నెల రోజులైనా పాడవదు.. కొత్తిమీర ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయాల్సిందే!

samatha

14 may 2026

ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే వాటిలో కొత్తిమీర చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ మార్కెట్‌కు వెళ్లినప్పుడు తప్పనిసరిగా దీనిని కొనుగోలు చేస్తారు.

కొత్తిమీర

కొత్తి మీర కూరల్లో వేయగానే అద్భుతమైన రుచి వస్తుంది. అంతే కాకుండా దీనిని తినడం వలన కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.

ఆరోగ్య ప్రయోజనాలు

అయితే కొంత మంది కొత్తి మీర తెచ్చిన వెంటనే పాడవుతుందని చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ అదిరిపోయే చిట్కాలు.

అదిరిపోయే చిట్కాలు

చాలా మంది కొత్తిమీర మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వెంటనే దానిని ఎక్కువగా క్లీన్ చేస్తుంటారు. కానీ ఎప్పుడూ కూడా అలా చేయకూడదంట.

క్లీన్ చేయకూడదు

అలాగే కొత్తి మీర తాజాగా ఉండాలి అంటే, దానిని వేర్లు తీసి వేసి, గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.

గాలి చొరబడని డబ్బాలో వేయడం

లేదా ఒక గ్లాస్ తీసుకోని అందులో సగం వరకు నీళ్లు పోసి, వేర్లతో సహా అందులో కొత్తి మీర వేయడం వలన ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

గ్లాస్ లో నీరు పోసి స్టోర్ చేయడం

అలాగే ఎప్పుడూ కూడా కొత్తి మీరను ఫ్రిజ్‌లో పెట్టే సమయంలో కవర్ లేకుండా పెట్ట కూడదు, దీని వలన త్వరగా పాడవుతుంది.

ఫ్రిజ్‌లో కవర్‌లో పెట్టి పెట్టడం

ముఖ్యంగా కొత్తిమీరను గ్రైండ్ చేసి, ఐస్ ట్రేలో ఫ్రిజ్ లో పెడితే, దాదాపు దీనిని నెల నుంచి మూడు నెలల పాటు వాడుకోవచ్చునంట.

ఐస్ క్యూబ్ చేసి