వాతావరణం
విస్తారమైన భౌగోళిక, విభిన్న నైసర్గిక ఆకృతి వైవిధ్యమైన వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశ వాతావరణాన్ని ఒకేలా వివరించలేము. దేశంలో వాతావరణం ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. అయితే మొత్తం మీద భారతదేశ వాతావరణాన్ని 4 ప్రధాన భాగాలుగా విభజించారు. శీతాకాలం (డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి), వేసవికాలం (మార్చి, ఏప్రిల్, మే), రుతుపవన వర్షాకాలం (జూన్ నుంచి సెప్టెంబరు), రుతుపవనాల అనంతర కాలం (అక్టోబర్ – నవంబర్)గా విభజించారు. వాతావరణ వార్తల్లో వర్షాలు, తుఫానులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. తుఫానులకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలను అందిస్తూ ప్రజలను అలర్ట్ చేస్తుంటారు.
వర్షాకాలం గురించి దేశంలో పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తారు. రైతులు సైతం పంటలను వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాట్లు వేస్తుంటారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటివల్లే దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. రెండు రుతుపవనాల ద్వారా వర్షాలు పడే ఏకైక ప్రాంతం ఈశాన్య భారతదేశం, దీని ఫలితంగానే ప్రపంచంలో ఎక్కువ వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది.