గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు, నటులుగా రాణించాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త. మైత్రి మూవీ మేకర్స్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం RC17 కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమవ్వాలనుకునే కొత్త నటీనటులకు, ఆసక్తి ఉన్న వారికి ఇదొక అద్భుతమైన అవకాశం. చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. “కొత్త ప్రపంచం, సరికొత్త కథ అందులో మీకో పాత్ర ఎదురుచూస్తుంది” అనే ఆకట్టుకునే క్యాస్టింగ్ పిలుపుతో, ప్రతిభావంతులైన నటుల కోసం వెతుకుతున్నారు. ఈ సినిమాలో నటించాలనే అభిరుచి ఉన్నవారు తమ ఆడిషన్ వీడియోలను src17casting@gmail.com కు పంపించాలని మేకర్స్ సూచించారు. ఇతర వివరాల కోసం, ప్రాజెక్టు బృందంతో నేరుగా సంప్రదించడానికి 9110564651 నెంబర్ కు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయవచ్చని తెలిపారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి తెరపై కనిపించేందుకు ఇదొక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. యువ ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మైత్రి మూవీ మేకర్స్ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది.