AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సండే స్పెషల్.. స్పైసీ చికెన్ ఫ్రై..ఎలా చేయాలంటే?

చికెన్ ఫ్రై అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ఇక సండే వస్తే చాలు చాలా ఇష్టంగా చికన్ ఫ్రై ప్రిపేర్ చేసుకొని తింటారు. అయితే ఎప్పుడూ చేయని విధంగా ఈ సండే మీరు ఇలా స్పైసీగా చికెన్ ఫ్రై చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

Samatha J
|

Updated on: Nov 28, 2026 | 9:33 PM

Share
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. చికెన్ – 1/2 kg,  ఉప్పు – రుచికి సరిపడా,   పసుపు – 1/4 టీస్పూన్,  అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు , నిమ్మరసం – 2 టీస్పూన్లు, ఉల్లిపాయలు – 1 కప్పు, నూనె – 4 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకులు – 2 ,  కొత్తిమీర. ఇక మసాలా కోసం, మిరియాలు , ధనియాలు వన్ టీ స్పూన్, జీలకర్ర టీ స్పూన్, లవంగాలు రెండు నుంచి మూడు, దాల్చిన  చెక్క, యాలకులు, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు.

1 / 5
తయారీలోకి వెళ్లితే..శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కల్లో 1/2 టీస్పూన్ ఉప్పు, 1/4 టీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. కావాలంటే 2 టీస్పూన్ల నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. దీనిని పది నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌లోనూనె వేయాలి. నూనె వేడయ్యాక, సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయలను వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు బాగా వేయించాలి.

2 / 5
ఉల్లిపాయలు వేగిన తర్వాత, నానబెట్టిన చికెన్ ముక్కలు, 2 తుంచిన బిర్యానీ ఆకులు, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి హై ఫ్లేమ్‌లో రెండు నిమిషాలు వేయించాలి.  రెండు నిమిషాలు వేయించిన తర్వాత, మూతపెట్టి మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికించాలి. ఈ సమయంలో చికెన్ నుండి నీళ్లు ఊరి సగం వరకు ఉడుకుతుంది. మాడిపోకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.

3 / 5
చికెన్ ఉడికేలోపు మసాలా తయారు చేసుకోవాలి, దీని కోసం చికెన్ ఉడికేలోగా, ఒక మిక్సర్ జార్‌లోకి 1 ఫుల్ టీస్పూన్ మిరియాలు, 1 టీస్పూన్ ధనియాలు, 1/2 టీస్పూన్ జీలకర్ర, 5-6 లవంగాలు, 2-3 యాలకులు, చిన్న దాల్చినచెక్క ముక్క, 5-6 ఎండుమిరపకాయలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. తరువాత, 10-11 పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు కలిపి బరకగా గ్రైండ్ చేయాలి. చికెన్ 50 శాతం ఉడికిన తర్వాత, తయారుచేసుకున్న మసాలా పొడి, మరో 1/2 టీస్పూన్ ఉప్పు , కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపాలి.

4 / 5
మళ్ళీ మూతపెట్టి, మీడియం ఫ్లేమ్‌లో 6 నిమిషాలు ఉడికించాలి. నూనె పైకి తేలి, చికెన్ పూర్తిగా ఉడికేంత వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడకబెట్టాలి. చికెన్ ఉడకలేదనిపిస్తే, ఇంకో ఐదు నిమిషాలు మూతపెట్టి ఉడికించవచ్చు. ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత చివరలోకొత్తిమీర వేసి దించేయాలి. అంతే టేస్టీ టేస్టీ స్పై సీ చికెన్ ఫ్రై రెడీ.

5 / 5
Follow Us