AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

AP and Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గినట్లే తగ్గి.. మళ్లీ కొంచెం పెరిగింది.. కేవలం తెల్లవారుజామున వేళల్లో మాత్రమే.. చలి తీవ్రత ఉంటోంది.. కానీ.. పగటి ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.

Weather: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..
Telangana - Andhra Pradesh Weather Report
Shaik Madar Saheb
|

Updated on: Feb 03, 2026 | 1:34 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గినట్లే తగ్గి.. కొంచెం పెరిగింది.. కేవలం తెల్లవారుజామున వేళల్లో మాత్రమే.. చలి తీవ్రత ఉంటోంది.. కానీ.. పగటి ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని.. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానములో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.

గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

రాయలసీమ:-

మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశము ఉంది.

గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

గమనిక:- రాగల 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, యానములో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు ఉండదు.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు:

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా ఆగ్నేయ/తూర్పు దిశ నుండి వీస్తున్నవి.. వీటి ప్రభావంతో మంగళవారం, బుధవారం, గురువారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..