నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సుపరిచయమైన పేరు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు తనయుడైన బాలకృష్ణ..తండ్రికి తగ్గ తనయుడిగా ఇటు నటుడిగా.. అటు రాజకీయ నాయకుడిగా తనదైన ప్రత్యేక గుర్తింపు సాధించారు. వందకు పైగా చిత్రాల్లో నటించారు. అలాగే వరుసగా మూడుసార్లు హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో అనంతపురం జిల్లా హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2019, 2014 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1969 జూన్ 10న ఆయన జన్మించారు. ఆయన బాల్యం హైదరాబాద్‌లోనే గడిచింది. నిజాం కళాశాలలో డిగ్రీ వరకు చదువుకున్నారు.
బాలకృష్ణ 14 ఏళ్ల వయసులోనే తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంవహించిన తాతమ్మకల(1974) చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఎన్టీఆర్ 12 మంది సంతానంలో బాలకృష్ణ ఆరవ కుమారుడు. బాలకృష్ణ 100కు పైగా చిత్రాల్లో నటించారు. మంగమ్మగారి మనవడు,ఆదిత్య 369, భైరవద్వీపం, నరసింహ నాయుడు, సింహా, పాండు రంగడు, లెజెండ్, శ్రీరామరాజ్యం తదితర చిత్రాలు బాలకృష్ణకు మంచి గుర్తింపు సాధించిపెట్టాయి. బాలకృష్ణను ఆయన అభిమానులు బాలయ్యగా పిలుచుకుంటారు. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తి నెలకొంటోంది.