అబ్బబ్బా.. ఏం అందం భయ్యా.. 43 ఏళ్ల వయసులో పిచ్చెక్కించే ఫిట్‌నెస్..
Rajitha Chanti
Pic credit - Instagram
28 November 2026
దక్షిణాది చిత్రసీమలో దశాబ్దాలుగా తన అందం, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి త్రిష కృష్ణన్ ఫిట్‌నెస్, ఉత్సాహం ఎప్పుడూ ఆకట్టుకుంటాయి.
నిలకడకే త్రిష అధిక ప్రాధాన్యత ఇస్తారని, ప్రతిరోజూ ఏదో ఒక శారీరక వ్యాయామం చేస్తూ వర్కౌట్‌లను అరుదుగా మాత్రమే మానేస్తారని ఆమె దినచర్య వెల్లడిస్తోంది.
జిమ్‌లో గంటల తరబడి గడపడమే కాకుండా, ఇంట్లోనే చురుగ్గా ఉండేందుకు కొత్త మార్గాలను కూడా ఎంచుకుంటూ ఫిట్‌నెస్‌ను సమతుల్యం చేసుకుంటారు.
త్రిష ఫిట్‌నెస్ ప్రణాళికలో యోగా కీలక భాగంగా నిలుస్తుంది. శరీర సౌలభ్యం, భంగిమ, ఏకాగ్రతతో పాటు మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో తోడ్పడుతుంది
వీటితో పాటు పుష్-అప్స్, స్క్వాట్స్, ప్లాంక్స్ వంటి బాడీవెయిట్ వ్యాయామాలు, కండరాల బలం, టోన్డ్ ఫిజిక్ కోసం స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తారు.
అలాగే స్విమ్మింగ్ కూడా ఆమె షెడ్యూల్‌లో ప్రధానమైనది. ఇది శరీరానికి పూర్తి స్థాయి వ్యాయామాన్ని అందిస్తూనే, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
శారీరక వ్యాయామంతో పాటు మానసిక ఆరోగ్యం, ఆహారపు అలవాట్లపై కూడా త్రిష ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. మైండ్‌ఫుల్ ఈటింగ్ అలవాట్లను పాటిస్తారు.
ఒకప్పుడు నడక సరిపోతుందని అనుకునేదానినని, కానీ ఇప్పుడు మరింత శక్తిమంతంగా శిక్షణ తీసుకుంటున్నానని గతంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్