అవతార్‌ను బీట్ చేస్తున్న రామాయణ.. ఏ విషయంలో?
నితీష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న రామాయణ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 59 వేల స్క్రీన్లలో విడుదల కానుంది. ఇది అవతార్ 2 (52 వేల స్క్రీన్లు) రికార్డును అధిగమించి భారతీయ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయం సృష్టించనుంది. 40కి పైగా భాషల్లో, AI లిప్ సింక్ టెక్నాలజీతో వస్తున్న ఈ చిత్రం గ్లోబల్ మార్కెట్‌లో సత్తా చాటనుంది.
భారతీయ సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతోంది. మన మేకర్స్ గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ బడ్జెట్‌తో సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో నితీష్ తివారీ దర్శకత్వంలో, రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది.ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6న విడుదల కానుండగా, ఏకంగా 59 వేల స్క్రీన్లలో ప్రదర్శితం కానుంది. ఇది అంతకుముందు అత్యధిక స్క్రీన్లలో విడుదలైన భారతీయ చిత్రాలైన ‘పుష్ప 2’ (13 వేల స్క్రీన్లు), ‘ట్రిపుల్ ఆర్’ (11 వేల స్క్రీన్లు) రికార్డులను అధిగమించడమే కాకుండా, హాలీవుడ్ చిత్రం ‘అవతార్ 2’ (52 వేల స్క్రీన్లు) రికార్డును కూడా బద్దలు కొట్టనుంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ భాగస్వామ్యంతో, కేవలం ఓవర్సీస్ లోనే 50 వేల స్క్రీన్లలో విడుదల కాబోతోంది. నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని 40కి పైగా భాషల్లో గ్లోబల్ ఆడియన్స్ కు పరిచయం చేయనున్నారు. ఇందుకోసం డీఎన్ఈజీ బ్రహ్మ ఏఐ టెక్నాలజీతో ఏఐ బేస్డ్ లిప్ సింక్ వాడుతూ ఉండడం విశేషం. ఐమాక్స్ లాంటి ప్రీమియం ఫార్మాట్స్ లో వస్తున్న ఈ చిత్రం, భారతీయ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పనుంది.
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

