AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? టాలీవుడ్ హ్యాండమ్స్ హీరో.. ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్

సాధారణంగా వయసై పోయిన హీరోలు, హీరోయిన్లలో చాలా మంది ఏదో ఒక వ్యాపారంలోకి అడుగు పెడతారు. అలా ఈ హీరో కూడా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. తన వ్యాపార దక్షతతో కోట్ల ఆస్తులు కూడ బెట్టారు.

Tollywood: ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? టాలీవుడ్ హ్యాండమ్స్ హీరో.. ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్
Tollywood Actor
Basha Shek
|

Updated on: Nov 10, 2026 | 8:56 PM

Share

పై ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా? ఇతను ఒక ఫేమస్ హీరో. ఒకప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. వరుసగా ప్రేమకథలు చేస్తూ యూత్ లో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు. తండ్రి స్టార్ నటుడు కావడంతో కేవలం 17 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడీ హీరో. వరుసగా ప్రేమకథా చిత్రాలు, రొమాంటిక్ సినిమాలతో యూత్ కు బాగా దగ్గరయ్యాడు. మరీ ముఖ్యంగా దర్శక దిగ్గజాలుగా పేరున్న మణిరత్నం, శంకర్ సినిమాల్లోనూ హీరోగా నటించి క్రేజీ హీరోగా మారిపోయాడు. అప్పట్లో ఈ హీరో జోరు చూసి చాలా మంది సినిమా ఇండస్ట్రీని ఏలుతాడని భావించారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఈ హీరోకు కూడా వరుసగా ఫ్లాపులు పడ్డాయి. చివరకు అవకాశాలు కరువయ్యాయి. దీనికి తోడు వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలు ఎదురయ్యాయి. భార్యతో విడాకులు తీసుకుని విడిపోయాడు. దీంతో చాలా రోజుల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయాడు. అయితే చాలా మంది మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ గానూ, సహాయక నటుడిగానూ ఆకట్టుకుంటున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ నటుడు బిజినెస్ లోనూ రాణిస్తున్నాడు. తన వ్యాపార దక్షతతో కోట్ల రూపాయలు కూడ బెడుతున్నాడు. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్ గా చెలామణి అవుతోన్న ఈ నటుడు మరెవరో కాదు జీన్స్ సినిమా హీరో ప్రశాంత్.

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అయిన త్యాగరాజన్ కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ప్రశాంత్. ప్రేమ శిఖరం, తొలిముద్దు సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. రొమాంటిక్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఎస్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ చిత్రంతో బాగా ఫేమస్ అయిపోయాడు ప్రశాంత్. దీని తర్వాత ప్రశాంత్ నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజయ్యాయి. అయితే వరుస ఫ్లాపులతో క్రమంగా ఫేడవుట్ అయిపోయాడు ప్రశాంత్. 2000 దశకంలో ప్రశాంత్ కథానాయకుడిగా చాలా సినిమాలు ప్రారంభమయ్యాయి కానీ వాటిలో చాలావరకు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో కొన్ని సినిమాల్లో విలన్ గానూ, సహాయక నటుడిగా ఆకట్టుకున్నారు ప్రశాంత్. అయితే అంధాదూన్ రీమేక్ తో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్. ఆ తర్వాత దళపతి విజయ్ హీరోగా నటించిన గోట్ లో ఓ కీలక పాత్ర పోషించాడు.

ఇవి కూడా చదవండి

ప్రశాంత్ గోల్డ్ టవర్స్..

సినిమాల సంగతి పక్కన పెడితే.. కొన్నేళ్ల క్రితం చెన్నైలోని పానగల్ పార్క్ లో ప్రశాంత్ రియాల్ గోల్డ్ టవర్ పేరుతో ఓ విశాలమైన జ్యూయెలరీ మాల్ ను కట్టించాడు ప్రశాంత్. దాదాపు 10 అంతస్తులతో సుమారు 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బిల్డింగ్ విస్తరించి ఉంది. ప్రస్తుతం దేశంలోని బ్రాండెడ్ నగలకు ప్రశాంత్ రియాల్ గోల్డ్ టవర్ నిలయంగా ఉంది. అంతేకాదు ఈ బిల్డింగ్ లో విశాలమైన ఫుడ్ కోర్ట్, ఏటీఎంలు, పార్కింగ్ సౌకర్యం కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ జ్యూయెలరీ మాల్ నిర్వహణలో ప్రశాంత్ సోదరి, నగల డిజైనర్ ప్రీతి త్యాగరాజన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.

సిమ్రాన్, స్నేహలతో ప్రశాంత్ డ్యాన్స్..

View this post on Instagram

A post shared by zeetamil (@zeetamizh)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఈ టాలీవుడ్ హీరో ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్
ఈ టాలీవుడ్ హీరో ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్
ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 52 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్..
ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 52 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్..
APPSC గ్రూప్ 2 పూర్తి నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే దరఖాస్తు
APPSC గ్రూప్ 2 పూర్తి నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే దరఖాస్తు
6 దశాబ్దాల ప్రస్థానం.. ప్రపంచానికి తెలియని కథ.. సోనియా గాంధీ..
6 దశాబ్దాల ప్రస్థానం.. ప్రపంచానికి తెలియని కథ.. సోనియా గాంధీ..
దృశ్యం మూవీని మించిన ట్విస్టులు.. ఓటీటీలో పిచ్చి ట్రెండింగ్..
దృశ్యం మూవీని మించిన ట్విస్టులు.. ఓటీటీలో పిచ్చి ట్రెండింగ్..
ఈ ఒక్క పని చేయకపోతే డబ్బులు కట్.. కేంద్రం అలర్ట్..
ఈ ఒక్క పని చేయకపోతే డబ్బులు కట్.. కేంద్రం అలర్ట్..
ముచ్చింతల్‌ విష్ణు సహస్రనామ పారాయణానికి గిన్నిస్ రికార్డ్
ముచ్చింతల్‌ విష్ణు సహస్రనామ పారాయణానికి గిన్నిస్ రికార్డ్
ఫంక్షన్లలో విందుకు ముందు కీరా, క్యారెట్ ఎందుకు పెడతారో తెలుసా?
ఫంక్షన్లలో విందుకు ముందు కీరా, క్యారెట్ ఎందుకు పెడతారో తెలుసా?
కార్తీక‌మాసంలో 30 రోజులు నాన్‌వెజ్ మానేస్తే శరీరంలో జరిగే మార్పు
కార్తీక‌మాసంలో 30 రోజులు నాన్‌వెజ్ మానేస్తే శరీరంలో జరిగే మార్పు
తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆర్యవీర్ సెహ్వాగ్
తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆర్యవీర్ సెహ్వాగ్