AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వానరాలకు 'త్రిశూలం' టాటూ.. అసలు కారణం ఇదే

వానరాలకు ‘త్రిశూలం’ టాటూ.. అసలు కారణం ఇదే

Phani CH
|

Updated on: Mar 09, 2026 | 12:38 PM

Share

నిర్మల్ జిల్లాలో కోతులకు త్రిశూలం ఆకారంలో పచ్చబొట్లు వేయడం అటవీశాఖ చేపట్టిన వినూత్న ప్రక్రియ. జనావాసాల్లో కోతుల బెడద తగ్గించి, సంతతిని నియంత్రించేందుకు ఇది తోడ్పడుతుంది. సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు పూర్తయిన వానరాలను గుర్తించేందుకు వాటి నుదుటిపై శాశ్వత త్రిశూల టాటూ వేస్తున్నారు.

మనిషులు స్టైల్ కోసం పచ్చబొట్లు వేయించుకోవడం సర్వసాధారణం. అయితే నిర్మల్ జిల్లాలోని కోతులు తమ నుదుటిపై త్రిశూలం ఆకారంలో పచ్చబొట్లతో కనిపిస్తున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వినూత్న ప్రక్రియ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జనావాసాల్లో కోతుల బెడదను తగ్గించడంతో పాటు వాటి సంతతిని నియంత్రించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సారంగాపూర్ మండలం చించోలి సమీపంలో ఏర్పాటు చేసిన కోతుల పునరావాస మరియు పునరుత్పత్తి నిరోధక కేంద్రంలో, పశువైద్యులు వానరాలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. శస్త్రచికిత్స పూర్తయిన కోతులను తిరిగి అడవిలో వదిలేయడానికి ముందు, వాటికి ఆపరేషన్ జరిగిందని గుర్తించేందుకు శాశ్వత త్రిశూలం టాటూ వేస్తున్నారు. ఈ పచ్చబొట్టు కోతుల జీవితకాలం అంతా చెరిగిపోకుండా ఉంటుందని పశువైద్యుడు శ్రీకర్ రాథోడ్ తెలిపారు. ఇప్పటివరకు సుమారు 1650 వానరాలకు ఈ పద్ధతిలో శస్త్రచికిత్సలు చేసి, పచ్చబొట్లు వేశారు. ఈ శాస్త్రీయ నియంత్రణ పద్ధతితో కోతుల జనాభాను సమర్థవంతంగా అదుపు చేయవచ్చని అటవీశాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సెలవు ఇవ్వని అధికారి.. అనారోగ్యం నిరూపణకు ప్యాంటు విప్పి చూపించిన లోకో పైలట్

Viral Video: వామ్మో.. ఇంత ఉందేంటి.. ఇవి బీట్ రూట్‌లా.. గుమ్మడికాయలా

చదువుకున్న కోడలు కావాలి.. కానీ ఉద్యోగం చేయొద్దు !! మ్యాట్రిమోనియల్ పోస్ట్ వైరల్

చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

అద్భుతం.. మూగజీవికి పునర్జన్మ.. ప్రాణం నిలిపిన సీపీఆర్‌

Published on: Mar 09, 2026 12:37 PM
Follow Us