AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్భుతం.. మూగజీవికి పునర్జన్మ.. ప్రాణం నిలిపిన సీపీఆర్‌

అద్భుతం.. మూగజీవికి పునర్జన్మ.. ప్రాణం నిలిపిన సీపీఆర్‌

Phani CH
|

Updated on: Mar 09, 2026 | 12:00 PM

Share

సూర్యాపేటలో అస్వస్థతకు గురై గుండెపోటు వచ్చిన కొండముచ్చుకు పశువైద్యుడు డాక్టర్ పెంటయ్య సీపీఆర్‌ చేసి ప్రాణదానం చేశారు. నాలుగు గంటలపాటు నిరంతర చికిత్సతో మూగజీవి కోలుకుంది. మనుషులకే కాకుండా మూగజీవులకు కూడా సరైన సమయంలో వైద్యం అందితే ప్రాణాలు కాపాడవచ్చని, పశువైద్యుల మానవత్వాన్ని ఈ ఘటన చాటి చెప్పింది.

సామాన్యంగా మనుషులకు గుండెపోటు వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడేందుకు ప్రథమచికిత్సలో భాగంగా స్థానికులు’సిపిఆర్’ చేస్తుంటారు. అది మననుషులకాదు మూగజీవుల ప్రాణాలకు కాపాడేందుకు కూడా సీపీఆర్‌ ఎంతో బాగా పనిచేస్తుంది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. సూర్యాపేట జిల్లాలో ఒక మూగజీవికి సిపిఆర్ చేసి ప్రాణాలు పోయడం ద్వారా పశువైద్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. చనిపోయిందనుకున్న కొండముచ్చుకు డాక్టర్లు పునర్జన్మను ప్రసాదించారు. బరకత్ గూడెం గ్రామానికి చెందిన రామయ్య అనే రైస్ మిల్లు యజమాని, కోతుల బెడదను తప్పించుకోవడానికి నూజివీడు నుండి ఒక కొండముచ్చును కొనుగోలు చేశారు. అయితే, గత కొన్ని రోజులుగా అది ఆహారం తీసుకోకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఒక్కసారిగా శరీరం చల్లబడి స్పృహ కోల్పోవడంతో, కంగారుపడిన యజమాని దానిని వెంటనే కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు తరలించారు. పశువైద్యులు డాక్టర్ పెంటయ్య కొండముచ్చును పరీక్షించి, బీపీ తగ్గి కోమాలోకి వెళ్ళినట్లు గుర్తించారు. చికిత్స అందిస్తున్న సమయంలోనే దానికి గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించింది. సెకన్ల వ్యవధిలో నిర్ణయం తీసుకున్న డాక్టర్ పెంటయ్య, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిపిఆర్ నిర్వహించారు. గుండె స్పందన తిరిగి వచ్చేవరకు కాళ్లు, చేతులను మర్దన చేస్తూ శ్వాస అందించే ప్రయత్నం చేశారు. దాదాపు నాలుగు గంటల పాటు నిరంతరాయంగా చికిత్స అందించిన అనంతరం, ఆ కొండముచ్చు కోలుకుని కళ్లు తెరిచింది. ప్రాణాపాయం నుండి బయటపడిన ఆ మూగజీవిని చూసి యజమానితో పాటు అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. “మనుషులకే కాదు, సరైన సమయంలో చికిత్స అందితే ఏ ప్రాణినైనా కాపాడవచ్చని” ఈ ఘటన మరోసారి నిరూపించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nayanthara: రూ.31కోట్లు పెట్టి అపార్ట్‌మెంట్ కొన్న నయన్

Ustaad Bhagat Singh: రిలీజ్‌కు ముందే రూ.200 కోట్లు ?? దటీజ్‌ పవన్‌ మ్యాజిక్

Rajendra Prasad: సెల్ఫీ అడిగిన పిల్లాడిని పక్కకు నెట్టేసిన రాజేంద్రప్రసాద్

Rukmini Vasanth: హీరోయిన్‌ అయితే మాత్రం.. రాంగ్ యాంగిల్స్‌లో ఫోటోలు తీస్తారా ??

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు

Follow Us