AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election Results and Winners 2026 LIVE: కొత్తగూడెంలో ఉత్కంఠ.. కేటీఆర్ ఆఫర్‌కు సీపీఐ ఓకే అంటుందా..?

Telangana Municipal Election Results and Winners 2026 LIVE Updates in Telugu: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు విడదుల అవుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ దూకుడు చూపిస్తుంది. మరికొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో కల్వకుంట్ల కవితకు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలు షాక్ ఇచ్చారు.

Telangana Election Results and Winners 2026 LIVE: కొత్తగూడెంలో ఉత్కంఠ.. కేటీఆర్ ఆఫర్‌కు సీపీఐ ఓకే అంటుందా..?
Telangana Municipal Elections 2026 Result Live
Krishna S
|

Updated on: Feb 13, 2026 | 10:01 PM

Share

Telangana Municipal Poll Results 2026 LIVE: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్రవ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అన్ని లెక్కింపు కేంద్రాల్లో, స్ట్రాంగ్ రూమ్‌ల బయట వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సుమారు 15,000 నుంచి 20,000 మంది సిబ్బందిని నియమించారు. మొత్తం 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. తొమ్మిది మున్సిపాలిటీల్లో 12 మంది అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ నుంచి 2,358 మంది, బీఆర్ఎస్ నుంచి 2,478 మంది, బీజేపీ నుంచి 2,252 మంది సహా మొత్తం 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్లను లెక్కిస్తారు. ప్రతి వార్డుకు చెందిన బ్యాలెట్ బాక్సులను ఒక్కొక్కటిగా లెక్కింపు టేబుల్‌ పైకి తీసుకువస్తారు. పోలింగ్ స్టేషన్ వారీగా బ్యాలెట్లను 25 చొప్పున కట్టలుగా కడుతారు. 25కు తక్కువగా మిగిలిన బ్యాలెట్లను ప్రత్యేకంగా కట్టి సంఖ్యతో లేబుల్ చేస్తారు. ప్రతి రౌండ్‌లో వెయ్యి బ్యాలెట్ల 25 చొప్పున 40 కట్టలు తీసుకుని ప్రతి టేబుల్‌కు పంపిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర అభ్యర్థుల తరపున ఒక కౌంటింగ్ ఏజెంట్‌ను అనుమతిస్తారు.

కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని సిసిటివీ కెమెరాల నిఘా ద్వారా పర్యవేక్షిస్తారు. ఒక్కో వార్డులో సుమారు 800 నుంచి 1,000 ఓట్లు ఉండటంతో, మధ్యాహ్నం 12 గంటల కల్లా తొలి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సాయంత్రానికి పూర్తి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలు నిర్వహించనుండగా, అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు కూడా జరగనున్నాయి.

Watch LIVE:  

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Feb 2026 10:00 PM (IST)

    Telangana Municipal Elections Results: మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ హవా..

    • మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం
    • 116 స్థానాలకు గానూ 66 మున్సిపాలిటీల్లో విజయం ఢంకా మోగించిన కాంగ్రెస్‌
    • 13 మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు.
    • 36 మున్సిపాలిటీల్లో హంగ్‌
    • వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్‌ బ్లాక్‌ దక్కించుకుంది
    • వార్డుల వారీగా చూస్తే 2582 వార్డుల్లో సగానికిపైగా కాంగ్రెస్‌కే దక్కాయి
  • 13 Feb 2026 09:32 PM (IST)

    Nizamabad Corporation Election Result: నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో హంగ్‌..

    • నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో అత్యధిక స్థానాల్లో గెలిచిన బీజేపీ
    • మొత్తం 60 డివిజన్లు ఉండగా 28 చోట్ల బీజేపీ గెలుపు
    •  కాంగ్రెస్‌ 17, బీఆర్‌ఎస్‌ 1, ఇతరులు 14 చోట్ల గెలుపు
  • 13 Feb 2026 09:13 PM (IST)

    Kothagudem Corporation Election Results: బీఆర్ఎస్ కార్పొరేటర్ కిడ్నాప్..!

    కొత్తగూడెం కార్పొరేషన్‌లో గంటగంటకు సమీకరణాలు మారిపోతున్నాయి. 32వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ రాంబాబును.. కాంగ్రెస్ పార్టీ నేతలు కిడ్నాప్ చేశారని ఆయన భార్య నాగమణి ఆరోపిస్తున్నారు. తన భర్తను వెంటనే విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు.

  • 13 Feb 2026 08:50 PM (IST)

    Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్‌, సీపీఐ ఎప్పటికీ మిత్రపక్షాలే..

    • కొత్తగూడెంలో కాంగ్రెస్‌ ఓడిపోలేదు – మంత్రి పొంగులేటి
    • కొత్తగూడెంలో ఫ్రెండ్లీ కాంటెస్ట్ జరిగింది – పొంగులేటి
    • కాంగ్రెస్‌, సీపీఐ ఎప్పటికీ మిత్రపక్షాలే
    • కొత్తగూడెంలో గెలిచిన అభ్యర్థులందరికీ అభినందనలు
  • 13 Feb 2026 08:38 PM (IST)

    బీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలు

    • వర్ధన్నపేట మున్సిపల్‌ ఫలితాలు వెలువడ్డాయి
    • 12 స్థానాలకు గానూ బీఆర్‌ఎస్‌ 6, కాంగ్రెస్‌ 5, ఇతరులు 1 చోట విజయం
    • గెలిచిన ఆరుగురు అభ్యర్థులను క్యాంపునకు తరలిస్తున్న బీఆర్‌ఎస్‌
  • 13 Feb 2026 07:51 PM (IST)

    Revanth Reddy: ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం – సీఎం రేవంత్

    • ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన శ్రేణులకు ఈ విజయం అంకితం
    • రెండేళ్ల పాలన, అభివృద్ధిని చూసి ప్రజలు సంపూర్ణ తీర్పు ఇచ్చారు.
    • కార్యకర్తలు భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్‌ జెండాను మోశారు.
    • ఈ విజయం లక్షలాది కాంగ్రెస్‌ కార్యకర్తలది
    • భవిష్యత్‌లో మున్సిపాలిటీలను గొప్పగా అభివృద్ధి చేస్తాం
    • ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాం: రేవంత్‌రెడ్డి
  • 13 Feb 2026 07:31 PM (IST)

    Gadwal Municipal Elections Results: రసవత్తరంగా గద్వాల రాజకీయం

    • రసవత్తరంగా గద్వాల రాజకీయం
    • సరికొత్త వ్యూహంలో అధికార కాంగ్రెస్
    • హంగ్ రావడంతో ఆధిపత్యం కోసం ప్లాన్‌
    • ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ ఆధ్వర్యంలో సమావేశం
    • 19 మంది సభ్యులు కర్నాటకకు తరలింపు
    • 37 స్థానాల్లో కాంగ్రెస్-16, బీఆర్ఎస్-11, బీజేపీ-02…
    • ఎంఐఎం-1, ఇతరులు 2 చోట్ల గెలుపు
    • ఇండిపెండెంట్ల మద్దతు కూడగడుతున్న బండ్ల
  • 13 Feb 2026 07:10 PM (IST)

    Municipal Election Results 2026: కార్పొరేషన్‌ ఫలితాల్లో కాంగ్రెస్‌ హవా

    • తెలంగాణ కార్పొరేషన్‌ ఫలితాల్లో కాంగ్రెస్‌ హవా
    • నాలుగు కార్పొరేషన్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్‌
    • కమలం ఖాతాలో నిజామాబాద్‌ కార్పొరేషన్‌
    • కరీంనగర్ కార్పొరేషన్‌లో ఏటూ తేలని ఫలితం
    • భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్‌లో హంగ్‌
    •  4 కార్పొరేషన్లలో విజయంతో సంబురాల్లో కాంగ్రెస్ కేడర్
  • 13 Feb 2026 06:46 PM (IST)

    Ramchander Rao: బీజేపీ బలం పెరిగింది.. బీఆర్‌ఎస్‌ ఓట్ల శాతం తగ్గింది

    • మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం పెరిగింది – రాంచందర్‌రావు
    • దాదాపు 20 శాతం ఓట్లు మాకు పెరిగాయి
    • చాలా వార్డుల్లో 2 నుంచి 25 ఓట్ల తేడాతో ఓడిపోయాం
    • కొత్తగూడెం, వైరాలో తొలిసారి విజయం సాధించాం
    • అధికార దుర్వినియోగం, పోలీసులు , దౌర్జన్యాలతో కాంగ్రెస్‌ గెలిచింది
    • కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు
    • బీజేపీ బలం పెరిగింది.. బీఆర్‌ఎస్‌ ఓట్ల శాతం తగ్గింది
    • ఇండిపెండెంట్ల మద్దతుతో మరికొన్ని ఛైర్మన్‌ సీట్లు గెలుస్తాం
    • మజ్లిస్‌ డెరెక్షన్‌తో ముస్లిం ఓట్లరు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ఓటేశారు
  • 13 Feb 2026 06:27 PM (IST)

    Bellampalle Municipal Election Results 2026: బెల్లంపల్లిలో ఉద్రిక్తత

    • మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఉద్రిక్తత
    • బజార్ ఏరియాలో కౌంటింగ్ సెంటర్‌ దగ్గర గొడవ
    • 24వ వార్డులో రీ కౌంటింగ్ చేయాలని దుర్గం చిన్నయ్య డిమాండ్‌
    • కౌంటింగ్ కేంద్రంలోకి దూసుకొచ్చిన మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య
    • చిన్నయ్య బయటకు వెళ్లాక మళ్ళీ కౌంటింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే గడ్డం వినోద్
    • ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగిన బీఆర్ఎస్ నాయకులు
  • 13 Feb 2026 06:04 PM (IST)

    Siricilla Municipal Election Results 2026: సిరిసిల్లలో క్యాంప్‌ పాలిటిక్స్‌

    • సిరిసిల్లలో క్యాంప్‌ పాలిటిక్స్‌
    • క్యాంప్‌కి గెలుపొందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు
    • స్పష్టం అయిన మెజార్టీ వచ్చినా కూడా క్యాంపుకి బీఆర్ఎస్
    • కేటీఆర్ నిర్ణయం మేరకు చైర్మన్‌ని ఎన్నుకుంటామన్న కౌన్సిలర్లు
    • 39 వార్డుల్లో 27 చోట్ల బీఆర్ఎస్ విజయం
    • కాంగ్రెస్‌ 6, బీజేపీ 5, ఇతరులు 1 వార్డుల్లో గెలుపు
  • 13 Feb 2026 05:35 PM (IST)

    Jangaon Municipal Election Results 2026: జనగామలో హై టెన్షన్.. ఎమ్మెల్యే పల్లా Vs ఎంపీ చామల

    • జనగామ మున్సిపాలిటీలో ఉత్కంఠగా మారిన ఛైర్మన్ పీఠం
    • కీలకంగా మారిన నలుగురు ఇండిపెండెంట్లు
    • 23వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన పర్వతాలు
    • అతడ్ని బీఆర్‌ఎస్‌ క్యాంపుకు తరలిస్తుంటే భువనగిరి..
    • ఫోర్ట్‌ దగ్గర అడ్డుకున్న కాంగ్రెస్‌ ఎంపీ చామల వర్గం
    • జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో వాగ్వాదం
    • ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం
  • 13 Feb 2026 05:20 PM (IST)

    Kothagudem Corporation Result: సీపీఐకీ కేటీఆర్ బిగ్ ఆఫర్..

    • కొత్తగూడెం కార్పొరేషన్‌లో హంగ్
    • సీపీఐకి ఓపెన్ అన్‌కండిషనల్‌ ఆఫర్ ప్రకటించిన కేటీఆర్
    • మేయర్‌ సీటు సీపీఐకే.. కలిసొస్తామంటే రెడీ అంటున్న కేటీఆర్
    • కాంగ్రెస్, బీజేపీని నిలువరించడం కోసం సిద్దమని కేటీఆర్ ప్రకటన
    • కొత్తగూడెంలో 60 డివిజన్లకు గాను కాంగ్రెస్, సీపీఐకి చెరో 22స్థానాలు
    • మిగతా చోట్ల బీఆర్ఎస్ 8, బీజేపీ 1, సీపీఎం 1, స్వతంత్రులు 6చోట్ల గెలుపు
    • ఇప్పుడు బీఆర్ఎస్ ఆఫర్‌తో సీపీఐ కోర్టులో బంతి
    • సింగరేణి గొంతు కోస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌వైపు వెళ్లొద్దని కేటీఆర్‌ సూచన
  • 13 Feb 2026 04:45 PM (IST)

    Nagarkurnool Municipal Election Results 2026: 2 ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం

    • నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ రీకౌంటింగ్‌లో తేలిన 12వ వార్డు ఫలితం
    • 12వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జయలక్ష్మి 2 ఓట్ల తేడాతో విజయం
    • తొలి కౌంటింగ్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 3 ఓట్ల ఆధిక్యం
  • 13 Feb 2026 04:29 PM (IST)

    సీఎం రేవంత్‌ను అభినందించిన ప్రియాంక గాంధీ

    • కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
    • మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో గెలుపుపై సీఎంకు ప్రియాంక అభినంద‌న‌లు
    • కాంగ్రెస్ పార్టీ ఘ‌నవిజ‌యంపై హ‌ర్షం వ్యక్తం చేసిన ప్రియాంక గాంధీ
    • ప్రభుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ‌ పథకాలే గెలిపించాయని ప్రియాంకకు తెలిపిన రేవంత్
  • 13 Feb 2026 04:16 PM (IST)

    Jagtial Municipal Election Results 2026: జగిత్యాల స్వతంత్ర అభ్యర్థుల హవా

    • జగిత్యాల మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థుల హవా
    • మొత్తం 50 వార్డులకు గానూ కాంగ్రెస్‌ 12, బీజేపీ 4, బీఆర్‌ఎస్‌ 4 వార్డుల్లో గెలుపు
    • 14 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం, 2 వార్డుల్లో ఎంఐఎం గెలుపు
    • జగిత్యాలలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన జీవన్‌రెడ్డి అనుచరులు
  • 13 Feb 2026 04:03 PM (IST)

    Isnapur Municipal Election Results 2026: ఇస్నాపూర్‌లో ఉద్రిక్తత

    • సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటని ప్రధాన పార్టీలు
    • మొత్తం 26 వార్డుల్లో కాంగ్రెస్ 10, బీఆర్‌ఎస్‌ 12, స్వతంత్రులు 4 స్థానాల్లో విజయం
    • మ్యాజిక్ ఫిగర్‌కు 2 సీట్ల దూరంలో బీఆర్‌ఎస్‌, 4 సీట్ల దూరంలో కాంగ్రెస్
    • స్వతంత్ర అభ్యర్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఇరు పార్టీ వర్గాలు
    • క్యాంపులకు తరలించేందుకు ఇరు పార్టీల నాయకుల యత్నం
    • భారీగా మోహరించిన పోలీసులు.. ఉద్రిక్త వాతావరణం
  • 13 Feb 2026 03:52 PM (IST)

    Kothagudem Corporation Election Results 2026: కొత్తగూడెం కార్పొరేషన్‌లో కమ్యూనిస్టుల హవా

    • కొత్తగూడెం కార్పొరేషన్‌లో కమ్యూనిస్టుల హవా
    • కొత్తగూడెంలో 60 డివిజన్లలో సీపీఐ 24 స్థానాల్లో విజయం
    • 20 డివిజన్లలో కాంగ్రెస్, BRS 7 చోట్ల గెలుపు
    • సీపీఎం 1, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 5 డివిజన్లలో గెలుపు
    • మున్సిపల్ ఛైర్మన్ కైవసం దిశగా కమ్యూనిస్టులు
  • 13 Feb 2026 03:17 PM (IST)

    Gajwel Municipal Election Results 2026: గజ్వేల్ మున్సిపాలిటీలో ఉద్రిక్తత

    • సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ 2వ వార్డులో ఉద్రిక్తత
    • బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ర్యాలీని అడ్డుకున్న కాంగ్రెస్‌
    • బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్‌ అభ్యర్థి దాడి
    • గజ్వేల్‌ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
  • 13 Feb 2026 02:56 PM (IST)

    Municipal Election Results 2026: జీవన్ రెడ్డి షాక్..

    • జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కీలక పరిణామం
    • మాజీమంత్రి జీవన్ రెడ్డి బలపరిచిన అభ్యర్ధి ఓటమి
    • జీవన్‌రెడ్డి సొంత డివిజన్‌ 23లో పోటీ చేసిన అభ్యర్ధి
    • ఎమ్మెల్యే సంజయ్ బలపరిచిన మమత రామకృష్ణారెడ్డి విజయం
  • 13 Feb 2026 02:27 PM (IST)

    Gadwal Election Results 2026: వడ్డేపల్లి మున్సిపాలిటీలో మరో ట్విస్ట్..

    • గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో మరో ట్విస్ట్
    • వడ్డేపల్లి మున్సిపాలిటీ కైవసం చేసకున్న ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ
    • కవితతో తమకు సంబంధం లేదన్న AIFB నేతలు
    • తమను చూసి మాత్రమే ప్రజలు ఓట్లేశారన్న AIFB నేతలు
  • 13 Feb 2026 01:32 PM (IST)

    Municipal Election Results 2026: హంగ్ ఏర్పడ్డ మున్సిపాలిటీలు ఇవేః

    1. జహీరాబాద్

    2. కేసముద్రం 3. కోహిర్

    4. దేవరకద్ర

    5. అలంపూర్

    6. ఇస్నాపూర్

    7. అమరచింత‌

    8. జనగాం

    9. ఆసిఫాబాద్

    10. జిన్నారం

    11. జమ్మికుంట

    12. ఆలియాబాద్

    13. బోధన్

    14. వేములవాడ

    15. గద్వాల

  • 13 Feb 2026 01:29 PM (IST)

    Miryalaguda Election Results 2026: సత్తా చాటిన కాంగ్రెస్

    నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో సత్తా చాటిన కాంగ్రెస్.

    మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న హస్తం పార్టీ.

    కాంగ్రెస్…31

    బీఆర్ఎస్… 14

    బీజేపీ…1

    ఇతరులు..2 వార్డుల్లో గెలుపు.

  • 13 Feb 2026 01:27 PM (IST)

    Tirumalagiri Election Results 2026: తల్లి కొడుకుల విజయం..

    సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో తల్లి కొడుకులు విజయం…

    వేర్వేరు పార్టీల నుంచి పోటీచేసిన తల్లి కొడుకులు..

    నాలుగో వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధి గా తల్లి బత్తుల శకుంతల విజయం..

    ఏడో వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా కొడుకు బత్తుల శ్రీనివాస్ విజయం.

  • 13 Feb 2026 01:22 PM (IST)

    Jangoan Election Results 2026: కీలకంగా మారిన స్వతంత్ర అభ్యర్థులు

    జనగామ మున్సిపల్ చైర్మన్ పీఠం పై ఉత్కంఠ

    కీలకంగా మారిన స్వతంత్ర అభ్యర్థులు

    చైర్మన్ పీఠం డిమాండ్ చేస్తున్న నలుగురు స్వతంత్ర అభ్యర్థులు

    గెలిచిన స్వతంత్ర అభ్యర్థులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ – BRS పోటా పోటీ ప్రయత్నాలు

    పాండు అనే 15వ వార్డు స్వతంత్ర అభ్యర్థిని చుట్టుముట్టిన కాంగ్రెస్ , BRS నేతలు

    కౌంటింగ్ కేంద్రం నుండి కారులో తీసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు

    జనగామ మున్సిపాలిటీ మొత్తం వార్డులు: 30

    కాంగ్రెస్ – 12

    BRS – 13

    CPM – 01

    స్వతంత్రులు – 04

  • 13 Feb 2026 12:51 PM (IST)

    Election Results 2026: కవిత మద్దతుదారుల హవా

    — AIFB నుంచి పోటీ చేసిన కవిత మద్దతుదారులు

    — 40 మున్సిపాలిటీల్లోని 212 వార్డుల్లో పోటీ

    — వడ్డేపల్లి మున్సిపాలిటీలో AIFB విజయం

    — వడ్డేపల్లిలోని 10లో 8 వార్డులు విజయం

    — సుల్తానా బాద్‌లో ఒక వార్డులో విజయం

    — పెద్దపల్లి 1 వార్డు, మంథని 1 వార్డు

    — రామగుండంలో 10 నుంచి 12 లీడ్‌

    — ఆదిలాబాద్‌ లో 8 లీడ్‌, మంచిర్యాలలో 4 లీడ్‌

    — ఒవరాల్‌గా 40 వరకూ గెలుస్తామన్న ధీమా

  • 13 Feb 2026 12:46 PM (IST)

    Karimnagar Election Results 2026: కమల వికాసం

    కొనసాగుతున్న కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్స్ కౌంటింగ్

    66 వార్డులున్న కరీంనగర్ లో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల వివరాలు..

    — బీజెపీ : 28

    — బీఆర్ఎస్ : 13

    — కాంగ్రెస్  : 19

    — ఇతరులు: 02

  • 13 Feb 2026 12:37 PM (IST)

    Ibrahimpatnam Election Results 2026: కారుకే జై

    కారు పార్టీకే జై కొట్టిన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రజలు

    మొత్తం 24 వార్డులకు బీఆర్ఎస్ – 13 వార్డులు

    కాంగ్రెస్ – 08 వార్డులు

    బీజేపీ – 02 వార్డులు

    స్వతంత్ర – 01 వార్డులో విజయం

  • 13 Feb 2026 12:35 PM (IST)

    Kondangal Election Results 2026: ’హస్త‘గతం

    వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలో మొత్తం వార్డులు -12

    కాంగ్రెస్ – 06

    బీఆర్ఎస్ – 01

    MIM -01

  • 13 Feb 2026 12:33 PM (IST)

    Isnapur Election Results 2026: ఒక్క ఓటుతో గెలుపు

    సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మూడో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కంజర్ల శ్రీవాణి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు.

  • 13 Feb 2026 12:18 PM (IST)

    Medak Election Results 2026: తల్లి, కొడుకుల గెలుపు

    మెదక్ మునిసిపాలిటిలో బీఆర్ఎస్ తరపున పోటీచేసిన తల్లి, కొడుకు విజయం

    29వ వార్డు నుంచి కొడుకు భట్టి ఉదయ్ విజయం

    17 వ వార్డు నుంచి తల్లి భట్టి లలిత గెలుపు

  • 13 Feb 2026 12:16 PM (IST)

    Ramyampet Election Results 2026: భార్యాభర్తల విజయం

    మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో భార్యాభర్తలు ఘనవిజయం..

    కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గజవాడ లావణ్య 281 వోట్ల మెజార్టీ

    భర్త బెజవాడ నాగరాజు 126 ఓట్ల మెజార్టీతో గెలుపు

  • 13 Feb 2026 12:13 PM (IST)

    Amarachintha Election Results 2026: ఖాతా తెరిచిన బీజేపీ

    వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో హంగ్.

    మెజారిటీ సంఖ్య 6 ను చేరుకోలేకపోయినా పార్టీలు

    మొత్తం వార్డులు : 10

    కాంగ్రెస్: 03

    BRS: 03

    BJP:03

    ఇతరులు: 01

  • 13 Feb 2026 12:10 PM (IST)

    Adilabad Election Results 2026: ఖాతా తెరిచిన బీజేపీ

    — ఆదిలాబాద్ లో తొలి ఫలితం విడుదల

    — ఖాతా తెరిచిన బీజేపీ

    — ఆదిలాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 48 వార్డు స్వతంత్ర అభ్యర్థి రంగినేని మనీషాపై బీజేపీ అభ్యర్థి ఆకుల రేణుక 34 ఓట్లతో విజయం.

  • 13 Feb 2026 12:03 PM (IST)

    Isnapur Election Results 2026: ఇస్నాపూర్‌లో హంగ్‌

    — సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మునిసిపాలిటీలోనూ హంగ్‌

    — మొత్తం 26వార్డుల్లో అత్యధికంగా BRS విజయం

    — BRS – 12, కాంగ్రెస్ – 10, స్వతంత్రులు- 4

  • 13 Feb 2026 11:53 AM (IST)

    Mahabubnagar Election Results 2026: కాంగ్రెస్ పైచేయి

    — ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ఫలితాల్లో కాంగ్రెస్ పైచేయి

    — 18 మున్సిపాలిటీలో ఒకటి కాంగ్రెస్ వశం కాగా.. మరొకటి BRS ఖాతాలో చేరింది

    — భూత్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

    — 12 స్థానాల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ ఆధిక్యం

    — ఐజా మున్సిపాలిటీ BRS కైవసం

    — మరో మున్సిపాలిటీ అమరచింతలో బీఆర్ఎస్ ఆధిక్యం

    — అలంపూర్‌లో కాంగ్రెస్, BRS మధ్య పోటాపోటీ

    — హంగ్ దిశగా దేవరకద్ర మున్సిపాలిటీ

    — వడ్డేపల్లి కవిత మద్దతుదారులు AIFB వశం

  • 13 Feb 2026 11:50 AM (IST)

    Bellampally Election Results 2026: కాంగ్రెస్-బీజేపీ హోరాహోరీ

    మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోనూ ఆసక్తికర ఫలితాలు

    బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ

    బెల్లంపల్లిలోని మొదటి రౌండులోని 17 వార్డుల ఫలితాలు వెల్లడి

    బీఆర్ఎస్ – 08 కాంగ్రెస్ – 08 స్వతంత్ర – 01

  • 13 Feb 2026 11:48 AM (IST)

    Huzurabad Election Results 2026: కాంగ్రెస్ కైవసం

    — హుజురాబాద్ మున్సిపాలిటి కాంగ్రెస్ కైవసం

    — మొత్తం స్థానాలు 30, కాంగ్రెస్ 16, బిఅర్ఎస్ 08, బిజేపి – 05, ఇండిపెండెంట్ – 01

  • 13 Feb 2026 11:46 AM (IST)

    Kesamudram Election Results 2026: కేసముద్రంలో హాంగ్..

    వరంగల్ జిల్లాలోని కేసముద్రం మున్సిపల్ ఎన్నికల్లో హాంగ్..

    8 వార్డులు కాంగ్రెస్ ,8 వార్డులు బి ఆర్ ఎస్ గెలుపు..

    ఎక్స్ అఫిషియో ఓట్లతో మున్సిపాలిటీ కైవసం చేసుకోనున్న కాంగ్రెస్..!

  • 13 Feb 2026 11:42 AM (IST)

    మున్సిపల్ కార్పొరేషన్‌లలోనూ కాంగ్రెస్ దూకుడు

    — నల్గొండ, కొత్తగూడెం కార్పొరేషన్‌లలో అధికార పార్టీ ముందంజ

    — నల్గొండలో 48 స్థానాల్లో 10 వార్డుల్లో కాంగ్రెస్ ముందంజ

    — రెండు స్థానాల్లో ముందంజలో ఉన్న BRS

    — కొత్తగూడెంలో ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్

    — ఆలస్యంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్

    — 60 డివిజన్‌లకు ఒకేసారి కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

  • 13 Feb 2026 11:38 AM (IST)

    Chityal Election Results 2026: సత్తా చాటిన ట్రాన్స్‌జెండర్

    నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో సంచలన నమోదైంది. చిట్యాల 1వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ట్రాన్స్‌జెండర్ నాగిళ్ల సుధాకర్ ఘన విజయం సాధించారు. తాజా ఫలితాల్లో 102 ఓట్ల మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు.

  • 13 Feb 2026 11:33 AM (IST)

    Sadashivpet Election Results 2026: కాంగ్రెస వశం

    — సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

    — మొత్తం 26 వార్డుల్లో ఇప్పటికే 14 స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌

    — బీఆర్‌ఎస్‌-6, బీజేపీ -1, ఇండిపెండెంట్స్‌-1

  • 13 Feb 2026 11:31 AM (IST)

    Vaddepalli Election Results 2026: సత్తా చాటిన కవిత

    — జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో షాకింగ్‌ రిజల్ట్‌

    –వడ్డేపల్లి మున్సిపాలిటీ AIFB కైవసం

    –వడ్డేపల్లిలో AIFB 8, కాంగ్రెస్‌ 1, బీఆర్‌ఎస్‌ 1

    –AIFB గుర్తుపై పోటీ చేసిన కవిత మద్దతుదారులు

    — ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ గుర్తుపై జాగృతి నేతలు పోటీ

  • 13 Feb 2026 11:28 AM (IST)

    తెలంగాణలో మూడు మున్సిపాలిటీల్లో హంగ్‌

    — అలంపూర్‌ మున్సిపాలిటీలో హంగ్‌

    — అలంపూర్‌లో మొత్తం 10 వార్డులు

    — చెరో ఐదు వార్డుల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ గెలుపు

    — దేవరకద్ర మున్సిపాలిటీలో హంగ్‌

    — దేవరకద్రలో మొత్తం 12 వార్డులు

    — కాంగ్రెస్‌-6, బీఆర్‌ఎస్‌-4, బీజేపీ-1, ఇతరులు-1

    — కోహిర్‌ మున్సిపాలిటీలో ఆసక్తికరంగా ఫలితం

    — మొత్తం 16 వార్డుల్లో కాంగ్రెస్‌ 8 చోట్ల విజయం

    — ఐదు స్థానాల్లో విజయం సాధించిన బీఆర్‌ఎస్‌

    — ఒక్కో వార్డులో MIM, బీజేపీ, ఇండిపెండెంట్ విజయం

    — మ్యాజిక్‌ ఫిగర్‌కు ఒక స్థానం దూరంలో కాంగ్రెస్‌

    — కీలకంగా మారిన ఇండిపెండెంట్‌

  • 13 Feb 2026 11:26 AM (IST)

    Karimnagar Election Results 2026: కాంగ్రెస్ హవా

    ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనూ కాంగ్రెస్‌ హవా

    పెద్దపల్లి: సుల్తానాబాద్‌ కాంగ్రెస్‌ కైవసం

    సుల్తానాబాద్‌(15): కాంగ్రెస్‌-12, బీఆర్‌ఎస్‌-1

    బీజేపీ-1, ఇతరులు-1 వార్డులో విజయం

    మంథని మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

    మంథని(13): కాంగ్రెస్‌-11, BRS-1, ఇతరులు-1

  • 13 Feb 2026 11:24 AM (IST)

    Neredcherla Election Results 2026: జనసేన బోణి కొట్టిన జనసేన

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ కొట్టింది. నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించారు.

  • 13 Feb 2026 11:23 AM (IST)

    Banswada Election Results 2026: కాంగ్రెస్ విజయం

    — బాన్సువాడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

    — మొత్తం 19 వార్డుల్లో కాంగ్రెస్‌ 10చోట్ల విజయం

    — బీజేపీ-3, బీఆర్‌ఎస్‌-3, ఎంఐఎం-1

    — ఒకచోట ఇండిపెండెంట్‌ విజయం

  • 13 Feb 2026 11:20 AM (IST)

    Medak Election Results 2026: ఉమ్మడి జిల్లాలో పోటా పోటీ

    — ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మున్సిపాలిటీల ఫలితాలు

    — నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

    — నారాయణఖేడ్‌(15): కాంగ్రెస్‌-10, BRS-2, BJP-1

    — గడ్డపోతారం మున్సిపాలిటీ BRS కైవసం

    — 14 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం

    — మూడు వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు

    — ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం

    — గుమ్మడిదల మున్సిపాలిటీ BRS కైవసం

    — గుమ్మడిదల (22): BRS 14, కాంగ్రెస్‌ 4

    — గుమ్మడిదల (22): BJP 2, ఇండిపెండెంట్ 1

    — ఇంద్రేశం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం

    — ఇంద్రేశం(18): బీఆర్‌ఎస్‌-9, కాంగ్రెస్‌-6

    — బీజేపీ-2, ఇండిపెండెంట్‌-1 వార్డుల్లో విజయం

  • 13 Feb 2026 11:18 AM (IST)

    Narayankhed Election Results 2026: కాంగ్రెస్ కైవసం

    — నారాయణఖేడ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

    — మొత్తం 15 వార్డుల్లో 10 చోట్ల కాంగ్రెస్‌ విజయం

    — రెండు వార్డుల్లో బీఆర్‌ఎస్‌.. ఒకచోట బీజేపీ గెలుపు

  • 13 Feb 2026 11:16 AM (IST)

    Thorur Election Results 2026: బీఆర్ఎస్ కైవసం

    తొర్రూరు మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం

    మొత్తం 16 వార్డులకు గాను

    10 వార్డుల్లో బీఆర్ఎస్, 6 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం

  • 13 Feb 2026 11:14 AM (IST)

    Huzurnagar Election Results 2026: కాంగ్రెస్ కైవసం

    — హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

    — మొత్తం 28 వార్డుల్లో 19 చోట్ల కాంగ్రెస్‌ గెలుపు

    — బీఆర్‌ఎస్‌ 4 వార్డుల్లో విజయం

    — సీపీఐ-1, సీపీఎం-1, ఇండిపెండెంట్స్‌ – 3

  • 13 Feb 2026 11:13 AM (IST)

    Mahabubabad Election Results 2026: కాంగ్రెస్ కైవసం

    మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ – కాంగ్రెస్ కైవసం..

    1వ వార్డు – కాంగ్రెస్ – ఇస్లావత్ తిరుపతి

    2వ వార్డు – BRS – బానోత్ భద్రమ్మ

    3వ వార్డు – BRS – బానోత్ కిషన్

    4వ వార్డు – కాంగ్రెస్ – మెరుగు రాము

    5వ వార్డు – BRS – బోడ భాస్కర్

    6వ వార్డు – కాంగ్రెస్ – కలం సునీత

    7వ వార్డు – కాంగ్రెస్ – మండం కాంతమ్మ

    8వ వార్డు – కాంగ్రెస్ – ప్రగతి విసారపు

    9వ వార్డు – కాంగ్రెస్ – గుగులోత్ నీలా

    10వ వార్డు – BRS – బేబీ శ్రీ

    11వ వార్డు – BRS – లావుడియా సత్యవతి (యుగంధర్)

    12వ వార్డు – ఇండిపెండెంట్ – గంట్ల గౌతమ్ రెడ్డి

    13వ వార్డు – BRS – గంట్ల సుజాత మహిపాల్ రెడ్డి

    14వ వార్డు – కాంగ్రెస్ – జాటోత్ సురేష్

    15వ వార్డు – కాంగ్రెస్ – లునావత్ రమేష్

    పార్టీ వారీగా మొత్తం:

    కాంగ్రెస్ – 8

    BRS – 6

    ఇండిపెండెంట్ – 1

    మొత్తం వార్డులు – 15

  • 13 Feb 2026 11:11 AM (IST)

    Choutupppal Election Results 2026: 3 పార్టీల పోటా పోటీ

    — చౌటుప్పల్ మున్సిపాలిటీలో మూడు పార్టీ హవా

    — 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొససనం రాకేష్ రెడ్డి విజయం

    — 2వ వార్డులో బీజేపీ అభ్యర్థి పోలేపల్లి లక్ష్మీ గెలుపు

    — 3వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పల్లె లావణ్య గెలుపు

    — 4వ వార్డు BRS అభ్యర్థి ఉదరి యాదయ్య విజయం

    — 5వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కొయ్యడ శేఖర్ విజయం

    — 6వ వార్డు బీజేపీ అభ్యర్థి అలె శ్రీలత చిరంజీవి 199 ఓట్లతో విజయం

  • 13 Feb 2026 11:03 AM (IST)

    క్యాంప్ రాజకీయాలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు

    ఎన్నికైన అభ్యర్థికి వెంటనే ఎలక్షన్ సర్టిఫికేట్ జారీ చేయాలి

    రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అధికారిక ధృవీకరణ చేయాలి

    Rule 63 ప్రకారం సర్టిఫికేట్ ఇవ్వడం తప్పనిసరి.

    Form XXVII లో ఎలక్షన్ సర్టిఫికేట్ అందించాలి.

    సర్టిఫికేట్ అందుకున్నట్టు అభ్యర్థి సంతకం అవసరం తప్పనిసరి

    ఎన్నిక ఫలితాలు ప్రకటించిన వెంటనే ప్రక్రియ పూర్తి అవుతుంది.

    ఎన్నికైన అభ్యర్థి అధికారికంగా గుర్తింపు పొందినట్లు ధృవీకరణ చేయాలి

    రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో సర్టిఫికేట్ అందజేయాలి.

    ఇప్పటికే అభ్యర్థులను క్యాంప్ లకు తరలించిన ఆయా పార్టీలు

  • 13 Feb 2026 11:03 AM (IST)

    Neredcherla Election Results 2026: బోణి కొట్టిన జనసేన

    — సూర్యాపేట జీల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

    — నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ 9వార్డుల్లో విజయం

    — బీఆర్ఎస్…05

    — జనసేన- 1

  • 13 Feb 2026 10:53 AM (IST)

    Bichkunda Election Results 2026: ఉత్కంఠ

    — బిచ్కుంద మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

    — మొత్తం 12 వార్డుల్లో 7 చోట్ల కాంగ్రెస్‌ విజయం

    — ఒక వార్డులో బీఆర్‌ఎస్‌ గెలుపు

    — ఇంకా నాలుగు వార్డుల్లో కొనసాగుతోన్న కౌంటింగ్‌

  • 13 Feb 2026 10:51 AM (IST)

    Aiza Election Results 2026: BRS కైవసం

    జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మున్సిపాలిటీ BRS కైవసం

    — ఐజాలో మొత్తం వార్డులు 20

    — BRS -13 వార్డుల్లో విజయం సాధిస్తే, కాంగ్రెస్ 7వార్డుల్లో గెలుపొందారు.

  • 13 Feb 2026 10:47 AM (IST)

    Deverakonda Election Results 2026: పోటా పోటీ

    — నల్లగొండ జిల్లా దేవరకొండ మునిసిపాలిటీ ఎన్ని కల ఫలితాలు చూద్దాం..

    — 1వ వార్డ్ గుండాల అంజయ్య బిజెపి గెలుపు

    — 2వ వార్డ్ BRS గెలుపు

    — 9 వార్డ్ ముత్యాల చంద్రకళ BRS గెలుపు

    — 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

    — 17 వార్డు బీఆర్ఎస్ పోట మధు గెలుపు

    — 19వ వార్డు స్వతంత్ర అభ్యర్థి శ్రీధర్ గౌడ్ గెలుపు

    — 13వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పులిజాల భవాని గెలుపు

    — 20 వార్డ్ పున్న శైలజ కాంగ్రెస్ గెలుపు

  • 13 Feb 2026 10:45 AM (IST)

    Halya Election Results 2026: కాంగ్రెస్‌ కైవసం

    నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

    హాలియా మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు

    10 వార్డులు కాంగ్రెస్‌, 2 వార్డులు బీఆర్‌ఎస్‌ కైవసం

  • 13 Feb 2026 10:22 AM (IST)

    Yellampet Election Results 2026: పోటా పోటీ

    — మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 7 వార్డుల ఫలితాలు వచ్చాయి

    — నాలుగు వార్డుల్లో BRS, మూడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు —

  • 13 Feb 2026 10:21 AM (IST)

    Makthal Election Results 2026: కాంగ్రెస్‌ దూకుడు

    — మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు

    — మక్తల్ 8వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి అనిత విజయం

    — 13వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి సరిత గోవిందరావు విజయం

  • 13 Feb 2026 10:19 AM (IST)

    Isnapur Election Results 2026: కాంగ్రెస్‌ దూకుడు

    — ఇస్నాపూర్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ దూకుడు

    — 4వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం కవిత విజయం

    — 5వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి జ్యోతి గోపాల్‌ గెలుపు

    — 8వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి మాధవి నరేందర్‌రెడ్డి విజయం

    — 9వ వార్డులో ఇండిపెండెంట్‌ వెంకటేష్‌ గెలుపు

  • 13 Feb 2026 10:17 AM (IST)

    Choutuppal Election Results 2026: కాంగ్రెస్‌ బోణి

    యాదాద్రి జిల్లా మున్సిపాలిటీలో 1వ వార్డులో కాంగ్రెస్ గెలుపు

    కాంగ్రెస్ అభ్యర్థి కొసననం రాకేష్ రెడ్డి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి తొర్పునూరి మల్లేష్ పై విజయం సాధించారు.

  • 13 Feb 2026 10:15 AM (IST)

    Wanaparthy Election Results 2026: కాంగ్రెస్‌ జోరు

    వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో 1, 2 వ వార్డుల్లో కాంగ్రెస్ గెలుపు

    పెబ్బేరు మున్సిపాలిటీ 6వార్డులో కాంగ్రెస్ విజయం.

    3 వార్డులో బిఆర్ఎస్ గెలుపు

  • 13 Feb 2026 10:14 AM (IST)

    Sangareddy Election Results 2026: కాంగ్రెస్‌ జోరు

    సంగారెడ్డి మున్సిపాలిటwలో బోణి కొట్టిన కాంగ్రెస్

    23 వార్డు అభ్యర్థి కూన వనిత, 25 వార్డ్ లో ఆయేషా సుల్తానా విజయం

  • 13 Feb 2026 10:12 AM (IST)

    Bhongir Election Results 2026: కాంగ్రెస్‌ జోరు

    — భువనగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ జోరు

    — మూడు వార్డుల్లో కాంగ్రెస్‌ విజయం

    — బీజేపీ ఒక వార్డులో.. బీఆర్‌ఎస్ ఒక వార్డులో గెలుపు

    — ఒకచోట ఇండిపెండెంట్‌ విజయం

  • 13 Feb 2026 10:11 AM (IST)

    Mancheral Election Results 2026: బోణి ‌కొట్టిన CPI

    — మంచిర్యాలలో బోణి ‌కొట్టిన CPI

    — క్యాతపల్లి మున్సిపాలిటీలో విజయం

    — 19వ వార్డు CPI అభ్యర్థి మిట్టపల్లి సరిత శ్రీనివాస్ గెలుపు

    — 456 ఓట్లతో విజయం సాధించిన CPI అభ్యర్థి

  • 13 Feb 2026 10:09 AM (IST)

    Ashwaraopet Election Results 2026: ఫలితాల్లో ఉత్కంఠ

    — ఖమ్మంజిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో పోటాపోటీ

    — అశ్వారావుపేటలో మొత్తం 22 వార్డులు

    — కాంగ్రెస్ -02, BRS- 02, BJP-1

    – ఉత్కంఠ రేపుతున్న అశ్వారావుపేట మున్సిపాలిటీ ఫలితాలు

    — 4, 12 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం

    — 7, 14 వార్డుల్లో BRS గెలుపు

    — 17వ వార్దులో BJP విజయం

  • 13 Feb 2026 10:06 AM (IST)

    Chandur Election Results 2026: బోణి కొట్టిన కాంగ్రెస్

    నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ తొమ్మిదో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కలిమికొండ పారిజాత జనార్ధన్ 160 ఓట్లపైగా మెజార్టీ తో విజయం

  • 13 Feb 2026 10:05 AM (IST)

    Bhudan Pochampally Election Results 2026: బీజేపీ తొలి బోణి

    భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ మొదటి విజయం…..

    1వ వార్డులో ఎనిమిది ఓట్లతో మొదటి వార్డు బీజేపీ విజయం

  • 13 Feb 2026 10:04 AM (IST)

    Gadda Pocharam Election Results 2026: బీఆర్ఎస్ తొలి విజయం

    సంగారెడ్డి జిల్లా గడ్డపొతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం..

    ఎన్నికల ఫలితాల్లో మొదటి మున్సిపాలిటీని గెలుచుకున్న బీఆర్ఎస్

    మున్సిపాలిటీ వార్డులలో 10 బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా.. 1 కాంగ్రెస్ అభ్యర్థి విజయం

  • 13 Feb 2026 10:01 AM (IST)

    Mothkur Election Results 2026: బోణి కొట్టిన కాంగ్రెస్

    యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీలో 1వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి పల్లెర్ల వెంకన్న గుప్తా గెలుపు.

  • 13 Feb 2026 10:00 AM (IST)

    Nadikonda Election Results 2026: బోణి కొట్టిన కాంగ్రెస్

    నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో బోణి కొట్టిన కాంగ్రెస్ పార్టీ 9వ వార్డు ఆర్కే విజయం

    1,2,3,4,5,6,7,10, 11,12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ ముందంజ.

  • 13 Feb 2026 09:57 AM (IST)

    Mulugu Election Results 2026: కాంగ్రెస్‌ దూకుడు

    — ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ దూకుడు

    — ములుగులో 5 వార్డుల్లో కాంగ్రెస్‌, 2 బీఆర్‌ఎస్‌ విజయం

    — 1వ వార్డులో 278 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఆలోత్‌ పద్మ గెలుపు

    — 3వ వార్డులో 212 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి వసంత విజయం

    — 4వ వార్డులో 367 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పావని గెలుపు

    — 6వ వార్డులో 6 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకళ విజయం

  • 13 Feb 2026 09:56 AM (IST)

    Husnabad Election Results 2026: కాంగ్రెస్‌ జోరు

    — హుస్నాబాద్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ జోరు

    — ఐదు వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయం

    — 4, 5, 6, 7 వార్డుల్లో కాంగ్రెస్‌ ఘనవిజయం

    — 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తిరుపతి విజయం

    — 5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొలిశెట్టి రాజు గెలుపు

    — 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ నాయక్ విజయం

    — 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి చిత్తారి పద్మారవీందర్ గెలుపు

  • 13 Feb 2026 09:52 AM (IST)

    Jagtial Election Results 2026: కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

    జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సంగి ఆనంద్ విజయం.

  • 13 Feb 2026 09:51 AM (IST)

    Ibrahimpatnam Election Results 2026: కాంగ్రెస్ రెబెల్ విజయం

    — రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫలితాలు వేగంగా వస్తున్నాయి

    — కాంగ్రెస్, BRS మధ్య పోటాపోటీ నెలకొంది

    — రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అమీన బేగం విజయం.

    — మూడో వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపు

    — మూడో వార్డులో దాసరి మురళీ కృష్ణ విజయం సాధించారు

    — వాస్తవానికి ఇతను కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు

    — అయితే టికెట్ దక్కకపోవడంతో రెబల్ అభ్యర్థిగా పోటీలోకి దిగారు

    — ఇప్పటి వరకు అక్కడ ప్రకటించిన ఫలితాల్లో BRS ముందంజలో కనిపిస్తోంది

    — 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి దారు రాఘవేందర్ రావు విజయం సాధించారు

    — 11, 12 వార్డులు BRS సొంతమయ్యాయి

    — 11వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొండ్రు శ్రీలత విజయం

    — 12 వార్డు BRS అభ్యర్థి కొండ్రు త్రిలోక్ గెలుపు

    — మూడో వార్డులో కాంగ్రెస్‌ రెబల్ అభ్యర్థి గెలుపు

    — స్వతంత్రంగా పోటీకి దిగి దాసరి మురళీ కృష్ణ విజయం

    — 7వ వార్డులో రీకౌంటింగ్ కొనసాగుతుంది

    — ముందు లెక్కింపులో BRSకి 494, 491 కాంగ్రెస్‌కు ఓట్లు

    — దీంతో మరోసారి రీకౌంటింగ్

    — సీతారంపేటకు సంబంధించిన వార్డులో రీకౌంటింగ్ జరగుతోంది

    — పోలింగ్‌కు ముందు రోజు ఇక్కడ గొడవ జరిగింది

  • 13 Feb 2026 09:49 AM (IST)

    Suryapet Election Results 2026: ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు

    — మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు

    — ఎన్నికల సందర్భంగా తమ ఆవేదన తెలిపిన సూర్యాపేట రైతులు

    — సూర్యాపేట పాత జాతీయ రహదారి బాధితులకు నష్టపరిహారం అందించాలి

    — పేపర్‌పై రాసి బ్యాలెట్ బాక్స్‌లో వేసిన 48వ వార్డు ఓటర్లు

  • 13 Feb 2026 09:48 AM (IST)

    Ibrahimpatnam Election Results 2026: తొలి ఫలితం వెల్లడి

    — ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో తొలి ఫలితం

    — 12వార్డు BRS అభ్యర్థి కొండ్రు త్రిలోక్ విజయం

    — వంద ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం

    — 11వ వార్డులోనూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం

  • 13 Feb 2026 09:47 AM (IST)

    Manchirial Election Results 2026: కౌంటింగ్ హాల్‌లో గందరగోళం

    — మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ కౌంటింగ్ హాల్‌లో గందరగోళం

    — మూడో వార్డుకు చెందిన బ్యాలెట్ బాక్సుకు లేని క్లాత్ ప్యాకింగ్

    — కౌంటింగ్ ఆపాలని BJP, BRS అభ్యర్థుల ఆందోళన

  • 13 Feb 2026 09:45 AM (IST)

    పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ముందంజ

    – మధిర, నాగర్‌కర్నూలు, సంగారెడ్డి, ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్‌ లీడ్‌

    – లక్షెట్టిపేట, మంచిర్యాల, చెన్నూర్‌, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్‌ ఆధిక్యం

    – ఆదిలాబాద్‌, నిర్మల్, ఖానాపూర్‌ పోస్టల్‌ ఓట్లలో BJP లీడ్‌

    – సంగారెడ్డి మున్సిపాలిటీలో 2 చోట్ల BRSకి పోస్టల్‌ ఓట్లలో ఆధిక్యం

    – సంగారెడ్డి మున్సిపాలిటీలో ఒక వార్డులో MIM లీడ్‌

    – ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ లీడింగ్‌

    – మంచిర్యాలల జిల్లా కేతనపల్లిలో కాంగ్రెస్‌ లీడింగ్‌

    – కొమురంభీం జిల్లా: కాగజ్‌నగర్ పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ ముందంజ

    – ఐజ మున్సిపాలిటీ పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ముందంజ

    – గద్వాల్‌లో కాంగ్రెస్‌-BJPకి పోటాపోటీగా బ్యాలెట్‌ ఓట్లు

    – వైరా మున్సిపాలిటీలో పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ అధిక్యం

  • 13 Feb 2026 09:44 AM (IST)

    Khagaznagar Election Results 2026: బోణి కొట్టిన బీజేపీ

    కొమురం భీం జిల్లా: కాగజ్ నగర్ వార్డ్ నెంబర్ 21 బీజేపీ అభ్యర్థి దూసారీ కృష్ణ వేణి విజయం.

    కాంగ్రెస్ అభ్యర్థి జక్కు సంధ్య పై 370 ఓట్లతో బీజేపీ గెలుపు

  • 13 Feb 2026 09:41 AM (IST)

    Halia Election Results 2026:చింతల చంద్ర రెడ్డి ఘనవిజయం

    నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీలో ఏడో వార్డు అభ్యర్థి చింతల చంద్ర రెడ్డి ఘనవిజయం.

    నందికొండ మున్సిపాలిటీ 9 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఇర్ల రామకృష్ణ 163 ఓట్ల తో గెలుపు.

  • 13 Feb 2026 09:41 AM (IST)

    Yadagiri Gutta Election Results 2026: బీజేపీ అభ్యర్థి విజయం

    యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం

  • 13 Feb 2026 09:34 AM (IST)

    Kollapur Election Results 2026: కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

    నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ 14 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరసింహరావు 150 ఓట్ల మెజారిటీ తో విజయం.

  • 13 Feb 2026 09:33 AM (IST)

    Mulugu Election Results 2026: తొలి ఫలితం వెల్లడి

    ములుగు మున్సిపాలిటీలో తొలి ఫలితం వెల్లడి

    1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మ 278 ఓట్ల మెజారిటీతో విజయం..

  • 13 Feb 2026 09:32 AM (IST)

    Ramayampet Election Results 2026: BRS అభ్యర్థి గెలుపు

    మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో 10 వార్డులో BRS అభ్యర్థి మద్దెల మాధవి 39 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

  • 13 Feb 2026 09:31 AM (IST)

    Indradesam Election Results 2026: కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

    సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో 15 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సరిత భుజంగ రెడ్డి గెలుపు

  • 13 Feb 2026 09:24 AM (IST)

    CM Revanth Reddy: మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంపై సీఎం రేవంత్‌ ధీమా

    — మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ తిరిగిరానున్న సీఎం రేవంత్‌

    — మధ్యాహ్నం 2:40 కల్లా హైదరాబాద్‌ చేరుకోనున్న రేవంత్‌రెడ్డి

    — హైదరాబాద్‌ రాగానే మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై మానిటరింగ్‌

    — ప్రస్తుతం ఢిల్లీ నుంచే మున్సిపల్‌ ఫలితాలపై మానిటరింగ్‌ చేస్తోన్న రేవంత్‌

    — మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంపై సీఎం రేవంత్‌ ధీమా

    — మున్సిపోల్స్‌లో కాంగ్రెస్‌దే విజయమని ఇప్పటికే అధిష్ఠానానికి రేవంత్‌ రిపోర్ట్‌

    — నిన్న రాహుల్‌, కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై రిపోర్ట్‌ ఇచ్చిన రేవంత్‌

  • 13 Feb 2026 08:58 AM (IST)

    పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ముందంజ

    – మధిర, నాగర్‌కర్నూలు, సంగారెడ్డి, ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్‌ లీడ్‌

    – లక్షెట్టిపేట, మంచిర్యాల, చెన్నూర్‌, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్‌ ఆధిక్యం

    – ఆదిలాబాద్‌, నిర్మల్, ఖానాపూర్‌ పోస్టల్‌ ఓట్లలో BJP లీడ్‌

    – సంగారెడ్డి మున్సిపాలిటీలో 2 చోట్ల BRSకి పోస్టల్‌ ఓట్లలో ఆధిక్యం

    – సంగారెడ్డి మున్సిపాలిటీలో ఒక వార్డులో MIM లీడ్‌

    – ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ లీడింగ్‌

  • 13 Feb 2026 08:53 AM (IST)

    Adilabad Election Results 2026: బీజేపీ ముందంజ

    ఆదిలాబాద్ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ముందంజ

    నిర్మల్ జిల్లా: నిర్మల్, ఖానాపూర్ లో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపి ముందంజ

    మంచిర్యాల జిల్లా: లక్షేట్టిపేట, మంచిర్యాల, చెన్నూర్ లలో పోస్టల్ బ్యాలెట్ లలో కాంగ్రెస్ ముందంజ

    కొమురంభీం జిల్లా: కాగజ్ నగర్ లో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ముందంజ

    మంచిర్యాల జిల్లా: లక్షేట్టిపేట లో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజ

  • 13 Feb 2026 08:52 AM (IST)

    Edulapuram Election Results 2026: కాంగ్రెస్ ఆధిక్యం

    ఖమ్మం జిల్లా ఏదులా పురం మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ఆధిక్యం

  • 13 Feb 2026 08:51 AM (IST)

    Nagar Kurnool Election Results 2026: కాంగ్రెస్ లీడ్

    — నాగర్ కర్నూల్‌లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి

    — పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యం

    — కాంగ్రెస్‌కు 17, బీఆర్‌ఎస్‌కు 06 పోస్టల్ ఓట్లు

    — బీజేపీకి 04, ఇండిపెండెంట్ 02 పోస్టల్ ఓట్లు

  • 13 Feb 2026 08:50 AM (IST)

    Sangareddy Election Results 2026: కాంగ్రెస్ ఆధిక్యం

    — సంగారెడ్డి మున్సిపాలిటీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలు

    — మొత్తం 38 వార్డుల్లో 10 వార్డుల్లో కాంగ్రెస్ ఆధిక్యం

    — 2 వార్డుల్లో BRS ఆధిక్యం

    — వార్డు నెంబర్‌ 2, 3, 4, 6, 7, 23, 26, 35, 36, 37, 38లో కాంగ్రెస్ లీడ్

    — 1, 25 వార్డుల్లో BRS లీడ్

    — 24వ వార్డులో MIM లీడ్

  • 13 Feb 2026 08:48 AM (IST)

    Makthal Election Results 2026: 43 మంది పోస్టల్‌ ఓట్లు నమోదు

    – మక్తల్ మున్సిపాలిటీలో 43 మంది పోస్టల్‌ ఓట్లు నమోదు చేసుకున్నారు.

    – ఐతే.. వీటిల్లో 39 పోస్టల్‌ పోల్ అయ్యాయి.

    – ఈ ఓట్లలో ఎవరికి ఆధిక్యం వచ్చింది అది కాసేపట్లో తేలబోతోంది.

  • 13 Feb 2026 08:47 AM (IST)

    Mancherial Election Results 2026: అభ్యర్థి మృతి

    – మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో అభ్యర్థి మృతి

    – 10 వార్డ్ బీజేపీ అభ్యర్థి బత్తిని ఎల్లమ్మ అనారోగ్యంతో ఉదయం మృతి

  • 13 Feb 2026 08:45 AM (IST)

    Madhira Election Results 2026: కాంగ్రెస్‌కి ఆధిక్యం

    – మధిర మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు

    – పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్‌కి ఆధిక్యం

  • 13 Feb 2026 08:40 AM (IST)

    కాంగ్రెస్‌ విజయంపై సీఎం రేవంత్‌ ధీమా

    — మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంపై సీఎం రేవంత్‌ ధీమా

    — ఢిల్లీ నుంచే మున్సిపల్‌ ఫలితాలపై మానిటరింగ్‌ చేస్తోన్న రేవంత్‌

    — ఢిల్లీలోనే ఎప్పటికప్పుడు ఫలితాలను సమీక్షిస్తున్న రేవంత్‌ రెడ్డి

    — మున్సిపోల్స్‌లో కాంగ్రెస్‌దే విజయమని ఇప్పటికే అధిష్ఠానానికి రేవంత్‌ రిపోర్ట్‌

    — నిన్న రాహుల్‌, కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై రిపోర్ట్‌ ఇచ్చిన రేవంత్‌

    — మూడోరోజూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు సీఎం రేవంత్‌రెడ్డి

    — నిన్న ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌ చేసిన రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు

    — రాబోయే పదిన్నరేళ్లు సీఎం కుర్చీ తనదే అన్నారు రేవంత్‌.. తనను టచ్‌ చేసేవారే లేరన్నారు

    — తెలంగాణకు నేనే రాజు..నేనే మంత్రి అంటూ సినీ స్టైలులో కామెంట్స్‌ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

  • 13 Feb 2026 08:38 AM (IST)

    Municipal Election Result: 14 వార్డులు ఏకగ్రీవం

    — తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్‌లకు పోలింగ్

    — మొత్తం 2595 వార్డుల్లో 14 ఏకగ్రీవం

    — 12 కాంగ్రెస్ సొంతం, 2 BRS వశం

    — కాంగ్రెస్ సొంతమైన వాటిలో 7 ఉమ్మడి నల్గొండ జిల్లావే

    — రామగుండం, మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లలో రెండు డివిజన్‌లు ఏకగ్రీవం కాగా.. అవి రెండు కాంగ్రెస్ సొంత మయ్యాయి.

  • 13 Feb 2026 08:36 AM (IST)

    స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్

    — కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌‌ ఓట్ల లెక్కింపులో గందరగోళం

    — స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి పోగొట్టిన అధికారులు

    — గడ్డ పారతో తాళాన్ని పగలగొట్టిన అధికారులు

  • 13 Feb 2026 08:35 AM (IST)

    కాకరేపుతోన్న క్యాంప్‌ పాలిటిక్స్‌

    — మహబూబాబాద్‌ జిల్లాలో కాకరేపుతోన్న క్యాంప్‌ పాలిటిక్స్‌

    — ఫలితాలు రాకముందే అన్ని పార్టీలూ అలర్ట్‌

    — తమ అభ్యర్థులు చేజారకుండా క్యాంపు రాజకీయం

    — నిన్న రాత్రే అభ్యర్థులను క్యాంప్‌నకు తరలించిన కాంగ్రెస్‌

    — అభ్యర్థులతోపాటు వెళ్లిన ఎమ్మెల్యే మురళీనాయక్‌, డీసీసీ అధ్యక్షురాలు ఉమ

    — ప్రత్యేక బస్సులో క్యాంపునకు తరలివెళ్లిన కాంగ్రెస్‌ అభ్యర్థులు

    — కాంగ్రెస్‌ క్యాంప్‌ రాజకీయంతో హీటెక్కిన రాజకీయాలు

  • 13 Feb 2026 08:29 AM (IST)

    Medak Election Results 2026: 402 వార్డుల్లో కౌంటింగ్

    ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 403 వార్డులకు గాను మెదక్ మున్సిపాలిటీలో 32వ వార్డు ఏకగ్రీవమైంది. మిగతా 402 వార్డుల్లో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.

  • 13 Feb 2026 08:29 AM (IST)

    Mahabubnagar Election Results 2026: కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర BNS 163 సెక్షన్‌ అమలు

    ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక కార్పొరేషన్‌, 18 మున్సిపాలిటీలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లోని 60 డివిజన్లలో ఒకటి ఏకగ్రీవం కాగా.. మిగిలిన 59 డివిజన్ల ఓట్ల లెక్కింపు కోసం 30 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర BNS 163 సెక్షన్‌ అమలులో ఉంది. కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ విజయేంద్ర పరిశీలించారు. పాలమూరు యూనివర్శిటీలో కౌంటింగ్ సెంటర్‌ను తనిఖీ చేశారు. భూత్పూర్‌, దేవరకద్ర మున్పిపాలిటీల్లో ఒక రౌండ్, మహబూబ్ నగర్‌లో రెండు రౌండ్లలో ఫలితం వెల్లడవుతుందని కలెక్టర్ తెలిపారు.

  • 13 Feb 2026 08:28 AM (IST)

    Adilabad Election Results 2026: లెక్కింపు షురూ

    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ సహా 8 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మంచిర్యాల కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ముల్కల్లలోని ఐజా ఇంజనీరింగ్ కాలేజీలో చేపడుతున్నారు. 60 వార్డులకు 60 టేబుల్స్ ఏర్పాటు చేసి లెక్కిస్తున్నారు.

  • 13 Feb 2026 08:27 AM (IST)

    Nizamabad Election Results 2026: కౌంటింగ్ షురూ..

    ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఒక కార్పొరేషన్‌, 7 మున్సిపాలిటీలకు కౌంటింగ్ స్టార్ట్ అయింది. 8 మున్సిపల్‌ కేంద్రాల్లో వేర్వేరుగా కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ పాలిటెక్నికల్‌ కాలేజీలో కార్పొరేషన్‌ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఒక్కో డివిజన్‌కు ఒక్కో టేబుల్‌ చొప్పున మొత్తం 60 డివిజన్లకు 60 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు.

  • 13 Feb 2026 08:26 AM (IST)

    Karimnagar Election Results 2026: సాయంత్రానికి పూర్తి ఫలితాలు

    ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు కౌంటింగ్ జరుగుతుంది. SRR కాలేజీలో కరీంనగర్‌ కార్పొరేషన్‌ సంబంధించి ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ప్రతి రౌండ్‌లో ఒక్కో టేబుల్‌పై వెయ్యి ఓట్లు లెక్కించనున్నారు సిబ్బంది. సాయంత్రానికి పూర్తి ఫలితాలు తేలనున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎన్నికల కౌంటింగ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమైంది. కౌంటింగ్ సెంటర్‌లోకి అభ్యర్థితో పాటు, కౌంటింగ్ ఏజెంట్ ఒక్కరినే అనుమతించారు అధికారులు. 15 వార్డులకు గాను 15 టేబుల్స్ ఏర్పాటు చేశారు.

  • 13 Feb 2026 08:26 AM (IST)

    Nalgonda Election Results 2026: తేలనున్న 396 మంది భవితవ్యం

    ఉమ్మడి నల్గొండ జిల్లాలో కార్పొరేషన్ సహా 17 మున్సిపాలిటీలకు కౌంటింగ్ జరుగుతుంది. ఐదు కేంద్రాల్లో కౌంటింగ్‌ కోసం ఏర్పాట్లు చేశారు. కార్పొరేషన్‌కి సంబంధించి 48 డివిజన్ల కోసం 221 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇక మున్సిపాలిటీల్లో 304 వార్డుల్లో 1396 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

  • 13 Feb 2026 08:25 AM (IST)

    భారీ భద్రత నడుమ మొదలైన లెక్కింపు

    తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కార్పొరేషన్ సహా 7 మున్సిపాలిటీలకు కౌంటింగ్ జరుగుతుంది. అన్ని మున్సిపాలిటీల్లో 2 రౌండ్స్‌లో ఫలితం తేలనుంది. కౌంటింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ హాల్‌లోకి అభ్యర్థులు, పాసులు ఉన్న ఏజెంట్స్‌కే అనుమతి ఇచ్చారు పోలీసులు.

  • 13 Feb 2026 08:23 AM (IST)

    ఓట్ల లెక్కింపునకు అంతరాయం

    — సంగారెడ్డిలో ఓట్ల లెక్కింపునకు అంతరాయం

    — తారా డిగ్రీ కాలేజీలో కౌంటింగ్‌కి ఏర్పాట్లు

    — రూమ్ నెంబర్ 6లో నిలిచిన విద్యుత్

    — ఇంకా ప్రారంభం కాని పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

  • 13 Feb 2026 07:25 AM (IST)

    త్రిముఖ పోరులో విజయం ఎవరిదో..?

    మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలని మూడు ప్రధాన పార్టీలు గట్టిగానే పని చేశాయి. చాలా చోట్ల బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాయి. ముఖ్యనేతలు పలు చోట్ల ఇంఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులంతా దాదాపు ప్రతి ఒక్క ఓటరుతో టచ్‌లోకి వెళ్లారు. ఈ కారణంగానే గతంతో పోలిస్తే ఈసారి మరింత ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైనట్టు స్పష్టమవుతోంది.

  • 13 Feb 2026 07:24 AM (IST)

    ఎవరి ధీమా వారిదే..!

    పెరిగిన పోలింగ్ శాతం తమకే కలిసొస్తుందని ప్రధాన పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఇక్కడ కూడా తామే అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ ఎక్కువ శాతం తామే విజయం సాధిస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు తాము అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు వస్తాయని బీజేపీ, బీఆర్ఎస్ కూడా భావిస్తున్నాయి. అయితే చాలా చోట్ల అన్ని పార్టీల అభ్యర్థులు, పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు పోల్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్ చేయడంతో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. దీంతో ఓట్ల లెక్కింపుపై పార్టీలతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

  • 13 Feb 2026 07:22 AM (IST)

    తొలి ఫలితం అలంపూర్..!

    అత్యథికంగా చౌటుప్పల్‌లో 91.91 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా 59.68 శాతం నందికొండ మున్సిపాలిటీలో నమోదైంది. ఇక కార్పొరేషన్లలో నల్గొండలో అత్యధిక పోలింగ్ నమోదైంది. నిజామాబాద్‌లో అత్యల్పంగా పోలింగ్ రికార్డ్ అయ్యింది. ఉదయం 11 గంటల లోపే ఫలితం వస్తుంది. అత్యల్పంగా అలంపూర్‌లో 7,104 ఓట్లు పడ్డాయి. అలంపూర్‌ ఫలితం మొదటగా మొదటి రౌండ్‌లోనే రానుంది. అక్కడ పది వార్డులు ఉండగా పది టేబుళ్లు ఏర్పాటు చేశారు.

  • 13 Feb 2026 07:21 AM (IST)

    పెరిగిన పోలింగ్ శాతం..కౌంటింగ్‌పై ఆసక్తి

    ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం కూడా కౌంటింగ్‌పై ఆసక్తి పెరగింది. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తంగా 70.26 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఇప్పుడు 73.01 శాతం ఓటింగ్ నమోదైంది. ఏడు కార్పొరేషన్లలో 66.05 శాతం పోలింగ్ నమోదైంది. 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం పోలింగ్ రికార్డ్ అయ్యింది.

  • 13 Feb 2026 07:20 AM (IST)

    విజయోత్సవ ర్యాలీలపై ఆంక్షలు

    విజయోత్సవ ర్యాలీలకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కొన్ని ఆంక్షలు విధించారు. ఉద్రిక్తతలకు తావు లేకుండా కౌంటింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల వరకు ఎవరినీ అనుమతించబోమని తెలిపారు. సాయంత్రానికి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.

  • 13 Feb 2026 07:20 AM (IST)

    మధ్యాహ్నం 12 గంటల కల్లా తొలి రౌండ్ ఫలితాలు!

    ఒక్కో వార్డులో సుమారు 800 నుంచి 1000 ఓట్లు ఉండటంతో, మధ్యాహ్నం 12 గంటల కల్లా తొలి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం CCTV కెమెరాల నిఘాలో ఉంటుంది.

  • 13 Feb 2026 07:19 AM (IST)

    మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు

    ఓట్ల లెక్కింపు కోసం 20 వేల మంది సిబ్బందిని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. వీరికి ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల లెక్కింపుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపులో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్లను లెక్కిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర అభ్యర్థుల తరపున ఒక కౌంటింగ్ ఏజెంట్‌ను అనుమతిస్తారు.

  • 13 Feb 2026 07:19 AM (IST)

    ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు

    తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

  • 13 Feb 2026 07:15 AM (IST)

    కరీంనగర్ ఫలితాలపై కొనసాగుతోన్న ఉత్కంఠ

    — ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలు

    — మరో గంటలో ప్రారంభంకానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ

    — SRR కాలేజీలో కరీంనగర్‌ కార్పొరేషన్‌ 66 డివిజన్స్‌ ఓట్ల లెక్కింపు

    — కరీంనగర్‌ 66 డివిజన్స్‌ ఓట్ల లెక్కింపునకు 66 టేబుల్స్‌ ఏర్పాటు

    — రెండు డివిజన్లకు ఒక పర్యవేక్షకుడు చొప్పున నియామకం

    — ప్రతి రౌండ్‌లో ఒక్కో టేబుల్‌పై వెయ్యి ఓట్లు లెక్కించనున్న సిబ్బంది

    — మూడు నాలుగు రౌండ్లలో పూర్తికానున్న ఒక్కో డివిజన్‌ ఓట్ల లెక్కింపు

    — మధ్యాహ్నం 12గంటల వరకు బ్యాలెట్స్‌ను కట్టలు కట్టనున్న సిబ్బంది

    — సాయంత్రానికి తేలనున్న పూర్తి ఫలితాలు

    — ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల ఫలితాలపై కొనసాగుతోన్న ఉత్కంఠ

  • 13 Feb 2026 07:14 AM (IST)

    ఇందూరు పీఠం ఎవరిది..?

    — ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఒక కార్పొరేషన్‌, 7 మున్సిపాలిటీలు

    — 8 మున్సిపల్‌ కేంద్రాల్లో వేర్వేరుగా కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు

    — నిజామాబాద్‌ పాలిటెక్నికల్‌ కాలేజీలో కార్పొరేషన్‌ ఓట్ల లెక్కింపు

    — ఒక్కో డివిజన్‌కు ఒక్కో టేబుల్‌.. మొత్తం 60 డివిజన్లకు 60 టేబుల్స్‌ ఏర్పాటు

    — ఒక్కో రౌండ్‌లో వెయ్యి ఓట్లు చొప్పున లెక్కింపు

    — ఒక్కో కట్టలో 25 ఓట్లు.. ఒకేసారి 40 కట్టలు లెక్కించనున్న సిబ్బంది

  • 13 Feb 2026 07:00 AM (IST)

    మెజారిటీ స్థానాలు బీజేపీ కైవసంః బండి

    కరీంనగర్ కార్పొరేషన్ ఫలితాల్లో మెజారిటీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకోబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. యావత్ దేశమంతా కరీంనగర్ ఫలితాలవైపు చూస్తోందన్నారు. బీజేపీకి అనుకూల ఫలితాలు రాబోతున్నాయని, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించబోతున్నామని ఆయన చెప్పారు.

  • 13 Feb 2026 06:58 AM (IST)

    పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతిః డీజీపీ

    రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 123 కౌంటింగ్ స్టేషన్లను సిద్ధం చేశామని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనల జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డిజిపి పేర్కొన్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ కోసం 12 వేల మంది పోలీసు బలగాలతో పాటు సాయుధ బలగాలు , క్విక్ రెస్పాన్స్ టీమ్స్ నిరంతరం పహారా కాస్తాయి. అదనపు భద్రత కోసం ప్రతి కౌంటింగ్ కేంద్రాన్ని సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉంచామని తెలిపారు. వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను తన కార్యాలయ కమాండ్ కంట్రోల్ నుండి పర్యవేక్షిస్తామని వివరించారు. లెక్కింపు కేంద్రాలకు వచ్చే మార్గాలను కఠినంగా నియంత్రిస్తున్నామని, పాస్‌లు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు.

  • 13 Feb 2026 06:52 AM (IST)

    ముందస్తు జాగ్రత్తలు..!

    మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల ఈ రకమైన గొడవలు తలెత్తడంతో పోలీసులు, ఈసీ అలర్ట్ అయ్యింది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటోంది.

  • 13 Feb 2026 06:50 AM (IST)

    తెలంగాణలో ఇవాళే బిగ్ డే

    — కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది

    — 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల కౌంటింగ్ జరగనుంది

    — ఆయా స్థానాల్లో ఈ నెల 11న పోలింగ్ నిర్వహించారు

    — మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు

    — 136 కేంద్రాలలో లెక్కింపు కోసం ఏర్పాట్లు చేశారు

    — కౌంటింగ్‌ విధుల్లో 20 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు

    — కౌంటింగ్‌లో పారదర్శకత కోసం CCTV ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు

    — ఫస్ట్ రెండు గంటల్లో మొదటి ఫలితం రాబోతుంది

Published On - Feb 13,2026 6:45 AM

Follow Us