AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్పటికీ ఎప్పటికీ ఆహీరో అంటేనే ఇష్టం.. ఆయనతోనే ఎక్కువ సినిమాలు చేశా

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి రోజా.. అటు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన నటన, మాటతీరుతో ప్రేక్షకులకు దగ్గరైన ఆమె.. ఇప్పటికీ పలు టీవీ కార్యక్రమాల ద్వారా అభిమానులను అలరిస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా తన సినీ కెరీర్, వ్యక్తిగత అభిరుచులు, కుటుంబ జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Rajeev Rayala
|

Updated on: Nov 28, 2026 | 10:12 PM

Share
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి రోజా.. అటు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన నటన, మాటతీరుతో ప్రేక్షకులకు దగ్గరైన ఆమె.. ఇప్పటికీ పలు టీవీ కార్యక్రమాల ద్వారా అభిమానులను అలరిస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా తన సినీ కెరీర్, వ్యక్తిగత అభిరుచులు, కుటుంబ జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తన అభిమాన హీరో ఎవరు? తనకు ఇష్టమైన నటి ఎవరు? అనే విషయాలను కూడా పంచుకున్నారు.

1 / 5
రాపిడ్ ఫైర్ రౌండ్‌లో తనకు ఎప్పటికీ ఇష్టమైన హీరో ఎవరనే ప్రశ్నకు రోజా ఏమాత్రం ఆలోచించకుండా సూపర్‌స్టార్ కృష్ణ పేరు చెప్పారు. ఆయనతో కలిసి పలు సినిమాల్లో నటించే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నారు. 'తెలుగు వీర లేవరా', 'ఎన్‌కౌంటర్', 'వైభవం', 'సంభవం' వంటి చిత్రాల్లో ఆయనతో కలిసి నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

2 / 5
తనకు అత్యంత ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి అని రోజా వెల్లడించారు. ఆమె అందం, నటన అద్భుతమని ప్రశంసించారు. గ్లామరస్ పాత్రలైనా, హోమ్లీ పాత్రలైనా శ్రీదేవి ఎంతో సహజంగా నటించగలరని చెప్పారు. అందుకే ఆమె అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని తెలిపారు. శ్రీదేవి నటన గురించి ప్రస్తావిస్తూ 'వసంత కోకిల' సినిమాలో ఆమె పోషించిన పాత్రను రోజా ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాలో మానసిక వైకల్యం ఉన్న యువతి పాత్రలో శ్రీదేవి ఎంతో క్యూట్‌గా నటించారని ప్రశంసించారు. అలాంటి విభిన్నమైన పాత్రను తాను చేయలేకపోయాననే చిన్న వెలితి ఇప్పటికీ తనలో ఉందని వెల్లడించారు.

3 / 5
 రోజాకు చీరలంటే ఎంత ఇష్టమో ఆమె మాటల్లోనే అర్థమవుతుంది. తన దగ్గర లెక్కలేనన్ని చీరలు ఉన్నాయని, ఒకట్రెండు సార్లు కట్టిన చీరలను స్నేహితులకు, బంధువులకు ఇచ్చేస్తుంటానని చెప్పారు. చేతిలో డబ్బులు ఉంటే ముందుగా చీరలే కొనుగోలు చేస్తానని తన అభిరుచిని బయటపెట్టారు. ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ రోజా తనకు నాన్‌వెజ్‌లో క్రాబ్, ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఇక వెజిటేరియన్ వంటకాల్లో మాత్రం పులిహోర తన ఫేవరెట్ అని వెల్లడించారు. చిన్నప్పటి నుంచే పులిహోర అంటే ఎంతో ఇష్టమని, 'రాధా యాత్ర' సినిమా షూటింగ్ సమయంలో కేవలం పులిహోర మాత్రమే తిన్న రోజులను గుర్తు చేసుకున్నారు.

4 / 5
 తనకు ఇష్టమైన దైవం ఒక్కరే అని చెప్పలేనని రోజా తెలిపారు. తన పూజగదిలో అన్ని దేవుళ్ల చిత్రాలు ఉంటాయని, అన్ని పండుగలను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటానని చెప్పారు. ప్రతి దేవుడిపై తనకు నమ్మకం ఉందని వివరించారు. ప్రపంచంలోనే తన దృష్టిలో అత్యంత అందమైన మహిళ తన తల్లేనని రోజా భావోద్వేగంగా చెప్పారు. కుటుంబం కోసం ఆమె చేసిన త్యాగాలు, పాటించిన క్రమశిక్షణ తన జీవితంపై ఎంతో ప్రభావం చూపాయని వెల్లడించారు. తల్లి నుంచి నేర్చుకున్న విషయాలే తనను క్రమపద్ధతిలో జీవించేలా చేశాయని పేర్కొన్నారు.

5 / 5
Follow Us