AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగస్ట్ 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏ దేశాల్లో చూడొచ్చంటే!

ఆగస్ట్ 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏ దేశాల్లో చూడొచ్చంటే!

Phani CH
| Edited By: |

Updated on: Aug 11, 2026 | 6:54 PM

Share

2026 ఆగస్టు 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్, పోర్చుగల్ తదితర ప్రాంతాల్లో ఈ ఖగోళ అద్భుతం కనిపించనుండగా, భారతదేశంలో మాత్రం రాత్రి సమయం కావడంతో వీక్షించలేరు. అందువల్ల దేశంలో సూతక్ కాలం లేదా ప్రత్యేక ఆచారాలు పాటించాల్సిన అవసరం లేదని నిపుణులు తెలిపారు. ఖగోళ శాస్త్రవేత్తలు ఈ ఘటనను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2026 ఆగస్టు 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఖగోళ అద్భుతం భారతదేశంలో మాత్రం కనిపించదు. మన దేశంలో ఆ సమయానికి రాత్రి వేళ కావడమే ఇందుకు ప్రధాన కారణం. సూర్యుడికి, భూమికి మధ్యలోకి చంద్రుడు వచ్చి సూర్యకాంతిని పూర్తిగా కప్పివేసినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో పగటిపూటే ఆకాశం చీకటిమయమై, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఆ సమయంలో నక్షత్రాలు, గ్రహాలు కూడా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. నాసా శాస్త్రవేత్తల కథనం ప్రకారం, సూర్యుడు చంద్రుడి కంటే 400 రెట్లు పెద్దదైనప్పటికీ, అదే స్థాయిలో దూరంగా ఉండటం వల్ల ఆకాశంలో చంద్రుడు, సూర్యుడు దాదాపు ఒకే పరిమాణంలో కనిపిస్తాయి. ఈ సంపూర్ణ సూర్య గ్రహణం గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఉత్తర రష్యా, అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాల్లో సంపూర్ణంగా కనిపించనుంది. ఉత్తర అమెరికా, యూరప్‌లలో పాక్షికంగా వీక్షించవచ్చు. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 12 రాత్రి 9:45 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 13 తెల్లవారుజామున 2:15 గంటల వరకు ఈ గ్రహణం కొనసాగుతుంది. రాత్రి సమయం కావడం వల్ల మన దేశంలో గ్రహణం కనిపించదు. కాబట్టి భారత్‌లో ఎలాంటి సూతక్ కాలం లేదా సాంప్రదాయ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని పండితులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vande Bharat Cargo: గంటకు 145 కి.మీ వేగంతో దూసుకెళ్లిన ‘వందే భారత్ కార్గో’

హిందూ మహాసముద్రంలో తేలుతున్న స్పేస్‌ఎక్స్‌.. స్టార్‌షిప్‌

పెట్రోల్ బాదుడు.. సెంచరీ కొట్టిన ఈవీ సేల్స్!

వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!

రైలు ఇంజిన్‌ చెక్‌ చేస్తున్న పైలట్‌.. అక్కడ మనిషి తలను చూసి గుండె గుభేల్‌

Published on: Jul 31, 2026 04:24 PM
Follow Us