చీరలో ఎంత ముద్దుగుందో.. బంగారంతో బంగారంలా మెరిసిపోతున్న బ్యూటీ!

Samatha

29 May 2026

తెలుగు బుల్లితెర ద్వారా పరిచయం అయిన ముద్దుగుమ్మ కావ్య శ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

బుల్లితెర బ్యూటీ

ఈ బ్యూటీ గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు అభిమానులకు పరిచయం అయ్యింది. ఈ సీరియల్‌తో తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా, చాలా పాపులారిటీ సంపాదించుకుంది.

గోరింటాకు సీరియల్

ఇక ఈ అమ్మడు ఈ సీరియల్ యాక్టర్ నిఖిల్‌తో ప్రేమాయణం నడిపింది. అంతే కాకుండా తనతో పెళ్లికి సిద్ధమైనట్లు కూడా అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

నిఖిల్‌తో ప్రేమాయణం

కానీ అనుకోకుండా వీరు బ్రేకప్ తీసుకొని విడిపోయారు. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 8లో ఈ విషయాన్ని నిఖిల్ హౌస్ మెంట్స్‌తో పంచుకోవడంతో, కావ్య మరింత ఫేమస్ అయ్యింది.

బ్రేకప్

దీని తర్వాత కూడా ఇద్దరు పలు షోలలో పాల్గొనడం, ఇలా ఒక్కసారిగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకోవడమే కాకుండా, కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.

విపరీతమైన పాపులారిటీ

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంటుంది. తన క్యూట్‌నెస్‌తో ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్

తాజాగా ఈ బ్యూటీ చీరలో అందంగా రెడీ, అయ్యి ఒంటి నిండా నగలతో, అందంగా ముస్తాబైన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

బ్యూటిఫుల్ ఫొటోస్

దీంతో ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన అభిమానులు ఒంటి నిండా బంగారంతో బంగారంలా మెరిసిపోతున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వైరల్ ఫొటోస్