AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్ర తీరంలో అరుదైన దృశ్యం.. వణుకుతున్న ప్రపంచం

సముద్ర తీరంలో అరుదైన దృశ్యం.. వణుకుతున్న ప్రపంచం

Phani CH
|

Updated on: Mar 12, 2026 | 9:30 AM

Share

మెక్సికోలోని కాబో సాన్ లూకాస్ బీచ్‌లో రెండు అరుదైన ఓర్‌ఫిష్‌లు కనిపించాయి. ఇవి సముద్రపు లోతుల్లో నివసించేవి. ఈ చేపలు తీరానికి రావడం భారీ భూకంపాలు, సునామీలకు సంకేతమని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జపాన్ జానపద కథల ప్రకారం, వీటిని 'ప్రళయ సూచిక చేపలు' అంటారు. అయితే, శాస్త్రవేత్తలు దీనిని కొట్టిపారేస్తున్నారు. అనారోగ్యం లేదా సముద్ర ప్రవాహాల మార్పులే దీనికి కారణమని వారు వివరిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒకే ఒక అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. అది మెక్సికోలోని కాబో సాన్ లూకాస్ బీచ్‌లో కనిపించిన రెండు అరుదైన ఓర్‌ఫిష్‌లు. సాధారణంగా సముద్రపు అగాధాల్లో ఉండే ఈ చేపలు తీరానికి రావడం భారీ విపత్తులకు సంకేతమని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర మట్టానికి సుమారు 3,000 అడుగుల లోతులో నివసించే ఓర్‌ఫిష్‌లను ‘ప్రళయ సూచిక చేపలు’ లేదా ‘డూమ్స్‌డే ఫిష్’ అని పిలుస్తారు. పాములా పొడవుగా ఉండి, వెండిలా తళతళా మెరిసిపోయే ఈ చేపలు సముద్ర ఉపరితలానికి రావడం అత్యంత అరుదు. జపాన్ జానపద కథల ప్రకారం, ఈ చేపలు కనిపిస్తే త్వరలోనే భారీ భూకంపాలు లేదా సునామీలు సంభవిస్తాయని బలంగా నమ్ముతారు. మోనికా పిట్టెంజర్ అనే మహిళ తన సోదరితో కలిసి బీచ్‌లో విహరిస్తుండగా, ఇసుకపై ఏదో మెరుస్తున్నట్లు గమనించారు. దగ్గరకు వెళ్లి చూడగా సుమారు 10-15 అడుగుల పొడవున్న రెండు ఓర్‌ఫిష్‌లు కనిపించాయి. అందులో ఒకటి అప్పటికే ప్రాణాలు కోల్పోగా, మరొకటి నీటిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ అరుదైన దృశ్యాన్ని వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ చేపలు ప్రకృతి విపత్తులను ఇవి ముందుగానే పసిగడతాయి.. ఏదో ముప్పు పొంచి ఉంది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో కొన్ని చోట్ల ఈ చేపలు కనిపించిన కొద్ది రోజుల్లోనే భూకంపాలు వచ్చిన ఉదాహరణలను కొందరు గుర్తు చేశారు. అయితే, ఈ భయాలను శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. చేపలు కనిపించడానికి, భూకంపాలకు ఎటువంటి శాస్త్రీయ సంబంధం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సముద్రపు లోతుల్లో అనారోగ్యానికి గురవ్వడం, సముద్ర ప్రవాహాల్లో మార్పులు లేదా బలహీనత కారణంగా ఇవి ఒడ్డుకు కొట్టుకు వచ్చే అవకాశం ఉందని వారు వివరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..

Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం

Dhurandhar 02: ధురంధర్‌ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్

The Taj Story OTT: తాజ్ మహల్‌ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..

Thanuja: ఫ్యాన్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ

Follow Us