మొలకలు వచ్చిన బంగాళాదుంపలు తింటున్నారా.. మీ ప్రాణం డేంజర్‌లో పడ్డట్లే!

Samatha

1 jun 2026

బంగాళదుంపలు చాలా మందికి ఇష్టం ఉంటుంది. వీటితో ఏ కర్రీ చేసుకున్నా టేస్ట్ అదిరిపోద్దీ, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది.

బంగాళాదుంపలు

అందుకే మార్కెట్‌కు వెళ్లిన ప్రతి సారి బంగాళదుంపలు కొనుగోలు చేస్తుంటారు. అయితే వాటిని వెంటనే వండుకుంటే మంచిదే, కానీ కొందరు ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేస్తారు.

కొనుగులో చేయడం

దీంతో బంగాళదుంపలకు ఎక్కువగా మొలకలు వస్తుంటాయి. దీంతో వాటిని తీసి వేసి వాటితో కర్రీ ప్రిపేర్ చేసి తింటుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంట.

మొలకలు ఉన్న దుంపలు

మొలకలు వచ్చిన బంగాళదుంపలు తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు రావడమే కాకుండా, మీ ప్రాణం కూడా డేంజర్‌లో పడ్డట్లేనంట.

ఆరోగ్య సమస్యలు

బంగాళదుంపలకు మొలకలు వచ్చాయంటే అందులో సొలనైన్, చాకోనైన్ అనే విష పదార్థాలు తయారవుతాయంట. ఇవి శరీరానికి చాలా హాని చేస్తాయి.

విషపదార్థాలు

ఎక్కువగా మొలకలు వచ్చి,  అవి పచ్చగా మారాయి అంటే ఎట్టి పరిస్థితుల్లో వాటిని తినకూడదంట. ఇవి వికారం, తలనొప్పి ,వాంతులు వంటి సమస్యలకు కారణం అవుతాయి.

వికారం, తలనొప్పి

ముఖ్యంగా మొలకులు ఉన్న బంగాళ దుంపలు తినడం వలన కడుపు నొప్పి, మొత్తం నాడీ వ్యవస్థ దెబ్బతినే పరిస్థితులు ఎదురు అయ్యే ఛాన్స్ ఉన్నదంట.

నాడీ వ్యవస్థ దెబ్బతినడం

అందువలన  వీలైనంత వరకు మొలకలు వచ్చిన బంగాళదుంపలు తినకపోవడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

తినకూడదు