రష్యాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రత నమోదు.. 205 కి.మీ. లోతులో కేంద్రం!
రష్యాలోని కమ్‌చట్కా ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. శనివారం (నవంబర్ 28) సాయంత్రం సుమారు 6.45 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రతతో భూమి కంపించింది. భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (NCS) ఈ విషయాన్ని వెల్లడించింది. భూకంపం కారణంగా ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు తక్షణ సమాచారం అందలేదు. అయితే అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

మాస్కో: రష్యాలోని కమ్‌చట్కా ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. శనివారం (నవంబర్ 28) సాయంత్రం సుమారు 6.45 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రతతో భూమి కంపించింది. భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (NCS) ఈ విషయాన్ని వెల్లడించింది. భూకంపం కారణంగా ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు తక్షణ సమాచారం అందలేదు. అయితే అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి సుమారు 205 కిలోమీటర్ల లోతులో ఉంది. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) కూడా భూకంప తీవ్రత 6.7గా నమోదు చేసింది. అయితే దాని అంచనా ప్రకారం భూకంప కేంద్రం 188.4 కిలోమీటర్ల లోతులో ఉంది. కమ్‌చట్కా ద్వీపకల్పంలోని యెలిజోవో పట్టణానికి ఉత్తర-వాయువ్య దిశలో సుమారు 62 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించింది. రెండు సంస్థల అంచనాల్లో లోతు విషయంలో స్వల్ప వ్యత్యాసం ఉన్నప్పటికీ, తీవ్రత విషయంలో ఒకే అభిప్రాయాన్ని వెల్లడించాయి
ప్రకంపనల తీవ్రత తక్కువ
సాధారణంగా భూమికి చాలా లోతులో సంభవించే భూకంపాల ప్రకంపనలు, తక్కువ లోతులో సంభవించే భూకంపాలతో పోలిస్తే ఉపరితలంపై తక్కువ తీవ్రతతో ఉండే అవకాశం ఉంటుంది. అయితే ప్రకంపనలు ఎంత దూరం వరకు వ్యాపిస్తాయన్నది భూకంప తీవ్రత, లోతు, భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
భూకంపాలకు నిలయంగా కమ్‌చట్కా!
రష్యాలోని కమ్‌చట్కా ద్వీపకల్పం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉంది. ఇక్కడ పసిఫిక్ టెక్టోనిక్ ప్లేట్ మరో భౌగోళిక ప్లేట్ కిందకు జారడం వల్ల తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. గతంలోనూ ఈ ప్రాంతం భారీ భూకంపాలకు కేంద్రంగా నిలిచింది. ముఖ్యంగా 2025లో కమ్‌చట్కా ప్రాంతాన్ని 8.8 తీవ్రతతో భారీ భూకంపం కుదిపేసింది. తాజాగా మరోసారి 6.7 తీవ్రతతో భూమి కంపించడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఎలాంటి భారీ నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం లేదు. పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
EQ of M: 6.7, On: 28/11/2026 18:45:09 IST, Lat: 53.667 N, Long: 158.030 E, Depth: 205 Km, Location: Russia. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @tummalasrini @GSuresh_NCS @ndmaindia https://t.co/eApKhYT6vB
— National Center for Seismology (@NCS_Earthquake) November 28, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
