Gold Price: మరింత పెరగనున్న బంగారం ధర.. SBI సంచలన నివేదిక
పశ్చిమ ఆసియాలో యుద్ధ భయాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో, పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఎస్‌బీఐ నివేదిక ప్రకారం, కేంద్ర బ్యాంకులు బంగారు నిల్వలను పెంచుకుంటూ జాతీయ రుణాన్ని తగ్గించుకోవడానికి చూస్తున్నాయి. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
పశ్చిమ ఆసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. యుద్ధం ఎటు దారితీస్తుందో తెలియని తీవ్ర అనిశ్చితి నెలకొనడంతో, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడక, అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం (Safe Haven) వైపు క్యూ కడుతున్నారు. డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో SBI రీసెర్చ్ నివేదిక పలు ఆసక్తికర అంశాలును బయటపెట్టింది. ప్రస్తుత పరిస్థితులపై SBI రీసెర్చ్ తన తాజా నివేదికలో పలు కీలక హెచ్చరికలు జారీ చేసింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కనీవినీ ఎరుగని రీతిలో దూసుకుపోతున్నాయి. 2025 ఆగస్టులో ఔన్స్‌కు $3,448 డాలర్లుగా ఉన్న పసిడి ధర..మార్చి 6 నాటికి $5,092 మార్కును చేరుకుంది. అంటే దాదాపు 47.6 శాతం పెరుగుదల నమోదైంది. ఇరాన్-అమెరికా మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు మరియు పశ్చిమ ఆసియాలో యుద్ధ భయాలు పెట్టుబడిదారులను సురక్షితమైన ‘గోల్డ్’ వైపు పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం గనుక సుదీర్ఘకాలం కొనసాగితే, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర ఊహించని స్థాయికి చేరుతుందని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది. కేంద్ర బ్యాంకులు తమ వద్ద ఉన్న బంగారు నిల్వలను ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం పునఃమూల్యాంకనం చేయడం ద్వారా జాతీయ రుణ భారాన్ని తగ్గించుకోవచ్చని SBI గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. ఉదాహరణకు, అమెరికా తన గోల్డ్ రిజర్వ్స్‌ను రీ-వాల్యూ చేస్తే వారి బడ్జెట్ లోటు 70 శాతం తగ్గే అవకాశం ఉందని, ఇది 38.8 ట్రిలియన్ డాలర్ల రుణాన్ని నిర్వహించడంలో సహాయపడుతుందని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు డాలర్ నిల్వలకు బదులుగా బంగారు నిల్వలను పెంచుకోవడం 1996 తర్వాత ఇదే మొదటిసారి అని వివరించారు. అమెరికా, జర్మనీల వద్ద 80.4 శాతం నిల్వలు ఉండగా, భారత్‌లో 17.6 శాతంగా ఉన్నాయి. ఇక ఆర్థిక ప్రభావం విషయానికి వస్తే, పునఃమూల్యాంకనం వల్ల బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు మెరుగుపడినా, బాధ్యతలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిడి కలిగే ప్రమాదం ఉంది. కాగా, సెంట్రల్ బ్యాంకుల వ్యూహాలు, యుద్ధం నేపథ్యంలో సమీప భవిష్యత్తులో బంగారం ధరలు భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆరునూరైనా.. ట్రంప్‌ను మాత్రం వదిలిపెట్టం
Summer: సందడి లేని సమ్మర్.. అసలు సమయానికి హ్యాండ్ ఇచ్చిన స్టార్ హీరోలు!
ఉస్తాద్ Vs ధురంధర్.. అబ్బో పోటీ మామూలుగా లేదుగా
సమస్యలపై గళం విప్పుతున్న హీరోయిన్‌లు.. సౌత్, నార్త్ అనే తేడా లేదు
సరస్వతి సినిమా వివాదం.. నిజంగానే గొడవ జరిగిందా.. పబ్లిసిటీ స్టంటేనా
వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ
ఆదర్శ సర్పంచ్.. పదవి 'పక్కనపెట్టి'.. చెత్త ట్రాక్టర్ పట్టి !!
ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ
ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బయటికొచ్చిన పాములు
ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే
ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. సేంద్రియ పెళ్లి గురించి మీకు తెలుసా
వానరాలకు 'త్రిశూలం' టాటూ.. అసలు కారణం ఇదే

