స్పెషల్ సాంగ్స్‌తో సీనియర్స్ సందడి.. కింగ్ కూడా రెడీనా?
టాలీవుడ్ సీనియర్ హీరోలు యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా బాక్స్ ఆఫీస్ బరిలో దూసుకుపోతున్నారు. మాస్ ఆడియన్స్ ని అలరించే స్పెషల్ సాంగ్స్ విషయంలోనూ ఫుల్ జోష్ చూపిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఇప్పటికే స్పెషల్ సాంగ్స్‌తో అలరిస్తుండగా, నాగార్జున రాబోయే కింగ్ 100 చిత్రంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతారా అనేది చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్ సీనియర్ హీరోలు యంగ్ హీరోలకి ఏ మాత్రం తగ్గకుండా బాక్స్ ఆఫీస్ బరిలో దూసుకుపోతున్నారు. కథల ఎంపికలోనే కాదు, మాస్ ఆడియన్స్ ని అలరించే స్పెషల్ సాంగ్స్ విషయంలోనూ ఫుల్ జోష్ చూపిస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ ఊపు రావాలంటే సినిమాలో ఒక్కటైనా అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే అని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే సీనియర్ హీరోలు కూడా తమ కొత్త ప్రాజెక్టుల్లో మాస్ బీట్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న కాకా సినిమాలో యంగ్ బ్యూటీ రితికాతో ఒక హై వోల్టేజ్ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారు మేకర్స్. రీసెంట్ టైమ్స్ లో చిరు సినిమాల్లో స్పెషల్ సాంగ్ అన్నది కంపల్సరీగా మారిపోయింది. నందమూరి బాలకృష్ణ కూడా దాదాపు అన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రీతో అదిరిపోయే మాస్ నెంబర్ చేయించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సాంగ్ లిరికల్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
జేసీబీతో నేల చదును చేస్తుండగా వింత శబ్ధాలు.. ఆ తర్వాత
అరకు అందాలకు పర్యాటకులు ఫిదా..
చెట్లకు వేళాడుతున్న భయానక రూపాలు.. వణికిపోతున్న జిల్లా వాసులు
జిమ్‌లో వ్యాయామం చేస్తున్న యువతి.. అంతలోనే ఊహించని దారుణం!
స్విమ్మింగ్ పూల్ కోసం తవ్వకాలు.. బయటపడిన సంచులు చోడగా!
400 మార్కులకు 397తో భారీ స్కోర్.. టాపర్ బండారం బయటపడింది ఇలా!
పులినే పరుగులు పెట్టించిన మంత్రి... ఆ తర్వాత!

