ప్రతి ఒకరి వంట గదిలో అలాగే ఇంటి గార్డెన్‌లలో ఉండే మొక్కల్లో కరివేపాకు మొక్క తప్పకుండా ఉంటుంది.
కరివేపాకు
కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది తప్పకుండా కరివేపాకును తమ ఆహారంలో చేర్చుకుంటారు.
ఆరోగ్యానికి మేలు
అయితే కొంత మంది కరివేపాకును ఆహారంలో నుంచి తీసి పారేస్తుంటారు. కానీ దీనిని క్రమం తప్పకుండా తినడం వలన బోలెడు లాభాలు ఉన్నాయంట. అవి ఏవో చూద్దాం.
లాభాలు
కరివేపాకులో ఐరన్, బీటా కెరోటిన్ వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన తెల్ల జుట్టు తగ్గుతుందంట. జుట్టు వేగంగా పెరుగుతుంది.
ఐరన్ ,బీటా
అదే విధంగా ప్రతి రోజూ కరివేపాకు ఆకులను నమలడం వలన ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి, షుగర్ కంట్రోల్ అయ్యేలా చేస్తది.
షుగర్ కంట్రోల్
అంతే కాకుండా జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ప్రతి రోజూ కరివేపాకు తినడం వలన ఇది కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది.
జీర్ణక్రియ ఆరోగ్యం
అంతే కాకుండా తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. జీర్ణక్రియకు చాలా మంచిది.
మలబద్ధకం
అదే విధంగా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చెడు కొలెస్ట్రాల్ LDL తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. గుండె జబ్బులు, బీపీ రాకుండా అడ్డుకుంటుంది.