రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి

Samatha

5 June 2026

కాఫీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే ఎప్పుడూ కాఫీ తాగి చాలా మందికి బోర్ కొడుతుంది. అయితే మీకు కూడా అలానే ఉందా?

కాఫీ

అయితే ఎప్పుడూ తాగే రెగ్యులర్ కాఫీ కాకుండా, కాస్త కొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదంట.

బనానా కాఫీ

కాగా, ఇప్పుడు మనం బనానా కాఫీ ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏవో చూసేద్దాం. దీనిని మూడు విధాలుగా తయారు చేసుకోవచ్చునంట.

బనానా కాఫీ తయారీ

హాట్ బనానా కాఫీ ,కోల్డ్ బనానా డాల్గోనా కాఫీ,బనానా కోల్డ్ కాఫీ. కాగా ఇప్పుడు మనం హాట్ బనానా కాఫీ ఎలా చేయాలో చూసేద్దాం.

బనానా కాఫీ రకాలు

హాట్ బనానా కాఫీ  కోసం కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే, అరటి పండు బాగా పండినది, పాలు ఒక కప్పు, కాఫీ పౌడర్, పంచదార, దాల్చిన చెక్క పొడి చిటికెడు.

కావాల్సిన పదార్థాలు

తయారీ విధానంలోకి వెళితే, మిక్సీలో అరటి పండు, వేడి పాలు, కాఫీ పౌడర్, పంచదార వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తయారీ విధానం

ఈ మిశ్రమాన్ని గ్లాస్‌లో వేసుకోవాలి. తర్వాత అందులో కొన్ని వేడి పాలు కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి.

మిశ్రమం 

తర్వాత దానిపై చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ వేసుకోవాలి. అంతే మీ కోసం టేస్టీ టేస్టీ హాట్  బనానా కాఫీ రెడీగా ఉంది. మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి.

బనానా కాఫీ రెడీ