జనగామ జిల్లా ఓబుల్ కేశవపురంలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధంపై నిలదీసిన భార్య మాధవిపై భర్త మహేందర్ రెడ్డి బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేసి కాళ్లు, చేతులు విరగొట్టాడు. అనంతరం తన ఇద్దరు పిల్లలతో పరారయ్యాడు. స్థానికులు మాధవిని ఆసుపత్రికి తరలించగా, ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.