ఆదర్శ సర్పంచ్.. పదవి ‘పక్కనపెట్టి’.. చెత్త ట్రాక్టర్ పట్టి !!
సిద్దిపేట జిల్లా రేగొండ సర్పంచ్ వినీష్ తన బాధ్యతలను మించి పని చేస్తున్నారు. ఉదయాన్నే చెత్త ట్రాక్టర్ నడుపుతూ, ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తూ, తడి-పొడి చెత్తపై అవగాహన కల్పిస్తున్నారు. డ్రైనేజీల్లో అడ్డంకులు తొలగించడంలోనూ ఆయన ముందుంటారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమంటూ, ఆదర్శ సర్పంచ్‌గా నిలుస్తున్నారు. ఈయన పనితీరు నేటి ప్రజాప్రతినిధులకు స్ఫూర్తిదాయకం.
సాధారణంగా సర్పంచ్ అంటే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏసీ గదుల్లో కూర్చుని సంతకాలు పెట్టే వ్యక్తి అని అందరూ అనుకుంటారు. కానీ, సిద్దిపేట జిల్లాకు చెందిన ఈ సర్పంచ్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. తెల్లవారుజామునే పారిశుద్ధ్య కార్మికుడిగా మారి, స్వయంగా చెత్త ట్రాక్టర్ నడుపుతూ గ్రామస్తుల మన్ననలు పొందుతున్నారు. అక్కన్నపేట మండలం రేగొండ గ్రామ సర్పంచ్ వినీష్, పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే గ్రామ వీధుల్లోకి వెళ్లి, స్వయంగా ట్రాక్టర్ డ్రైవర్‌గా మారి ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తున్నారు. కేవలం చెత్త సేకరించడమే కాకుండా, తడి చెత్త – పొడి చెత్త మధ్య తేడాలను వివరిస్తూ గ్రామస్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోయి మురుగు ఆగిపోతే, కార్మికుల కోసం ఎదురుచూడకుండా తానే స్వయంగా రంగంలోకి దిగి ఆటంకాలను తొలగిస్తున్నారు. “ప్రజలకు సేవ చేయడానికే తాను సర్పంచ్‌గా గెలిచానని, వారి సమస్యలను తీర్చడంలో తనకు ఏ హోదా అడ్డురాదని వినీష్ గర్వంగా చెబుతున్నారు. గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా ‘నేనున్నానంటూ’ ముందుండి నడిపిస్తున్న సర్పంచ్ వినీష్ తీరు, నేటి తరం ప్రజా ప్రతినిధులకు ఒక గొప్ప పాఠం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ
ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బుసలు కొట్టుకుంటూ బయటికొచ్చిన పాములు
ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే
Organic Wedding: ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. ‘సేంద్రియ’ పెళ్లి గురించి మీకు తెలుసా ??
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

