డాక్టర్ వేసిన డేంజర్ స్కెచ్!.. బీరులో మత్తుమందు.. ఆ తర్వాత! హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది?
హైదరాబాద్‌ను ఓ డిజిటల్ దందా కుదిపేసింది. గ్రిండర్ డేటింగ్ యాప్ ద్వారా LGBTQ+ కమ్యూనిటీ యూజర్లను లక్ష్యంగా చేసుకుని, మత్తుమందు కలిపిన బీర్లతో స్పృహ తప్పించి, బంగారం, నగదు దోచుకున్న ముఠాను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒక డాక్టర్ పాత్ర షాకింగ్‌గా ఉంది.
హైదరాబాద్‌లో డేటింగ్ యాప్‌ల ద్వారా అమాయకులను లక్ష్యంగా చేసుకుని, మత్తుమందుతో దోపిడీలకు పాల్పడుతున్న ఒక కిలాడి ముఠాను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. గ్రిండర్ వంటి డేటింగ్, ఫ్రెండ్షిప్ యాప్‌లను ఉపయోగించి, ఈ గ్యాంగ్ ప్రధానంగా LGBTQ+ కమ్యూనిటీ యూజర్లను టార్గెట్ చేసింది. ముఠా సభ్యులు అందమైన యువకుల ఫేక్ ప్రొఫైల్స్‌తో బాధితులను ఆకర్షిస్తారు. వారి నమ్మకాన్ని చూరగొన్న తర్వాత, వీడియో కాల్స్ ద్వారా బాధితుల వద్ద ఉన్న బంగారు ఆభరణాలను గుర్తించి, వారిని నేరుగా కలవడానికి ఓ ప్రైవేట్ రూమ్‌కు ఆహ్వానిస్తారు. అక్కడ మత్తుమందు కలిపిన బీర్లను ఇచ్చి, స్పృహ కోల్పోగానే వారి ఆభరణాలు, మొబైల్ ఫోన్లు, నగదును దోచుకుని పారిపోతారు. ఈ హైటెక్ స్కామ్‌కు సూత్రధారి ఆరిఫ్ కాగా, కర్నూలుకు చెందిన డాక్టర్ దినేష్ రెడ్డి ఈ ముఠాకు మత్తుమందు మోతాదులపై సాంకేతిక సలహాలు అందించారు. ఏడాదిలో 20కి పైగా దోపిడీలకు పాల్పడిన ఈ గ్యాంగ్‌లోని ఐదుగురు ప్రధాన సభ్యులను పోలీసులు అరెస్టు చేసి, 36 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. ఇలాంటి డిజిటల్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం :
గ్లోబల్ మార్కెట్లో రామాయణ జోరు.. ఆ రికార్డ్ బ్రేక్ చేస్తుందా?
బిగ్ బీకి మరోసారి బిగ్ వార్నింగ్
దుల్కర్ సినిమా మీద అంచనాలు పెంచేసిన బన్నీ… అంతలా ఆ సినిమాలో ఏముంది?
హీరోయిన్లకు అగ్నిపరీక్ష… ఎవరికి కలిసొస్తుంది?
స్పెషల్ సాంగ్స్‌తో సీనియర్స్ సందడి.. కింగ్ కూడా రెడీనా?
డాక్టర్ వేసిన డేంజర్ స్కెచ్!.. బీరులో మత్తుమందు.. ఆ తర్వాత!
దడ పుట్టిస్తున్న అక్వా తుఫాన్.. వీడియో
ఓరి దేవుడో.. మూడు రోజులుగా ఇంట్లోనే మకాం వేసిన ఎలుగుబంటి.. చివరకు
తెలుగు రాష్ట్రాల మధ్య మరో జల జగడం.. పల్నాడు తాగునీటి ప్రాజెక్టుతో
జేసీబీతో నేల చదును చేస్తుండగా వింత శబ్ధాలు.. ఆ తర్వాత
అరకు అందాలకు పర్యాటకులు ఫిదా..
చెట్లకు వేళాడుతున్న భయానక రూపాలు.. వణికిపోతున్న జిల్లా వాసులు

