దంచి కొడుతున్న ఎండలు.. వడ దెబ్బ తగిలితే వెంటే ఏం చేయాలో తెలుసా?

samatha

21 may 2026

ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. రోహిణి కార్తె ప్రారంభం కాక ముందే సూర్యుడి భగ భగలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఎండలు

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలో ఉదయం 10 దాటిందంటే చాలు ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో బయటకు వెళ్లాలి అంటే భయపడి పోతున్నారు.

భానుడి భగ భగలు

చాలా మంది వడదెబ్బ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా,  వడదెబ్బ తగిలినప్పుడు వెంటనే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వడ దెబ్బ

వడ దెబ్బ తగిలిన వెంటనే ముందుగా తన బట్టలు వదులు చేసి, శరీరానికి సరిగ్గా గాలి తగిలేలా చేయాలి. దీని వలన శరీరం చల్లబడుతుంది.

చేయాల్సిన పనులు

అలాగే ముఖంపై కొన్ని నీటిని జల్లించి, నీరు తాగించాలి. దగ్గరిలో ఉన్న చెట్టు లేదా ఫ్యాన్ కిందకు తీసుకెళ్లాలి. గాలి బాగా వచ్చేలా చూడాలి.

గాలి వచ్చేలా చూడటం

ఏదైనా క్లాత్‌ను నీటితో తడిపి అతడి శరీరాన్ని పూర్తిగా తుడవాలి.  వడదెబ్బ తగిలిన వ్యక్తి చుట్టూ జనం గుమిగూడకుండా చూసుకోవాలి. లేకపోతే అతనికి గాలి ఆడదు.

క్లాత్ తో తుడవడం

అదే విధంగా తప్పకుండా మజ్జిగా లేదా కొబ్బరి నీళ్లు తాగించాలి. ఇది డీ హైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది. శరీరానికి చల్లదనం ఇస్తుంది.

నీళ్లు తాగించడం

అంతే కాకుండా వడదెబ్బ బారిన పడకుండా ఉండటానికి ఎక్కువ సేపు ఎండలో తిరగకూడదు, పండ్ల రసాలు ఎక్కువ తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

వాటర్ బాటిల్ తప్పనిసరి