AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆమెతో ఉన్నప్పుడే నాన్న కూల్‌గా ఉంటాడు.. నరేష్ కొడుకు నవీన్ ఏమన్నాడంటే.?

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ నిర్మల విజయ్ ప్రేమ, పెళ్లిపై తన ఆలోచనలను పంచుకున్నారు. సరైన భాగస్వామి దొరకడం కష్టమని, బంధాన్ని నిరూపించుకోవడానికి జీవితకాలం పడుతుందని అభిప్రాయపడ్డారు. తన తండ్రి నరేష్, పవిత్ర లోకేష్‌ల అనుబంధంపై సానుకూలంగా స్పందిస్తూ, పవిత్ర అద్భుతమైన వ్యక్తి అని, తండ్రికి ఆమె సరైన జోడీ అని పేర్కొన్నారు.

Tollywood: ఆమెతో ఉన్నప్పుడే నాన్న కూల్‌గా ఉంటాడు.. నరేష్ కొడుకు నవీన్ ఏమన్నాడంటే.?
Naresh Son Naveen
Ravi Kiran
|

Updated on: Mar 04, 2026 | 1:35 PM

Share

నటుడు నవీన్ నిర్మల విజయ్.. ఇటీవల ప్రేమ, పెళ్లి, వ్యక్తిగత బంధాలపై తన అభిప్రాయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సరైన జీవిత భాగస్వామిని కనుగొనడం ఒక సవాలని, ఒక బంధం జీవితాంతం విజయవంతంగా కొనసాగిందని ఒకరు తమ “డెత్‌బెడ్‌పై” మాత్రమే నిర్ణయించగలరని ఆయన అన్నారు. 50, 60 ఏళ్ల వయస్సులో కూడా విడాకులు తీసుకున్న వారు ఉన్నారని, అందుకే చివరి వరకు వేచి చూడాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెళ్లి గురించి నిత్యం ఆలోచిస్తానని, అయితే “టైమింగ్” ఎప్పుడూ కుదరలేదని నవీన్ వెల్లడించారు. తన కుటుంబంలో నానమ్మ విజయ నిర్మల, తాత కృష్ణలతో సహా అనేక బలమైన బంధాలను చూస్తూ పెరిగానని, బయట ఏం చేసినా ఇంటి వాతావరణం “సేఫ్ స్పేస్”గా ఉండాలని నవీన్ కోరుకుంటారు.

ఇదిలా ఉంటే.. 20 నుంచి 30 ఏళ్ల వయస్సులో ఒక అమ్మాయి కోసం పదేళ్లపాటు వేచి చూశానని, ఆమె తనకంటే నాలుగేళ్లు పెద్దదని తెలిపారు. అయితే ఆమె తిరిగి రాకుండా మరొకరిని వివాహం చేసుకుందని చెప్పారు. ఈ సంఘటన తర్వాతే తన ఆలోచన మారిందన్నారు. చాలా మంది తన జీవిత కథను రామ్ చరణ్ నటించిన “ఆరెంజ్” సినిమాతో పోలుస్తారని, ఎందుకంటే తాను బంధాలు పని చేయకపోతే వాటిని తెంచుకోవడానికి వెనుకాడనని ఆయన అన్నారు. తన తండ్రి నరేష్ వ్యక్తిగత జీవితంపై స్పందిస్తూ.. పవిత్ర ఒక “ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్” అని, ఆమె అందరినీ పలకరిస్తూ, ఎప్పుడూ సంతోషంగా ఉండే వ్యక్తి అని నవీన్ ప్రశంసించారు. పవిత్ర తన తండ్రికి సరైన జోడీ అని, ఆమెతో ఉన్నప్పుడు నరేష్ ప్రశాంతంగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని, సరైన వ్యక్తిని కనుగొనడానికి ఎప్పుడూ ఆలస్యం కాదని నవీన్ పేర్కొన్నారు. నరేష్ తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా విజయ నిర్మల, కృష్ణ ఎప్పుడూ మద్దతు ఇచ్చారని, మనిషి జీవితంలో అన్నీ పరిపూర్ణంగా ఉండవని వారు అర్థం చేసుకున్నారని నవీన్ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి నరేష్ ఎప్పుడూ తన ఆనందాన్ని వెతుక్కుంటారని, పనిలో, వ్యక్తిగత జీవితంలో సంతృప్తిగా జీవిస్తారని అన్నారు.

నవీన్ తనను తన తండ్రి నరేష్‌తో పోల్చుకుంటూ, తాను నరేష్ కంటే ఎక్కువ భావోద్వేగపూరితమైన వ్యక్తిని అని అన్నారు. నరేష్ “టాస్క్‌మాస్టర్” అని, పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారని, అయితే తాను ఒకసారి ఒక పని మాత్రమే చేయగలనని, మల్టీ-టాస్కర్ కాదని నవీన్ తెలిపారు. తామిద్దరం “డైనమిక్‌గా భిన్నమైన వ్యక్తులం” అని, విభిన్నంగా పని చేస్తామని పేర్కొన్నారు.

ఇది చదవండి: నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ నటుడు

Follow Us