అమ్మ బాబోయ్.. మళ్లీ వచ్చేసిన చెడ్డీ గ్యాంగ్ వీడియో
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ మళ్ళీ దోపిడీలకు పాల్పడుతోంది. దసరా సెలవుల సమయంలో ఊళ్ళకు వెళ్ళిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, రాత్రివేళ చోరీలు చేస్తున్నారు. పోలీసులు అలర్ట్‌గా ఉన్నప్పటికీ, గ్యాంగ్ సభ్యులు తప్పించుకుంటున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- TV9 Telugu
- Updated on: Sep 24, 2025
- 3:00 pm
TV9 Special Story : ఆ ఊరి కండ్లకు మరణం లేదు వీడియో
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ఓదల మండలం అబ్బిడిపల్లి గ్రామం 100% నేత్రదానం చేయడానికి తీర్మానం చేసుకున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 700 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది.
- TV9 Telugu
- Updated on: Sep 24, 2025
- 2:59 pm
ముంబైలో ప్రధాని మోదీ మార్ఫింగ్ ఫోటో వివాదం వీడియో
ముంబైలో 73 ఏళ్ల కాంగ్రెస్ నేత ప్రకాష్ పగారే ప్రధాని మోడీ మార్ఫింగ్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై బిజెపి కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. బిజెపి నేతలు ఆయనకు చీర కట్టారు. ఈ ఘటన కాంగ్రెస్, బిజెపి మధ్య వివాదానికి దారితీసింది. పగారే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- TV9 Telugu
- Updated on: Sep 24, 2025
- 1:21 pm
Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
అందమైన సాగరతీర నగరం విశాఖ.. కొందరు అక్రమార్కుల బారినపడి కొన్ని విషయాల్లో మసకబారిపోతోంది. అడపా దడపా డ్రగ్స్ రాకెట్లు, సీజన్‌కోసారి కిడ్నీ అమ్మకం దందాలు.. పోలీసుల్ని సైతం హైరానా పట్టిస్తున్నాయి. లేటెస్ట్‌గా ఒడిషా కేంద్రంగా ఒక కిడ్నీ రాకెట్ విశాఖ మీద కన్నేసినట్టు ఖాకీలకు వాసనొచ్చింది. ప్రాణం పోయాల్సిన డాక్టర్లే కిడ్నీ బ్రోకర్లుగా మారడం ఇక్కడ బాధాకరమైన కొసమెరుపు.
- TV9 Telugu
- Updated on: Jul 17, 2025
- 9:25 pm
Andhra Pradesh: మంచిరోజులు వచ్చేశాయి.. విశాఖ స్టీల్ ప్లాంట్ మరింత బలోపేతం..! కేంద్ర బృందంతో సీఎం సమీక్ష
విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతి కోసం అవసరమైన సాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు సీఎం చంద్రబాబు .విశాఖ స్టీల్ ప్లాంట్‌కు పూర్వ వైభవం వచ్చేలా కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. అవసరమైన సహకారాన్ని అందిస్తామని భరోసా ఇవ్వడం సహా విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం కోసం కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి..
- TV9 Telugu
- Updated on: Apr 1, 2025
- 7:39 am
మహా కుంభమేళా.. మౌని అమావాస్యలో భారీ జనసంద్రం.. ఈ లెక్కలు ఎలా తెలుస్తారంటే..
సనాతనధర్మం...కుంభమేళ పర్వం..మౌని అమవాస్యవేళ పుణ్యస్నానమాచరించడం అద్భుతం..అంటూ భక్తకోటి ప్రయాగ్‌రాజ్‌కు క్యూకట్టింది. ఇప్పటికే అక్కడ ఇసుకేస్తే రాలనంత జనం. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. బుధవారం మౌని అమవాస్య సందర్భంగా 10కోట్లమంది భక్తులు వస్తారని అంచనా. మరి అంతమంది భక్తులు ఒకేరోజు..ఒకే ప్రాంతంలో ఉండే వీలుందా...? ఇందుకు యూపీ సర్కార్ తీసుకున్న చర్యలేంటి...భద్రతాపరంగా చేసిన జాగ్రత్తలేంటి..? ఇంతకూ మౌని అమవాస్య విశిష్టత ఏంటి..ఆరోజు స్నానమాచరిస్తే కలిగే శుభాలేంటి..?
- TV9 Telugu
- Updated on: Jan 28, 2025
- 9:55 pm
Chiranjeevi: చిరంజీవికి ఎంతో ప్రాధాన్యత..! బీజేపీ పెద్దల మదిలో ఏముంది..?
ఎంత ఎత్తుకు వెళ్లినా.. మనం ఎదిగొచ్చిన మూలాల్ని మర్చిపోకూడదు.. కష్టకాలంలో మనల్ని ఆదుకుని.. గట్టుకు లాగిన చేతుల్ని వదిలిపెట్టొద్దు. ఆప్తా క్యాపిటలిస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో ఇటీవల చిరంజీవి చెప్పిన ఇన్‌స్పిరేషనల్ లైన్స్ ఇవి. అందుకే.. ప్రజారాజ్యం మూసివేత సమయంలో అభయం ఇచ్చిన హస్తం పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు మెగాస్టార్. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని వదులుకోలేదు. కానీ.. మరోవైపు నుంచి పిలుపొస్తే.. నువ్వే మాకు ఆపద్బాంధవుడివి అని కాళ్లావేళ్లా పడితే.. ఆ గోల్డెన్ ఛాన్స్‌ని చిరంజీవి వదులుకుంటారా..? అదేపనిగా తనవైపు కన్నుగీటుతున్న కమలం పార్టీపై చిరంజీవి ఆలోచనేంటి?
- TV9 Telugu
- Updated on: Jan 15, 2025
- 10:12 pm
Health Tips: చలికాలంలో ముఖంపై దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా?
చలికాలంలో చల్లటి వాతావరణం ఉండడం వల్ల అందరూ వెచ్చగా దుప్పటి కప్పుకుని పడుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి చాలా మంది తల నుంచి పాదాల వరకు బెడ్‌షీట్‌ను కప్పుకుని పడుకుంటారు. ఇది చలి నుంచి కాపాడినా కానీ ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బెడ్‌షీట్‌తో ముఖం కప్పుకుని నిద్రించడం ఎంత ప్రమాదమో తెలుసుకుందాం...
- TV9 Telugu
- Updated on: Jan 11, 2025
- 4:04 pm
Mohammed Shami IPL Auction 2025: మహమ్మద్ షమీ రూ.10 కోట్లకు దక్కించుకున్న సన్‌రైజర్స్‌కు..
Mohammed Shami IPL 2025 Auction Price: సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఐపీఎల్ 2025 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ.10 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున అద్భుతంగా రాణించిన షమీ, బౌలింగ్ విభాగంలో అనుభవంతో పాటు వికెట్ల తీసే సామర్థ్యాన్ని జోడించి, జట్టుకు కీలకంగా మారనున్నాడు. 120+ ఐపీఎల్ మ్యాచ్‌ల అనుభవం కలిగిన షమీ, పవర్ ప్లే, డెత్ ఓవర్లలో సత్తా చాటాడు.
- TV9 Telugu
- Updated on: Nov 24, 2024
- 5:02 pm
ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్ డేటా సెంటర్..ఆ సంస్థ సీఈవోతో మంత్రి నారా లోకేష్ చర్చలు
దిగ్గజ కంపెనీలతో మీటింగ్.. బడా పారిశ్రామికవేత్తలతో బైఠక్.. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటించారు మంత్రి నారా లోకేశ్. టాప్ గ్లోబల్ కంపెనీల ప్రతినిధులను కలిసి ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.
- TV9 Telugu
- Updated on: Oct 31, 2024
- 12:32 pm
Hyderabad: రూట్ మార్చిన హైడ్రా.. పడగొట్టుడే కాదు..! మరింత పటిష్టంగా రంగంలోకి..
హైడ్రా రూటు మార్చింది. ఇకపై కొత్త రూపంలో దర్శనం ఇవ్వబోతుంది. బిల్డింగ్స్ పడగొట్టుడే కాదు.. మరికొన్ని విషయాల్లోనూ తన మార్క్ చూపాలనుకుంటోంది. ఇంతకీ హైడ్రా ఏం చేయబోతుంది.. రంగనాథ్ ముందున్న లక్ష్యాలేంటి?
- TV9 Telugu
- Updated on: Oct 9, 2024
- 9:24 pm
Telangana Politics: ఆపరేషన్ మూసీపై మాటల మంటలు.. సీఎం వర్సెస్ ఈటల సవాళ్లు..!!
ప్రధాని మోదిని కలవడానికి తాము రెడీ అని సీఎం అంటే.. అంతకన్నా ముందు మూసీ నిర్వాసితుల దగ్గరకు వెళ్దాం రా అని సవాల్ విసిరారు ఈటల రాజేందర్. అక్కడ ప్రజలు రేవంత్ రెడ్డిని శెభాష్ అని మెచ్చుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. సెక్యూరిటీ లేకుండా రావాలని సవాల్ విసిరారు.
- TV9 Telugu
- Updated on: Oct 4, 2024
- 7:58 am