నేను సబ్ ఎడిటర్‌గా టీవీ9 తెలుగులో 2019 నవంబర్‌లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి సైట్‌కు సంబంధించిన గ్యాలరీలు, వెబ్ స్టోరీస్‌లు చూసుకుంటున్నాను. అంతేకాకుండా ఆర్టికల్స్‌కు సంబంధించిన ఫోటోలను సైతం క్వాలిటీలో ఉండేలా మారుస్తున్నాను.
మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి..
పార్కిన్సన్స్ వ్యాధి (Parkinson's Disease) కేవలం వృద్ధుల్లోనే కాకుండా, ఆధునిక జీవనశైలి కారణంగా 22-49 సంవత్సరాల వారిలో కూడా ఇప్పుడు కనిపిస్తుంది. వణుకు, నడకలో మార్పు, కండరాల బిగువు, మతిమరుపు వంటి ప్రారంభ లక్షణాలను ముందే గుర్తించి, సకాలంలో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది కాబట్టి, సరైన వైద్యం, వ్యాయామం, ఆహారం అవసరం. కుటుంబ చరిత్ర ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
- Phani CH
- Updated on: Dec 15, 2025
- 1:34 pm
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
రుద్రాక్షలు పరమేశ్వరుని కన్నులుగా హిందువులు పవిత్రంగా పూజిస్తారు. ఇవి రక్షణ, శాంతి, జ్ఞానం అందిస్తాయని నమ్ముతారు. ఆరోగ్య, మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయని శాస్త్రీయంగా రుజువైంది. సాధారణంగా హిమాలయ ప్రాంతాల్లో పెరిగే రుద్రాక్ష చెట్లు, ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా అడవి పాలెంలో దర్శనమిస్తున్నాయి. బాలకృష్ణ కృషి ఫలితంగా ఈ అరుదైన వృక్షాలు ఇక్కడ ఏపుగా పెరిగి కాయలు కాస్తున్నాయి.
- Phani CH
- Updated on: Dec 15, 2025
- 1:30 pm
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
బృందావనం రాధాకృష్ణుల ప్రేమ నగరం. ఇక్కడ నిధివనంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. సూర్యాస్తమయం తర్వాత శ్రీకృష్ణుడు గోపికలతో రాసలీలలు చేస్తాడని, ఉదయం ఖాళీ పాత్రలు, తడి విగ్రహాలు కనిపిస్తాయని భక్తుల నమ్మకం. ఈ మర్మమైన ప్రదేశంలో శ్రీకృష్ణుని రాత్రిపూట లీలలు, ఆయన అద్భుత ఉనికిని నమ్మేవారు దర్శించుకుంటారు.
- Phani CH
- Updated on: Dec 15, 2025
- 1:26 pm
హైబీపీతో గుండెకే కాదు.. కంటి చూపునకూ ముప్పే
బీపీ ఎక్కువైతే గుండెకే కాదు, కంటి చూపుకు కూడా తీవ్ర ప్రమాదం. అధిక రక్తపోటు రెటీనాను దెబ్బతీసి, హైపర్టెన్సివ్ రెటినోపతీకి దారితీస్తుంది. ఇది దృష్టి మసకబారడం నుండి పూర్తిగా చూపు కోల్పోయే వరకు కారణం కావచ్చు. ప్రారంభంలో లక్షణాలు కనిపించవు కాబట్టి, 40 ఏళ్లు పైబడినవారు, బీపీ ఉన్నవారు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. జీవనశైలి మార్పులు, మందులతో బీపీని అదుపులో ఉంచుకోవడం అవశ్యం.
- Phani CH
- Updated on: Dec 15, 2025
- 1:22 pm
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
రాయదుర్గం సమీపంలోని సిరిగేదొడ్డి మహిళలు 40 ఏళ్లుగా పెరుగు వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారు. వారి నాణ్యమైన పెరుగుకు రాయదుర్గంలో విశేష ఆదరణ ఉంది. మొదట కాలినడకన, ఇప్పుడు ఆటోలలో పెరుగు అమ్మి లాభాలు పొందుతున్నారు. గేదెలు కొనుగోలుకు సబ్సిడీ రుణాలు, ఆర్థిక సహాయం అందించి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
- Phani CH
- Updated on: Dec 15, 2025
- 1:19 pm
అబ్బా జస్ట్ మిస్.. లేదంటే అఖండలో మనోజ్ కూడా రెచ్చిపోయేటోడు
అఖండ 2 సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. బాలయ్య రుద్ర తాండవం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి పోషించిన భయంకరమైన తాంత్రికుడి విలన్ పాత్ర హైలైట్. అయితే, ఈ పాత్రకు ఆది పినిశెట్టి మొదటి ఎంపిక కాదట. ముందుగా మంచు మనోజ్‌కు బోయపాటి శీను ఆఫర్ చేయగా, ఇతర కమిట్మెంట్ల వల్ల మనోజ్ చేయలేకపోయాడని తెలుస్తోంది.
- Phani CH
- Updated on: Dec 15, 2025
- 12:45 pm
Roshan Kanakala: విడాకులు తీసుకున్నారా అన్న ప్రశ్నకు రోషన్ షాకింగ్ రియాక్షన్
యాంకర్ సుమ, రాజీవ్ కనకాల విడాకులపై కొన్నాళ్లుగా సాగుతున్న ఊహాగానాలపై వారి తనయుడు రోషన్ కనకాల స్పందించారు. ఈ వార్తలు తమ కుటుంబానికి చాలా బాధ కలిగించాయని, ఎమోషనల్‌గా ప్రభావితం చేశాయని ఆయన తెలిపారు. తమ కుటుంబంలో అటువంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. బయటి ప్రచారానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, తమ బంధంపై పూర్తి నమ్మకంతో ఉన్నామని రోషన్ వెల్లడించారు.
- Phani CH
- Updated on: Dec 15, 2025
- 12:41 pm
బేబమ్మకు కష్టమొచ్చింది.. వాయిదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కృతి శెట్టి..
ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది తరువాత వరుస విజయాలతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. కాకపోతే ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా పడిపోయింది ఈ ముద్దగుమ్మ. | Krithi Shetty | 13-12-025
- Phani CH
- Updated on: Dec 13, 2025
- 4:08 pm
స్టన్నింగ్ లుక్స్ తో సెగలు రేపుతున్న విష్ణు ప్రియా
మొదట మోడలింగ్ చేసి యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి బుల్లితెరపై అడుగుపెట్టకముందే పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది ఈ అందాల సోయగం. | vishnu priya | 13-12-2025
- Phani CH
- Updated on: Dec 13, 2025
- 4:04 pm
TOP 9 ET News: అఖండకు సూపర్ రెస్పాన్స్.. డే1 దిమ్మతిరిగే కలెక్షన్స్
అఖండ2 మేకర్స్ పై తెలంగాణ హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అఖండ2 టికెట్ రేట్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవీను.. ఈ మూవీ రిలీజ్‌కు ఒక రోజు తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. దాంతో పాటే డిసెంబర్ 11న రాత్రి పడాల్సిన ప్రీయర్స్ను కూడా రద్దు చేయాలంటూ పేర్కొంది. కానీ అప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జరగడంతో... తెలంగాణలో ప్రీయర్స్ షోస్ యధావిధిగా కొనసాగాయి. ఇక ఆ విషయంగా మరో వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతో... అఖండ2 మేకర్స్ తీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
- Phani CH
- Updated on: Dec 13, 2025
- 3:52 pm
ఒక్క హిట్.. అంటూ ఎదురుచూస్తున్న అందాల భామలు
ఒకప్పుడు స్టార్ హీరోలతో పనిచేసిన పూజా హెగ్డే, శ్రీలీల, కృతిశెట్టి వంటి పలువురు టాలీవుడ్ అందాల భామలు ప్రస్తుతం కెరీర్లో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వరుస సినిమాలతో వస్తున్నా, విజయాలు లభించడం లేదు. రాశీ ఖన్నా, తమన్నా, అనుష్క వంటి తారలు కూడా విజయం కోసం ఎదురుచూస్తున్నారు. అభిమానులు ఈ తారల కెరీర్ మళ్లీ గాడిలో పడాలని ఆశిస్తున్నారు.
- Phani CH
- Updated on: Dec 13, 2025
- 3:47 pm
సెలబ్రిటీలకు తలనొప్పిగా మారిన సోషల్ మీడియా
పెరుగుతున్న టెక్నాలజీ సెలబ్రిటీ మహిళలకు తలనొప్పిగా మారింది. సోషల్ మీడియా ట్రోల్స్, ఏఐ డీప్‌ఫేక్‌లు తారలను ఇబ్బంది పెడుతున్నాయి. సింగర్ చిన్మయి, రష్మిక మందన్న, తమన్నా, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రియాంక చోప్రా వంటి వారు సాంకేతిక దుర్వినియోగంతో బాధితులయ్యారు. దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.
- Phani CH
- Updated on: Dec 13, 2025
- 3:45 pm