పొలం దున్నేటప్పుడు బయటపడిన ఆ నోట్లను బ్యాంకు నిరాకరించింది. అతి భద్రత కోసమని చేసిన ప్రయత్నం భారీ నష్టాన్ని మిగిల్చింది.