వేసవిలో ఎన్ని సార్లు స్నానం చేయాలో తెలుసా?

samatha

21 may 2026

వేసవి వస్తే చాలు చాలా మంది అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడతారు. ముఖ్యంగా శరీరం దుర్వాసన, చెమట వంటి సమస్యలు వేధిస్తుంటాయి.

వేసవి

అయితే సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది మందిలో మెదిలే ప్రశ్న అసలు ఈ వేసవిలో ఎన్ని సార్లు స్నానం చేయాలి. కాగా, దీని గురించి డాక్టర్ దీపాలి భరద్వాజ్ ఏం చెప్పారో చూద్దాం.

స్నానం చేయడం

చాలా మంది సమ్మర్ వచ్చిందంటే చాలు రెండు లేదా మూడు సార్లు స్నానం చేస్తుంటారు. కానీ ఇది మంచిది కాదు, అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.

నిపుణుల సమాచారం

ఎందుకంటే అతిగా స్నానం చేయడం వలన చర్మంపై ఉండే సహజ నూనెల సున్నితత్వం దెబ్బతింటుంది. చర్మం పొడి బారి, చర్మ పాడవుతుందంట.

చర్మ సమస్యలు

ఒక వేళ అధిక ఉష్ణోగ్రత, అధిక చెమట, శరీరం నుంచి దుర్వాసన వస్తే తప్పకుండా రోజుకు రెండు సార్లు స్నానం చేయాలి. దీని వలన ఇది చర్మపు మడతలలో ఉన్న బ్యాక్టీరియాను తెలిగిస్తుంది.

రోజుకు రెండు సార్లు

శారీరక శ్రమ లేకుండా, ఇంటిలోనే ఉండే వ్యక్తులు రోజుకు ఒకసారి స్నానం చేస్తే సరిపోతుందంట. ఎందుకంటే వీరి శరీరం అంతగా ఎండకు ప్రభావితం కాదు.

శారీరక శ్రమ

వేడికి గురి అయ్యేవారు, ప్రయాణాలు చేసే వారు, ప్రతి రోజూ వర్క్ అవుట్ చేసేవారు, తమ శరీరం నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించుకోవడానికి రెండు సార్లు స్నానం చేయాలంట.

వేడికి గురి అయ్యేవారు

ఎక్కువ సార్లు స్నానం చేయడం వలన చర్మం మరింత త్వరగా పొడిబారుతుంది.  అంతే కాకుండా దురద వంటి చర్మ సమస్యలు ఏర్పడుతాయి.

చర్మం పొడిబారడం