AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బుసలు కొట్టుకుంటూ బయటికొచ్చిన పాములు

ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బుసలు కొట్టుకుంటూ బయటికొచ్చిన పాములు

Phani CH
|

Updated on: Mar 09, 2026 | 1:31 PM

Share

వేసవి తాపం నుండి ఉపశమనం కోసం ఏసీ ఆన్ చేయగా, తిరువనంతపురంలోని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఏసీ యూనిట్‌లో ఏకంగా ఐదు పాములు కనిపించాయి. అటవీశాఖ అధికారులు, స్నేక్ క్యాచర్ సాయంతో నాలుగు పాములను సురక్షితంగా పట్టుకున్నారు. అవి విషరహితమైనవిగా నిర్ధారించారు. ఏసీ పైపుల వద్ద ఖాళీలు పూడ్చడం ద్వారా పాములు ఇంట్లోకి రాకుండా నివారించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

వేసవి తాపం నుండి ఉపశమనం పొందాలని ఏసీ ఆన్ చేయాలనుకున్న ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఊహించని అనుభవం ఎదురైంది. ఇంట్లోని ఏసీ యూనిట్ లోపల ఏకంగా ఐదు పాములు తిష్టవేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేరళలోని తిరువనంతపురం నగరంలోని శ్రీకార్యం ప్రాంతానికి చెందిన మాధవ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆఫీసు పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. తన బెడ్ రూమ్ లోని ఏసీ కింద భాగంలో ఏదో కదులుతున్నట్లు గమనించాడు. దగ్గరకు వెళ్లి చూడగా వింత శబ్దాలు వినిపించాయి. లోపల పాము ఉందని అనుమానించిన మాధవ్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ‘సర్ప’ యాప్ ద్వారా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. ఏసీ టెక్నీషియన్‌ను వెంటపెట్టుకుని అక్కడికి చేరుకున్నారు అటవీశాక సిబ్బంది. స్నేక్ క్యాచర్, ఏసీ టెక్నీషియన్ సాయంతో ఏసీని విప్పి చూడగా, అందులో ఐదు పాములు చుట్టలు చుట్టుకుని ఉండటాన్ని చూసి అందరూ అవాక్కయ్యారు. దాదాపు గంటన్నర పాటు శ్రమించిన అధికారులు నాలుగు పాములను సురక్షితంగా పట్టుకున్నారు. మరొకటి పైపు మార్గం ద్వారా బయటకు తప్పించుకుంది. అదృష్టవశాత్తూ అవి విషపూరితమైన పాములు కాదని అధికారులు తేల్చడంతో మాధవ్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటికి ఆనుకుని ఉన్న చెట్టు కొమ్మల ద్వారా లేదా బయటి ఏసీ పైపు మార్గం గుండా ఇవి లోపలికి ప్రవేశించి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఏసీ పైపుల వద్ద ఖాళీలు లేకుండా చూసుకోవాలని వారు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే

Organic Wedding: ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. ‘సేంద్రియ’ పెళ్లి గురించి మీకు తెలుసా ??

వానరాలకు ‘త్రిశూలం’ టాటూ.. అసలు కారణం ఇదే

సెలవు ఇవ్వని అధికారి.. అనారోగ్యం నిరూపణకు ప్యాంటు విప్పి చూపించిన లోకో పైలట్

Viral Video: వామ్మో.. ఇంత ఉందేంటి.. ఇవి బీట్ రూట్‌లా.. గుమ్మడికాయలా

Follow Us