ఇడుపుకాయితం టైటిల్‌పై వచ్చిన విమర్శలు విని బాధ కలిగింది
సీనియర్ నటుడు నరేష్ ఇడుపు కాయితం టైటిల్‌పై వచ్చిన విమర్శల పట్ల విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ భాషా సంస్కృతిని అవహేళన చేయడం సరికాదన్నారు. ప్రతి సంస్కృతి, సంప్రదాయాలకు ఎంతో విలువ ఉంటుందని, మాండలికాలు వేరైనా మనం మాట్లాడేది, తీసేది తెలుగు సినిమాలేనని స్పష్టం చేశారు. ప్రతి సంస్కృతిని గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రతి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని ప్రముఖ నటుడు నరేష్ పిలుపునిచ్చారు. ఇడుపు కాయితం సినిమా టైటిల్‌పై వచ్చిన విమర్శల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భాష, సంస్కృతిని అవహేళన చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన క్రేజీ కళ్యాణ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నరేష్ మాట్లాడుతూ, “తెలంగాణ అంటే తాగుడు, ఆంధ్ర అంటే భోజనం కాదు. ప్రతి ప్రాంతం, ప్రతి సంస్కృతికి గొప్ప విలువ ఉంది” అని ఉద్ఘాటించారు. మాండలికాలు వేరైనప్పటికీ, మనం మాట్లాడేది తెలుగు, తీసేది తెలుగు సినిమాలేనని ఆయన గుర్తు చేశారు. ఎవరో కొందరు ట్విట్టర్ లేదా యూట్యూబ్‌లో చేసే వ్యాఖ్యలను పెద్దది చేయాల్సిన అవసరం లేదన్నారు.”ఇడుపు కాయితం వంటి అంశాలపై వచ్చినప్పుడు చాలా బాధేసింది. తెలుగు సినిమా తీస్తున్నాం, తెలుగు మాట్లాడుతున్నాం. మాండలికాలు తమిళంలో, ఇతర భాషల్లో కూడా ఉంటాయి. ప్రతి సంస్కృతిని గౌరవించుకోవాలి” అని నరేష్ కోరారు.
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!
వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు
కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!

