AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈరోజు వాతావరణ సూచన

హైదరాబాద్ వాతావరణ పరిస్థితులు

ప్రస్తుత ఉష్ణోగ్రత స్థాయి

27°C

ఆహ్లాదకరమైన

ఎండగా

అనిపించే ఉష్ణోగ్రత 27° C తేమ 48%
చివరిగా నవీకరించబడింది: 2026-10-02 10:00 (స్థానిక సమయం)

భారతదేశంలో అత్యంత వేడి నగరాలు

స్థానం నగరం ఉష్ణోగ్రత స్థితి వాతావరణ పరిస్థితి
1 అబోహర్ 35°C వేడి ఎండగా
2 మలౌట్ 35°C వేడి ఎండగా
3 గంగానగర్ 34°C వేడి ఎండగా
4 శ్రీ గంగానగర్ 34°C వేడి ఎండగా
5 ఫరీద్కోట్ 34°C వేడి ఎండగా
6 తల్వాండి సాబో 34°C వేడి ఎండగా
7 ఖేమ్ కరణ్ 34°C వేడి ఎండగా
8 సిర్సా 34°C వేడి ఎండగా
9 పరప్పనంగడి 34°C వేడి పాక్షికంగా మేఘావృతం
10 సంగ్రూర్ 33°C వేడి ఎండగా
చివరిగా నవీకరించబడింది: 2026-10-02 10:15 (స్థానిక సమయం)
స్థానం నగరం ఉష్ణోగ్రత స్థితి వాతావరణ పరిస్థితి
1 మనాలి 10°C Chilly ఎండగా
2 షంషి 17°C తాజాగా ఎండగా
3 కులు 17°C తాజాగా ఎండగా
4 జోగిందర్ నగర్ 17°C తాజాగా ఎండగా
5 ఇంఫాల్ 18°C తాజాగా సమీపంలో చిత్తడి వర్షం
6 కుల్గామ్ 19°C తాజాగా ఎండగా
7 బిష్ణుపూర్ 19°C తాజాగా మబ్బు
8 కక్చింగ్ 19°C తాజాగా మబ్బు
9 బారాముల్లా 20°C తాజాగా ఎండగా
10 సోపోర్ 20°C తాజాగా ఎండగా
చివరిగా నవీకరించబడింది: 2026-10-02 10:00 (స్థానిక సమయం)

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. IMD తాజా హెచ్చరికల ప్రకారం అక్టోబర్ 2 నుంచి 5 వరకు కోస్తా ఆంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణకు కూడా ఉరుములు, మెరుపుల హెచ్చరిక ఉంది.

ఏపీలో వచ్చే మూడు రోజుల వాతావరణం ఎలా ఉండనుందంటే…?

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో వర్షాలతో పాటు గంటకు 30–40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

దక్షిణ భారత్‌కు డేంజర్‌ బెల్స్‌.. ఆరు నెలల్లో వేలాది మరణాలు.. తెలుగు రాష్ట్రాలకూ తప్పని ఎఫెక్ట్‌..!

క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ నివేదిక ప్రకారం, సూపర్ ఎల్‌నినో కారణంగా భారత్‌లో సెప్టెంబర్ 2026-ఫిబ్రవరి 2027 మధ్య 15,800 అదనపు వేడి సంబంధిత మరణాలు సంభవించవచ్చు. దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ, అధిక ప్రమాదంలో ఉన్నాయి. వాతావరణ మార్పులతో పాటు ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రజలకు అవగాహన, రక్షణ చర్యలు అత్యవసరం.

Rain Alert: రానున్న రెండు రోజులు మోస్తరు వర్షాలు.. వాతావరణశాఖ కీలక సూచనలు!

రానున్న రెండు రోజులు దక్షిణ భారత నగరాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరులో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?

ఉపరితల ఆవర్తనం, ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా, పలు ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగొచ్చు. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దూసుకొస్తున్న మరో వాయుగుండం దడ పుట్టిస్తున్న ఉపరితల ఆవర్తనం.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టిన వేళ బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మళ్లీ మారుతున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వానలు పడే అవకాశముంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

  • Phani CH
  • Updated on: Sep 29, 2026
  • 9:12 pm

ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక-తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంగళవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గోదావరి వరద పరిస్థితిపై కూడా APSDMA అప్రమత్తత సూచనలు చేసింది. IMD తాజా బులెటిన్‌లో సెప్టెంబర్ 29న తెలంగాణకు ప్రత్యేక హెచ్చరిక లేదని పేర్కొంది.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్

వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్ష సూచన వెలువడింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు, ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఏపీలోనూ పలు జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. సోమవారం వెదర్ రిపోర్ట్ చూడండి..

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తీవ్ర వాయుగుండం బలహీనపడుతున్నప్పటికీ ఏపీ, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. శ్రీకాకుళం, అల్లూరి, పోలవరం ప్రాంతాల్లో వర్షాలు, గోదావరిలో వరద ప్రవాహంపై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. తెలంగాణలోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలకు అవకాశం ఉంది. IMD తాజా అప్‌డేట్ల ప్రకారం రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత క్రమంగా తగ్గే అవకాశం ఉంది.

Vijayawada: ఏపీలో భారీ వర్షాలు ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద

తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి శుక్రవారం సుమారు 55 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరడంతో కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి ఊరట లభించింది. బ్యారేజీ నుంచి 47,125 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడుదల చేశారు. మరోవైపు బుడమేరు, మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో దిగువ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఖరీఫ్‌ పంటలకు నీటి లభ్యత పెరగడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

  • Phani CH
  • Updated on: Sep 26, 2026
  • 4:59 pm

భారత్‌కు బలమైన ఎల్‌నినో హెచ్చరికలు.. 2027 వరకు వాతావరణంపై ప్రభావం

పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు మరింత బలపడుతున్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తాజా అంచనాల ప్రకారం.. ఈ ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం దాదాపు 100 శాతం ఉంది. బలమైన ఎల్‌నినో కారణంగా భారత్‌లో ఉష్ణోగ్రతలు, వర్షపాతం నమూనాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. వ్యవసాయం, నీటి వనరులు, ఆరోగ్యంపై ప్రభావం ఉండే అవకాశం నేపథ్యంలో ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Weather Report: తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్.. భారీ వర్షసూచన జారీ.. మూడ్రోజుల పాటు హెచ్చరిక..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. భారీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.