శ్రీకాకుళంలో డయేరియా మరణాలకు కారణం ఇదే
శ్రీకాకుళం జిల్లాలో డయేరియా తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. ఆరు రోజుల్లో 158 కేసులు నమోదయ్యాయి, ముగ్గురు మరణించారు. అక్రమ పైపులైన్ల ద్వారా మురుగునీరు తాగునీటిలో కలవడంతో ఈ-కోలి బాక్టీరియా వ్యాపించింది. నీటి నమూనాల్లో ప్రమాదకర ఈ-కోలి నిర్ధారణ అయింది. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని అధికారులు సూచిస్తున్నారు. అక్రమ కనెక్షన్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గత ఆరు రోజులుగా డయేరియా విలయతాండవం చేస్తోంది. మంగువారి తోట, దమ్మల వీధి, గోల్కొండ రేవు వంటి ప్రాంతాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే మంగువారి తోటకు చెందిన మండల సురేష్ మృతి చెందగా, మరో ఇద్దరి మరణాలకు కూడా డయేరియానే కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. శుక్రవారం నాటికి నగరంలో మొత్తం 158 కేసులు నమోదు కాగా, 111 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నగరంలో డయేరియా విజృంభణకు గల కారణంపై విశాఖపట్నం ల్యాబ్ నుండి వచ్చిన వాటర్ శాంపిల్స్ నివేదికలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. సేకరించిన 30 నమూనాల్లో 11 చోట్ల ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ (E.coli) బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. డ్రైనేజీ కాలువల మీదుగా అక్రమంగా తీసుకున్న పైపులైన్ కనెక్షన్లు, మోటార్ల వాడకం వల్ల భూగర్భంలోని మురుగునీరు తాగునీటిలో కలవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ఆరోగ్య శాఖ కమిషనర్ జి. వీరపాండియన్ స్పష్టం చేశారు. కమిషనర్ వీరపాండియన్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కలిసి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పైపులైన్లను, పారిశుధ్య పనులను తనిఖీ చేసిన కమిషనర్, ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. అయితే, మున్సిపాలిటీ సరఫరా చేసే నీటిని నేరుగా తాగవద్దని, కేవలం కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ కనెక్షన్లు, మోటార్ల వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Yadadri: యాదాద్రిలో ‘శివసాయి శ్రీనివాస నాట్యాలయం’ కళాకారుల నాట్య నీరాజనం
భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
US-Israel Strikes On Iran: అమెరికాకు దిమ్మతిరిగిపోయే రీతిలో దాడులు చేస్తాం
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

