ఎనుముల రేవంత్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్‌గా ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తింపు సాధించారు. దూకుడు ఆయనకు ప్లస్.. ఓ రకంగా మైనస్ కూడా అదే. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి.. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్కు తెలంగాణలో పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం మల్కాజిగిరి నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో ఉన్న వారిలో అగ్రస్థానం రేవంత్దే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009-2014 వరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2004-2018 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు.
రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి.. ధివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మేనకోడలు గీతను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది.
విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తెలంగాణ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.