మీ పిల్లల్లో తెలివి తేటలు పెరగాలా? తప్పక పెట్టాల్సిన ఫుడ్ ఇదే!

samatha

18 may 2026

పిల్లల ఆరోగ్యం బాగుండి వారి మైండ్ షార్ప్‌గా పని చేయాలి అంటే తప్పకుండా వాళ్లకు కొన్ని రకాల ఫుడ్ పెట్టాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

పిల్లలు

పిల్లలో మైండ్ పవర్‌ను పెంచడం లో సాల్మన్ ఫిష్ ముందుంటుంది. ఇందులో ఓమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మోతాదులో ఉండటం వలన ఇది పిల్లల మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది.

సాల్మాన్ ఫిష్

పాల కూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రక్తహీనతను తరిమి కొట్టడమే కాకుండా, పిల్లల్లో తెలివి తేటలను పెంచుతుంది.

పాలకూర

బ్లూ బెర్రీస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, అంథోసైనిస్స్ ఎక్కువగా ఉండటం వలన ఇది పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది.

బ్లూ బెర్రీస్

ఉడక బెట్టిన కోడి గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రోటీన్ మాత్రమే కాకుండా ఇందులో కోలిన్ ఉంటుంది. ఇది జ్ఞాపక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది.

ఉడకబెట్టిన గుడ్డు

అవకాడో కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పిల్లలకు కనీసం వారంలో రెండు సార్లు ఇవ్వడం వలన ఇది మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది.

ఆవకాడో

అలాగే ఉడక బెట్టిన శనగలు, పెసర్లు, రాగి జావ , ఆకు కూరలు పిల్లల డైట్‌లో తప్పక ఉండాలి. ఇవి పిల్లల ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు చాలా మంచిది.

ఉడకబెట్టిన శనగలు