AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉస్తాద్‌ Vs ధురంధర్‌.. అబ్బో పోటీ మామూలుగా లేదుగా

ఉస్తాద్‌ Vs ధురంధర్‌.. అబ్బో పోటీ మామూలుగా లేదుగా

Phani CH
|

Updated on: Mar 09, 2026 | 5:21 PM

Share

సౌత్‌లో ధురంధర్‌ 2కు ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ నుండి ఊహించని పోటీ ఎదురవుతోంది. ఒకే రోజు రెండు సినిమాల అప్‌డేట్స్‌ రావడంతో ప్రచార పర్వంలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ధురంధర్‌ 2 ట్రైలర్‌ విడుదలైన రోజునే, పవర్‌ స్టార్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ టీమ్‌ ఎలాంటి అనౌన్స్‌మెంట్‌ లేకుండా టీజర్‌ను రిలీజ్‌ చేసింది. ఈ అనూహ్య ఎంట్రీతో ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ పడింది.

సౌత్‌లో ధురంధర్‌ 2కు ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ నుండి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. టాక్సిక్‌ రేస్‌ నుంచి తప్పుకుందని ఆనందించేలోపే, పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ఎంట్రీపై క్లారిటీ వచ్చింది. ప్రమోషన్స్‌ విషయంలోనూ పవర్‌ స్టార్‌ టీమ్‌ ధురంధర్‌ 2కు చెమటలు పట్టిస్తోంది. ఒకే రోజు రెండు సినిమాల అప్‌డేట్స్‌ రావటంతో, ఈ పోటీ గురించి సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. విడుదల విషయంలోనే కాకుండా, ప్రమోషన్స్‌లోనూ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, ధురంధర్‌ 2 నువ్వా నేనా అంటున్నారు. రెండు సినిమాలు ఒకే సమయంలో అప్‌డేట్స్ విడుదల చేయడంతో ప్రచారంలోనూ పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ టీమ్‌ ఆలస్యంగా రంగంలోకి దిగినా, ధురంధర్‌ 2 బృందానికి గట్టి సవాల్‌ విసురుతోంది. శనివారం ఉదయం ధురంధర్‌ 2 ట్రైలర్‌ విడుదలైంది. తొలి భాగం సూపర్‌ హిట్‌ కావడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సమస్యలపై గళం విప్పుతున్న హీరోయిన్‌లు.. సౌత్‌, నార్త్ అనే తేడా లేదు

సరస్వతి సినిమా వివాదం.. నిజంగానే గొడవ జరిగిందా.. పబ్లిసిటీ స్టంటేనా

Gaddar Film Awards 2026: గద్దర్‌ అవార్డ్స్‌లో సమతూకం.. అంతా హ్యాపీయేనా ??

పొంగల్‌ తరువాత చల్లబడిన సిల్వర్‌ స్క్రీన్‌.. ఊపు తగ్గిదంటున్న ఫ్యాన్స్

వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ

Follow Us