AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HP కొత్త మోడల్ ల్యాప్​టాప్‌ ధరతో లగ్జరీ కారు కొనేయొచ్చు.. నెట్‌ లేకుండా ఆ ఫీచర్లు పనిచేస్తాయా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పనిచేసే డెవలపర్లు, హైఎండ్ కంటెంట్ క్రియేటర్ల కోసం ప్రముఖ టెక్ సంస్థ HP సరికొత్త ప్రీమియం ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. HP OmniBook Ultra 16 పేరుతో విడుదలైన ఈ ల్యాప్‌టాప్‌ సాధారణ కంప్యూటింగ్ పనులకే కాకుండా భారీ AI ప్రాజెక్టులను నిర్వహించేందుకు ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో NVIDIA RTX Spark N1X ప్లాట్‌ఫామ్‌ను అందించడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. క్లౌడ్ ఇంటర్నెట్‌పై ఆధారపడకుండా నేరుగా ల్యాప్‌టాప్‌లోనే AI మోడల్స్‌ను రన్ చేసే సామర్థ్యం దీని ప్రత్యేకత.

HP కొత్త మోడల్ ల్యాప్​టాప్‌ ధరతో లగ్జరీ కారు కొనేయొచ్చు.. నెట్‌ లేకుండా ఆ ఫీచర్లు పనిచేస్తాయా?
Hp Omnibook Ultra 16
Nikhil
|

Updated on: Nov 28, 2026 | 8:15 PM

Share

భారీ కంప్యూటింగ్ అవసరాలు ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని HP OmniBook Ultra 16 శక్తివంతమైన ప్రాసెసింగ్ వ్యవస్థ, అధిక RAM, OLED డిస్‌ప్లే వంటి ఫీచర్లను అందించారు. ముఖ్యంగా AI మోడల్స్, AI ఏజెంట్లు, కోడింగ్, వీడియో ఎడిటింగ్, 3D డిజైనింగ్ వంటి పనులు చేసే వారికి ఈ ల్యాప్‌టాప్ ఉపయోగపడనుంది. అయితే ఇందులోని హైఎండ్ హార్డ్‌వేర్‌కు అనుగుణంగానే ధరను కూడా ప్రీమియం స్థాయిలో నిర్ణయించారు.

NVIDIA RTX Spark N1X ప్లాట్‌ఫామ్‌తో AI పనితీరు

HP OmniBook Ultra 16లో 20-కోర్ CPUతో పాటు 6,144-కోర్ Blackwell RTX GPU కలిగిన NVIDIA RTX Spark N1X ప్లాట్‌ఫామ్‌ను అందించారు. ఇది ఒక పెటాఫ్లాప్ స్థాయి AI పనితీరును అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. భారీ Large Language Models, AI ఏజెంట్లను ల్యాప్‌టాప్‌లోనే స్థానికంగా రన్ చేసేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఇందులో 64GB నుంచి గరిష్టంగా 128GB వరకు Unified RAM ఆప్షన్లు, 1TB స్టోరేజ్ ఉన్నాయి.

వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ కోసం 16 ఇంచుల 3K OLED టచ్‌స్క్రీన్ ఇచ్చారు. ఇది 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌, 100 శాతం కలర్ కవరేజీ, True Black సర్టిఫికేషన్‌తో వస్తుంది. NVIDIA Studio టెక్నాలజీ, Ray Tracing సపోర్ట్‌ కూడా ఉన్నాయి. దీంతో 8K వీడియో ఎడిటింగ్, భారీ 3D రెండరింగ్ పనులను నిర్వహించవచ్చు.

140W ఫాస్ట్ ఛార్జింగ్

ఈ ల్యాప్‌టాప్‌లో 99Wh బ్యాటరీని అందించారు. బాక్స్‌లోనే 140W ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. అల్యూమినియం బాడీతో రూపొందించిన ఈ డివైజ్‌ బరువు 2.22 కిలోలు. వేడి నియంత్రణ కోసం ప్రత్యేకమైన Tower Hinge, Thermal Cooling డిజైన్‌ను ఉపయోగించారు. వీడియో కాల్స్ కోసం 5MP IR కెమెరా, Poly Studio ట్యూనింగ్‌తో కూడిన క్వాడ్ స్పీకర్లు, Gesture Controls ఉన్న Haptic Touchpad ఉన్నాయి.

కనెక్టివిటీ కోసం Wi-Fi 7, రెండు USB Type-C పోర్టులు, రెండు USB Type-A పోర్టులు, HDMI 2.1, MicroSD కార్డ్ రీడర్ అందించారు. ధర విషయానికి వస్తే HP OmniBook Ultra 16 ప్రారంభ వేరియంట్ ధర రూ.5,49,999గా ఉంది. 128GB RAM కలిగిన టాప్‌ ఎండ్ వేరియంట్ ధర రూ.6,99,999గా నిర్ణయించారు. Eclipse Gray రంగులో HP అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Follow Us