AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venu Thottempudi: ఆమె నాకు కూతురు లాంటిది.. ఆ యంగ్ హీరోయిన్‌తో నటించేందుకు నో చెప్పిన హీరో వేణు!

సినిమా ఇండస్ట్రీలో హీరో- హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ ఇప్పుడు పెద్ద విషయమేమీ కాదు. పాత్ర డిమాండ్ చేస్తే తమ కంటే చాలా తక్కువ వయసున్న హీరోయిన్లతో కూడా నటించేందుకు హీరోలు వెనకాడడం లేదు. ఇటీవల విడుదలైన ధురంధర్, ధురంధర్ 2 సినిమాలు ఇందుకు పెద్ద ఉదాహరణ.

Venu Thottempudi: ఆమె నాకు కూతురు లాంటిది.. ఆ యంగ్ హీరోయిన్‌తో నటించేందుకు నో చెప్పిన హీరో వేణు!
Venu Thottempudi
Basha Shek
|

Updated on: Apr 14, 2026 | 7:29 PM

Share

స్వయంవరం సినిమాతో హీరోగా కెరీర్ ఆరంభించాడు వేణు తొట్టెంపూడి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. తన నటనకు ప్రతీకగా నంది స్పెషల్ జ్యూరీ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత చిరునవ్వుతో అంటూ మరో డీసెంట్ హిట్ అందుకున్నాడీ హీరో. వీడెక్కడి మొగుడండి?, హనుమాన్ జంక్షన్, ప్రియనేస్తమా, మళ్లీమళ్లీ చూడాలి, కళ్యాణ రాముడు , పెళ్ళాం ఊరెళితే, పెళ్ళాంతో పనేంటి ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు ఫేవరెట్ హీరోగా మారిపోయాడు వేణు. ముఖ్యంగా ఆయన కామెడీకి ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే చాలా మంది హీరోల్లాగే వేణుకు కూడా ఒకానొక సమయంలో వరుసగా ఫ్లాపులు పడ్డాయి. దీంతో హీరోగా కెరీర్ అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఎన్టీఆర్ దమ్ము సినిమాలో సహాయక నటుడిగా చేశాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 2021లో రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక 2023లో అతిధి అనే హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో కనిపించారు వేణు. ఈ సిరీస్ కు ఓటీటీలో మంచి రెస్పాన్సే వచ్చింది. దీంతో వేణు మళ్లీ సినిమాల్లో బిజీ అవుతాడనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. ప్రస్తుతం మళ్లీ ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నారు వేణు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వేణు ఓయంగ్ హీరోయిన్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

వివరాల్లోకి వెళితే.. వేణు తొట్టెంపూడి హీరోగా ఒక సినిమాలో అనన్య శర్మను హీరోయిన్ గా తీసుకోవాలని చిత్ర బృందం భావించిందట. అయితే వేణు ఇందుకు అసలు ఒప్పుకోలేదట. ‘నా వయసు దాదాపు 50 సంవత్సరాలు. ఆ అమ్మాయి వయసు 22 సంవత్సరాలు. నేను ఆమెతో కలిసి రొమాంటిక్ సన్నివేశాలు ఎలా చేయగలను. ఆమె నాకు కూతురు లాంటిది’ అని దర్శక నిర్మాతలతో చెప్పేశారట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ వేణు కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

అనన్య శర్మ లేటెస్ట్ ఫొటోస్..

ఇక అనన్య శర్మ విషయానికి వస్తే.. చెన్నైలోని కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం మొదలు పెట్టింది. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె చాయ్ బిస్కెట్ , బాయ్స్ ఫార్ములా ఛానల్స్ లోని షార్ట్ ఫిలిమ్స్ తో బాగా పాపులర్ అయింది. ఇక 30 వెడ్స్ 21 అనే సిరీస్ తో చాలా మందికి ఫేవరెట్ గా మారిపోయింది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషలో విడుదలైన లాలీపాప్ అనే కవర్ సాంగ్ తో కూడా అలరించింది అనన్య. ఆ మధ్యన లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ సల్మాన్ చెల్లిలిగానూ యాక్ట్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us