వర్షాకాలం ప్రారంభం.. జూన్‌లో ఈ  ప్లేసెస్‌కి వెళితే స్వర్గమే..

samatha

23 may 2026

జూన్ నెల వచ్చేస్తోంది. ఇప్పుడు కాస్త ఎండలు తగ్గి, వాతావరణం చల్లగా మారుతుంది. అయితే ఈ సమయంలో తప్పకుండా కొన్ని ప్రదేశాలు చుట్టేయాలంట. అవి ఏవి అంటే?

జూన్ నెల

మున్నార్ వర్షాకాలం ప్రారంభంలో జూన్ నెలలో తప్పక చూడాల్సిన ప్రదేవాల్లో మున్నార్ ముందుంటుంది. పొగ మంచు, తేయాకు తోటల మధ్య ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చును.

మున్నార్

కూర్గ్, కర్ణాటక, ఈ ప్రదేశం గురించి ఎంత చెప్పినా తక్కువే, వర్షం ముద్దాడే కాఫీ తోటలు, అందమైన చిరు జల్లుల మధ్య ఎంజాయ్ చేయడానికి జూన్ నెల చాలా బెస్ట్.

కూర్గ్, కర్ణాటక

వయనాడ్, కేరళ , వర్షాకాలం ప్రారంభంలో వయనాడ్ చాలా అద్భుతంగా ఉంటుంది. దట్టమైన అడువులు, పొగ మంచుతో నిండిన కొండలు, జలపాతాలతో చాలా అద్భుతంగా కనిపిస్తుంది.

వయనాడ్, కేరళ

ఊటీ, తమిళనాడు, వర్షాకాలంలో నీలగిరి కొండలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. వర్షకాలంలో ఇక్కడ ఉండే ఎంజాయ్ మెంట్ మాములుగా ఉండదు. అందుకే తప్పనిసరిగా ఈ ప్రదేశం సందర్శించాల్సిందే.

ఊటీ, తమిళనాడు

అలాగే తమిళనాడులోని కొడైకనాల్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందమైన లోయలు, జలపాతాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. టూర్ ప్లాన్ చేసే వారికి ఇది బెస్ట్ ప్లేస్.

తమిళనాడు,కొడైకనాల్

అల్లెప్పి, కేరళ .. కేరళలోని అల్లెప్పి బెస్ట్ ప్లేస్. ఇక్కడి సరస్సు అందమైన తోటలు, పచ్చటి ప్రకృతి మధ్య ఆనందంగా గడపవచ్చును. ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

అల్లెప్పి, కేరళ

విశాలమైన కాఫీ తోటలు, పొగమంచుతో కప్పిన కొండలు, దట్టమైన అడవి, అత్యంత సుందరమైన చిక్ మంగళూరు కర్ణాటకలోనే బెస్ట్ ప్లేస్. జూన్‌లో వెళ్లడానికి మంచి ప్లేస్ ఇది.

చిక్ మంగళూరు ,కర్ణాటక