ఆక్సిజన్ లేకుండా ఈ భూమిపై జీవింటే ప్రత్యేకమైన జీవులు ఇవే! 

 19 Sep 2026

Anand T

సమస్త జీవకోటికి ప్రాణాధారం ఆక్సిజన్.. అది లేకుండా జీవం మనుగడ సాగించడం కష్టం. కానీ, ఈ ప్రకృతిలో ఆక్సీజన్ లేకుండా కూడా బతికే జీవులు ఉన్నాయని మీకు తెలుసా?

ప్రాణవాయువు

ఇది కూడా ఆక్సిజన్ లేకుండా బ్రతికే సూక్ష్మజీవి ఇవి అత్యంత ఉప్పు ఉన్న వాతావరణంలో, ఆక్సిజన్ లేని క్లిష్ట పరిస్థితుల్లో కూడా జీవిస్తాయి.

హాలోఆర్కియా 

ఇదో పరాన్నజీవి.. సాల్మన్ చేపల కణజాలంలో జీవించే దీనికి.. శ్వాస తీసుకోవడానికి అవసరమైన మైటోకాండ్రియల్ జన్యువులే ఉండవు. ఆక్సిజన్ లేకుండా బతికే తొలి బహుకణ జీవి ఇదే.

హెన్నెగుయా సాల్మినికోలా 

మధ్యధరా సముద్రంలో ఆక్సిజన్ ఏమాత్రం లేని అత్యంత లోతైన ప్రాంతాల్లో ఈ సూక్ష్మజీవులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి కూడా ఆక్సిజన్ లేకుండానే జీవిస్తాయి. 

లోరిసిఫెరాన్స్

ఈ రకానికి చెందిన కొన్ని బల్లపరుపు పురుగులు వాయురహిత శ్వాసక్రియ కలిగి ఉంటాయి. అందుకే ఇవి ఆక్సిజన్ లేకుండా జీవించగలవు.

ప్లనేరియన్ 

ఇవి వేడి నీటి బుగ్గలు, అగ్నిపర్వత బిలాల వద్ద ఎక్కువగా జీవిస్తాయి. ఇవి అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలను, అతి తక్కువ ఆక్సిజన్ ఉన్న ప్రాంతాల్లో ఉంటాయి.

పాంపీ వార్మ్

ఇవి లోతైన సముద్రపు అడుగుభాగంలో ఉంటాయి. ఇవి తమ జీవక్రియను బాగా నెమ్మదించడం ద్వారా అతి తక్కువ ఆక్సిజన్‌తో మనుగడ సాగిస్తాయి.

సీ కుకుంబర్

ఎలుగుబంటి ఆకారంలో ఉండే ఈ మైక్రోస్కోపిక్ జీవులకు సైతం ఆక్సిజన్ అవసరం లేదు. కానీ ఆక్సిజన్ లేని పరిస్థితులు ఎదురైనప్పుడు. ఇవి తమ జీవక్రియను పూర్తిగా నిలిపివేసి క్రిప్టోబయోటిక్ స్థితికి చేరుకుని ప్రాణాలను కాపాడుకుంటాయి. 

టార్డిగ్రేడ్