AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే

గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే

Phani CH
|

Updated on: Nov 20, 2026 | 5:24 PM

Share

రాజస్థాన్‌లో జరుగుతున్న ప్రపంచ ప్రఖ్యాత పుష్కర్ పశువుల జాతరలో బాదల్ అనే అరుదైన గుర్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏకంగా 40 మంది బౌన్సర్ల భద్రత మధ్య డోలు వాయిద్యాలు, నోట్ల వర్షంతో జాతరలోకి ప్రవేశించింది. ఈ గుర్రంతో పాటు మరో రెండు ప్రత్యేక జాతి గుర్రాల మొత్తం విలువ రూ.5 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాత పుష్కర్ పశువుల జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ మేళాలో చోటుచేసుకున్న ఓ విచిత్రమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా వీఐపీలు, ప్రముఖ సినీ నటులకు మాత్రమే ఉండే భారీ భద్రతను.. ఈసారి ఏకంగా ఒక గుర్రానికి ఏర్పాటు చేశారు. ‘బాదల్’ అనే తెల్లటి అందమైన గుర్రం ఏకంగా 40 మంది బౌన్సర్ల రక్షణ వలయం మధ్య రాజసంగా జాతరలోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేక్రీ ప్రాంతానికి చెందిన రాహుల్ జేత్వాల్ అనే వ్యక్తి తనకెంతో ఇష్టమైన ‘బాదల్’ గుర్రాన్ని ఈ మేళాకు తీసుకువచ్చారు. ఈ గుర్రం ఎంట్రీ చూసేందుకు అచ్చం ఏదో సినిమా హీరోలా సాగింది. డోలు వాయిద్యాలు హోరెత్తుతుండగా, యజమాని రాహుల్ దారి పొడవునా నోట్ల వర్షం కురిపిస్తూ తన గుర్రాన్ని వేదిక వద్దకు నడిపించారు. ఈ గుర్రాన్ని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. యజమాని రాహుల్ బాదల్‌తో పాటు ‘న్యూ బాదల్’, ‘విశ్వాస్’ అనే మరో రెండు ప్రత్యేక జాతి గుర్రాలను కూడా ప్రదర్శనకు తెచ్చారు. కేవలం 24 నెలల వయసున్న బాదల్ ఎత్తు 5.5 అడుగుల పైనే ఉంది. ఈ మూడు గుర్రాల మొత్తం మార్కెట్ విలువ రూ. 5 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఇదే జాతికి చెందిన మరో గుర్రానికి ఏకంగా రూ. 11 కోట్ల భారీ ఆఫర్ వచ్చినా యజమాని దానిని అమ్మలేదట. ఇంతటి అత్యంత విలువైన, అరుదైన గుర్రం కావడంతోనే దానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ స్థాయిలో భారీ బౌన్సర్ల భద్రత కల్పించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!

వామ్మో.. గిరినాగు.. స్నేక్ క్యాచర్‌కు 2 గంటలు చుక్కలు.. పాముల్నే తింటుంది..

మనిషి మొహంలో పిల్లి రూపం.. బ్రెయిన్ సర్జరీ తర్వాత యువకుడికి వింత వ్యాధి

Bird Flu: బర్డ్ ఫ్లూ టైమ్‌లో చికెన్ తినవచ్చా?

ఉదయం టీతో బిస్కెట్లు తీసుకుంటున్నారా? నెలరోజుల్లో మీ ఆరోగ్యంలో జరిగే మార్పు ఇదే!

Published on: Nov 20, 2026 05:23 PM
Follow Us