AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో వల్లే నా కెరీర్ మారింది.. నితిన్ “అలియాస్ రుక్మిణి” డైరెక్టర్ ఎమోషనల్ !!

మురళీకాంత్ దేవసోత్.. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం నితిన్‌తో ‘అలియాస్ రుక్మిణి’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో దీప్తి గంటా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

ఆ హీరో వల్లే నా కెరీర్ మారింది.. నితిన్ అలియాస్ రుక్మిణి డైరెక్టర్ ఎమోషనల్ !!
Director Muralikanth
Korivi Jayakumar
|

Updated on: Nov 28, 2026 | 8:40 PM

Share

మురళీకాంత్ దేవసోత్.. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. రచయితగా “నీ కథే నా కథ” అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ తర్వాత శివాజీ, నందు, నవదీప్ ముఖ్య పాత్రల్లో నటించిన “దండోరా” చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు. సహజత్వానికి దగ్గరగా ఉండే కథను ఎంచుకున్నారంటూ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ నితిన్‌తో ‘అలియాస్ రుక్మిణి’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో దీప్తి గంటా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కాగా ఈ చిత్రంలో అఫియా సయ్యద్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. హర్షవర్ధన్, సాయికుమార్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా.. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల ప్రసాద్ ల్యాబ్స్‌లో డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమాను ప్రదర్శించగా అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చిందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో నితిన్ నటన అందరినీ కంటతడి పెట్టిస్తుందని అంటున్నారు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దండోరా సినిమా విడుదల సమయంలో ఎదురైన చేదు అనుభవాలను మురళీకాంత్ గుర్తుచేసుకున్నారు.

దండోరా వివాదం.. ఎన్టీఆర్ సపోర్ట్

దండోరా సినిమాకు మంచి కంటెంట్ ఉన్నప్పటికీ.. ఆ సమయంలో నటుడు శివాజీ మహిళలు, వారి దుస్తులపై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. దీంతో సినిమాలోని అసలు విషయం పక్కకుపోయి, ఆ వివాదమే హైలైట్ అయిందని, ఫలితంగా తనకు రావాల్సిన గుర్తింపు దక్కలేదని మురళీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి క్లిష్ట సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఒక్క ట్వీట్ తన కెరీర్‌ను మలుపు తిప్పిందని ఆయన తెలిపారు. వివాదం కారణంగా సినిమా బాగున్నా బయటకు వచ్చి మెచ్చుకోవడానికి ఇండస్ట్రీ వాళ్లు వెనుకాడారని, కానీ ఎన్టీఆర్ ట్వీట్ తర్వాతే పలువురు తనను పిలిచి అభినందించారని మురళీకాంత్ వెల్లడించారు.

మరోవైపు హీరో నితిన్ కెరీర్ విషయానికొస్తే.. ‘భీష్మ’ తర్వాత ఆయనకు సరైన సక్సెస్ దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. మరి మురళీకాంత్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంతో అయినా నితిన్‌కు భారీ కమ్‌బ్యాక్ వస్తుందో లేదో చూడాలి.

Follow Us