సమస్యలపై గళం విప్పుతున్న హీరోయిన్‌లు.. సౌత్, నార్త్ అనే తేడా లేదు
వర్క్‌ప్లేస్‌లో ఎదురవుతున్న సమస్యలపై హీరోయిన్‌లు ఇప్పుడు ధైర్యంగా గళం విప్పుతున్నారు. గతంలో నిశ్శబ్దంగా ఉన్నవారు ప్రస్తుతం తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. దీపికా పదుకొణె పని గంటల విషయంలో పెట్టిన షరతులు, కన్నడ తారలు ఎదుర్కొంటున్న అసభ్యకర ఫోటోగ్రఫీ వంటి ఘటనలు ఈ మార్పునకు నిదర్శనం. నటీమణుల ఈ పోరాటం ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.
సినీ పరిశ్రమలో నటీమణులు పని ప్రదేశంలో ఎదుర్కొంటున్న సమస్యలపై సీరియస్‌గా స్పందిస్తున్నారు. గతంలో ఇలాంటి సమస్యలు ఉన్నప్పటికీ, అప్పట్లో హీరోయిన్‌లు ఇంత ధైర్యంగా మాట్లాడేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. నటీమణులు తమ హక్కుల కోసం పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి పోరాటాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె పని గంటల విషయంలో కొన్ని షరతులు విధించడం సౌత్, నార్త్ సినీ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. ఈ కారణంగా ఆమె కొన్ని భారీ చిత్రాల్లో అవకాశాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చినా, దీపిక తన నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గలేదు. దీపిక ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు పెద్దగా మద్దతు లభించకపోయినా, ప్రస్తుతం కరీనా కపూర్, యామీ గౌతమ్ వంటి కొందరు హీరోయిన్‌లు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి విషయాలపై నటీమణులు మాట్లాడినప్పుడే వివాదస్పదం అవుతున్నాయని వారు మండిపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సరస్వతి సినిమా వివాదం.. నిజంగానే గొడవ జరిగిందా.. పబ్లిసిటీ స్టంటేనా
Gaddar Film Awards 2026: గద్దర్ అవార్డ్స్‌లో సమతూకం.. అంతా హ్యాపీయేనా ??
పొంగల్ తరువాత చల్లబడిన సిల్వర్ స్క్రీన్.. ఊపు తగ్గిదంటున్న ఫ్యాన్స్
వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ
ఆదర్శ సర్పంచ్.. పదవి ‘పక్కనపెట్టి’.. చెత్త ట్రాక్టర్ పట్టి !!
బంపర్ ఆఫర్.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!
రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా
పాడేరులో అద్భుతం 'మినీ కాశ్మీర్'గా మారిన అరకు లోయ
సాగర తీరంలో అద్భుతం.. మూడు కాళ్లపై నిలబడే వింత చేప
ఇన్‌స్టా, FB అడిక్షన్.. ఆ యువతిలో మానసిక సమస్యలు!
హనుమంతుడి పూజలో మునిగిపోయిన వానరం..!
మృత్యువు అంచున నాగుపాము.. సీపీఆర్‌తో ప్రాణం పోసిన హోంగార్డ్

